మన వంట ఇంట్లో ఉండే అనేక మసాలా దినుసులు, ఇతర పదార్థాలతోపాటు ఆయుర్వేదంలో అనేక రకాల మూలికలను ఔషధాలుగా ఉపయోగిస్తుంటారు. ఆయా పదార్థాలు లేదా మూలికల్లో అనేక అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి.
ఆయుర్వేదంలో ఎన్నో రకాల మూలికలు ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు మూలికల గురించి అధిక శాతం మందికి ఇంకా తెలియదు. కొన్ని మూలికలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.