తెలుగు సినిమా అదృష్టంపై ఆధారపడే పరిశ్రమ. ఇక్కడ హిట్టే ముఖ్యం. విజయాలే ఇక్కడ అవకాశాలు తెచ్చిపెడుతుంటాయి. అందుకే ఉన్నంతలో విభిన్న కథల్ని ఎంచుకుంటూ ముందుకెళ్తున్నది తెలుగమ్మాయి రీతూ వర్మ.
రీతూవర్మ, సూర్య వశిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ‘దేవిక అండ్ డానీ’ వెబ్ సిరీస్ ఈ నెల 6 నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.