Rice price | దేశంలో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. రోజులు జరుగుతున్నా కొద్ది సన్న బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఒక క్వింటల్ బియ్యం ధర రూ.1000 నుంచి 1500 వరకు పెరిగింది.
ఈ ఏడాది సన్నబియ్యం ధరలు అంచనాకు మించి పెరిగాయి. నాలుగేండ్లలో లేని విధంగా పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం బీపీటీ బియ్యం క్వింటా ధర కొత్తవి రూ.5 వేలు, పాతవి రూ.5,500 పలుకుతున్నాయి.