రామగిరి, డిసెంబర్ 6 : పెండ్లిండ్ల సీజన్ మళ్లీ మొదలైంది. కొద్దిరోజుల నుంచి మంచి ముహూర్తాలు లేక వివాహాలు పెద్దగా జరుగలేదు. ఈ నెల నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వరుసగా కల్యాణ గడియలు వచ్చాయి.
డిసెంబర్ 7, 15, 8, 22, జనవరి 3, 6, 5, ఫిబ్రవరి 11, 14, 18, 19, 22, 23, 25, 29, మార్చి 13, 16, 22, 24, 27, 28, 30, ఏప్రిల్ 3, 4 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. వివాహాల నేపథ్యంలో పెండ్లి పత్రికలు, డెకరేషన్, క్యాటరింగ్, వాయిద్య బృందం వాళ్లు, ఫొటో, వీడియో గ్రాఫర్లకు చేతినిండా పని దొరకనున్నది.