మఠంపల్లి, జూన్ 20 : తెలంగాణ సంస్కృతికి జాతరలు ప్రతీకలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలకేంద్రంలో సోమవారం గంగమ్మతల్లి జాతరను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నానన్నారు. ప్రజలకు గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి త్వరలో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రానున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్నా కొంతమంది ఉనికి కాపాడుకోవడానికి అబద్ధాలు చెబుతూ దుష్ప్రచారం చేస్తున్నారని వారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలు పునిచ్చారు. అదేవిధంగా చౌటపల్లి, పెదవీడు గ్రామాల్లో గంగమ్మ తల్లి జాతర నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ మన్నెం శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్ జాలకిరణ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షురాలు కందుల నాగలక్ష్మీ, గ్రామశాఖ అధ్యక్షుడు రామచంద్రయ్య, ఉపాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, బాలకృష్ణ, జ్యోతి, శ్రీనివాస్, వీరబాబు, ఆంటోని, రాజు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే
మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి వారిని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సోమవారం దర్శించుకున్నారు. కార్యక్రమంలో ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, సర్పంచ్ విజయలక్ష్మీవెంకటరమణ, అర్చకులు పాల్గొన్నారు.
గణపవరం, గుడిబండ జాతరల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్
కోదాడ రూరల్ : జాతరలు తెలంగాణ ప్రాంత సంస్కృతికి చిహ్నాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మండలంలోని గణపవరం, గుడిబండ గ్రామాల్లో సోమవారం నిర్వహించిన గంగమ్మ, పెద్దమ్మతల్లి జాతరల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలకు జాతర శుభాకాంక్షలు తెలిపి భక్తిశ్రద్ధలతో జాతర జరుపుకోవాలని సూచించారు. గుడిబండలో ఎంపీపీ చింతా కవితా రెడ్డి బోనమెత్తి మొక్కు చెల్లించారు. మహిళలు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని బుట్టలలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. కార్యక్ర మంలో సర్పంచ్ శ్రీవిజయకిరణ్, వరవర రంగ నాయకస్వామి దేవాలయ చైర్మన్ కామిశెట్టి నర్సిం హారావు, ఎంపీటీసీ హిమబిందుసుమన్, ఉప సర్పంచ్ బత్తుల కోటయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు సలీం, వెంకటరెడ్డి, పుల్లారెడ్డి, మట్టపల్లిరావు, మట్టపల్లి శ్రీను, నరసింహారావు, నాగరాజు, నరేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
నడిగూడెంలో….
నడిగూడెం : ప్రతి ఒక్కరూ భక్తి భావం కలిగి ఉండాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలో గంగమ్మ ఆలయ 11వార్షికోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. యాదవ సోదరుల నృత్యాలతో ఆలయం కిటకిటలాడింది. భక్తులకు అన్నదానం చేశారు. సర్పంచ్ నాగలక్ష్మీమల్లేశ్యాదవ్, చంద్రయ్య, కె వెంకన్న, వెంకన్న, గంగరాజు పాల్గొన్నారు.