‘పెండ్లికి భాజా మోగింది.. కుమారి శ్రీమతి కానుంది..’ అనే పాటలతో పెండ్లి సందడి మొదలైంది. ఆషాఢం, అధిక శ్రావణ మాసాలతో రెండు నెలలపాటు శుభ ముహూర్తాలు లేకపోవడంతో పెండ్లిళ్లకు బ్రేక్ పడింది. శనివారం నుంచి మంచి ముహూర్తాలు ఉండడంతో సందడి మొదలైంది. ఆ తర్వాత బాధ్రపద మాసంలో నెల రోజులు బ్రేక్ పడనుం డడంతో నిజ శ్రావణంలోనే పెళ్లి తంతు పూర్తి చేయాలని వధూవరుల కుటుంబాలు భావిస్తున్నాయి. పెండ్లితో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25 రంగాలకు చెందిన వేలాది మంది ఉపాధి పొందుతారు. ఇప్పటికే కల్యాణ మండపాల నిర్వాహకులు, ఈవెంట్ ఆర్గనైజర్లు, దుకాణాదారులు బిజీగా మారారు.
– సారంగాపూర్/సోన్, ఆగస్టు 20
పెళ్లంటే పండగే. రెండు జంటల కలయిక. ఎన్నో కుటుంబాల్లో సంతోషాల్ని నింపే అపురూప వేదిక. 20-25 రంగాలకు చెందిన వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించే రంగం. జూన్ 19వ తేదీ నుంచి ఆషాఢమాసం కాగా.. అప్పటి నుంచి ఆగిన పెళ్లి భాజాలు శనివారం నుంచి మళ్లీ మోగుతున్నాయి. ఆషాఢం, అధిక శ్రావణ మాసాలతో రెండు నెలలపాటు శుభ ముహూర్తాలు లేకుండాపోయాయి. ప్రస్తుతం నెల రోజులపాటు మంచి రోజులు ఉండడం, ఆ తర్వాత బాధ్రపద మాసంతో మళ్లీ ముహూర్తాలకు నెల రోజులు బ్రేక్ పడనుంది. దీంతో నిజశ్రావణంలోనే పెళ్లి తంతు పూర్తి చేయాలని వధూవరుల కుటుంబాలు ముహూర్తాలు ఖరారు చేసుకుంటున్నాయి.
– సారంగాపూర్/సోన్, ఆగస్టు 20
రెండు నెలల తర్వాత ముహూర్తాలు రావడం, అన్ని రంగాల వారికి ఆర్థికంగా ఊరట లభిస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే కల్యాణ మండపాలు బుకింగ్ అవ్వడం.. దానిపై ఆధారపడ్డ డెకరేషన్ వ్యాపారులు, ఆకర్షణీయమైన వివిధ రకాల పూల దిగుమతులు చేసేవారు ఆనంద పడుతున్నారు. మరోవైపు పురోహితులు, బ్యాండ్ మేళం, క్యాటరింగ్, ఈవెంట్ ఆర్గనైజర్లు, ఫొటో, వీడియో గ్రాఫర్లకు ఆర్డర్లు అధికమయ్యాయి. ప్రధానంగా నిర్వహణ క్లీనింగ్ పనులపై ఆధారపడ్డ వేలాది మంది దినసరి కూలీలకు ఉపాధి లభించనుంది.
వివాహాలకు అనేక మంది ఇప్పటికే దివ్య ముహూర్త తేదీల్లో ఫంక్షన్ హాళ్లను బుకింగ్ చేసుకున్నారు. ఇప్పుడు ముహూ ర్తాలు నిర్ణయించుకునేవారికి గ్రామీణ, పట్టణాల్లో ఫంక్షన్ హాళ్లు లభించే అవకా శం లేదు. అలాంటి వారు వివాహాలను దేవాలయాలు, ఇళ్ల వద్ద జరుపుకునేం దుకు మొగ్గుచూపు తున్నారు. జిల్లాలో పెండ్లిళ్లు లేకపోవడంతో రెండు నెలల నుంచి కల్యాణ మండపాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ముహూర్తాలు ఉండడంతో హాళ్ల నిర్వాహకులు ఊరట చెందుతున్నారు.
అధిక మాసం రావడంతో దుకాణాల్లో గిరాకీ లేక ఖాళీగా కూర్చున్నాం. రెండు నెలల నుంచి వ్యాపారం సరిగ్గా నడవలేదు. ఇప్పుడు మంచి ముహూర్తాలు రావడంతో సీజన్ ప్రారంభమైం ది. పెళ్లికి అవసరమైన బంగారం, వెండి ఆభరణాలను తయారు చేయించుకునేందుకు ఆర్డర్లు వస్తున్నాయి. డిసెంబర్ నెల వరకు మూడు నెలలపాటు ముహూర్తాలు ఉండడంతో ఈ సీజన్లో మంచి వ్యాపారం జరుగుతోందని భావిస్తున్నాం.
– సతీశ్, గోల్డ్ వ్యాపారి, వెంగ్వాపేట్
శ్రావణ మాసం మొదలుకొని డిసెంబర్ వరకు 53 రోజులపాటు మంచి ము హూర్తాలు ఉన్నాయి. శుభ కార్యక్ర మాలు చేసే వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా పెళ్లి చేసుకునే వారికి కూడా సంబంధా లు చేసుకొని పెళ్లిళ్లు చేసుకునేం దుకు ముహూర్తాలు అనుకులం. ఇప్పటికే చాలా మంది పురోహి తుల వద్ద గృహాప్రవేశాలు, వివాహాలు, నిశ్చితార్థాలు, ఇతర శుభకార్యాల తేదీలను తీసుకుంటున్నారు.
– ఇందూర్తి ఆచార్య కల్యాణ్, పురోహితులు, నిర్మల్.
ఈనెల శనివారం నుంచి పెండ్లిళ్లు ప్రారంభం అయ్యాయి. ఈ దివ్యమైన ముహూర్తాలు డిసెంబర్ 31 వరకు ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో వందలాది వివాహాలు నిశ్చయ మైనట్లు తెలుస్తోంది. నాలుగు నెలల వర కు 35 ముహూర్తాలు ఉండడంతో ఎక్కువ పెండ్లిళ్లు జరగడానికి ఆస్కారం ఉంది. సెప్టెంబర్ సగం మాసం నుంచి అక్టోబర్ వరకు అశ్వయుజ మాసం ప్రారంభం అవుతుంది. కనుక పెండ్లిళ్లు ఉండ వు. అదేవిధంగా గృహ ప్రవేశాలు, శుభకార్యాలకు శ్రావణంలో దివ్యమైన ముహూర్తాలు ఉండడంతో సందడి నెలకొంది.
– తిరునగరి రామకృష్ణాచార్యులు, పురోహితుడు, జామ్