పెండ్లిండ్ల సీజన్ మళ్లీ మొదలైంది. కొద్దిరోజుల నుంచి మంచి ముహూర్తాలు లేక వివాహాలు పెద్దగా జరుగలేదు. ఈ నెల నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వరుసగా కల్యాణ గడియలు వచ్చాయి.
‘పెండ్లికి భాజా మోగింది.. కుమారి శ్రీమతి కానుంది..’ అనే పాటలతో పెండ్లి సందడి మొదలైంది. ఆషాఢం, అధిక శ్రావణ మాసాలతో రెండు నెలలపాటు శుభ ముహూర్తాలు లేకపోవడంతో పెండ్లిళ్లకు బ్రేక్ పడింది. శనివారం నుంచి మంచి ము�