Dharani | నకిలీ సర్వేనంబర్లకు చెక్.. ధరణిలో కొత్తగా ఐదు మాడ్యూల్స్
ప్రభుత్వం ధరణిలో కొత్తగా ఐదు మాడ్యూల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ధరణి సేవలను విస్తృతం చేయడంతోపాటు కొన్ని చిన్న చిన్న లోపాలను సవరించే లక్ష్యంతో వీటిని జత చేసింది.
- అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర సర్కారు
Dharani | హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ధరణిలో కొత్తగా ఐదు మాడ్యూల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ధరణి సేవలను విస్తృతం చేయడంతోపాటు కొన్ని చిన్న చిన్న లోపాలను సవరించే లక్ష్యంతో వీటిని జత చేసింది. కొత్త మాడ్యూల్స్‌తో నకిలీ ఖాతాలకు చెక్ పడటంతోపాటు సర్వే నంబర్ లేని నోషనల్ ఖాతాలకు సర్వే నంబర్లు రానున్నాయి.
1 డిలిటేషన్ ఆఫ్ ఫిక్టీషియస్ సర్వే/సబ్ డివిజన్ నంబర్: గతంలో అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వల్ల ధరణిలోకి చేరిన నకిలీ సర్వే నంబర్లు, ఒకే నంబర్ రెండుసార్లు నమోదు కావడం (డబుల్ సర్వేనంబర్లు) వంటివాటిని పరిష్కరించవచ్చు. దీనిని తాసిల్దార్ లాగిన్‌లో జత చేశారు.
2 మాడిఫై ఆర్గనైజేషన్ పీపీబీ: కంపెనీలకు మంజూరు చేసిన పట్టాదారు పాస్‌బుక్‌లో ఏవైనా తప్పులుంటే సవరించుకొనేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటివరకు రైతుల పాస్‌బుక్‌లో కరెక్షన్కు అవకాశం ఉండగా, ఈ సేవలను మరింత విస్తరించారు. సవరించే అధికారాన్ని కలెక్టర్ లాగిన్‌లో పొందుపరిచారు.
3 ఆధార్ రిమూవల్ అండ్ అన్‌సైన్ ఖాతా: గతంలో ఆధార్ సీడింగ్ సమయంలో అధికారుల తప్పిదం వల్ల ఒకరి భూమికి మరొక వ్యక్తి ఆధార్ అనుసంధానం అయ్యింది. దీనిని సవరించేందుకు తాసిల్దార్ లాగిన్‌లో అవకాశం కల్పించారు.
4 మిస్సింగ్ సర్వే నంబర్ ఫర్ నోషనల్ ల్యాండ్స్: పట్టాభూముల్లో నాలా కన్వర్షన్ అయిన భూములు, ఇంటి జాగాలు వంటివాటిల్లో కొన్నింటికి సర్వే నంబర్లు కేటాయించలేదు. మరికొన్ని సందర్భాల్లో ప్రభుత్వ భూములకు కూడా సర్వే నంబర్లు లేవు. ఇలాంటివాటికి సర్వే నంబర్లు ఇచ్చేందుకు ఈ మాడ్యూల్‌ను జత చేశారు. దీనిని సిటిజన్ లాగిన్‌లో జత చేశారు.
5 డిలిటేషన్ ఆఫ్ సోల్డ్ఔట్ కేస్: కొన్ని సందర్భాల్లో రైతు తన భూమిలో కొంత అమ్మినప్పుడు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తయ్యి కొన్న వ్యక్తి పేరుమీద పట్టా మంజూరైనా.. రైతు ఖాతాలో ఆ మేరకు విస్తీర్ణం తొలిగిపోలేదు. పాత విస్తీర్ణమే కొనసాగుతున్నది. ఇలాంటి వాటిని గుర్తించి సవరించేందుకు కలెక్టర్ లాగిన్‌లో అవకాశం కల్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

