అర్వపల్లి, సెప్టెంబర్ 12 : మండలంలోని తిమ్మాపురంలో కొత్తగా ఆసరా పింఛన్ కార్డులు పొందిన లబ్ధిదారులు సోమవారం సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దేవుడిలా తమకు అండగా నిలిచారని అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మారిపెద్ది భవానీ శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్గౌడ్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
హుజూర్నగర్ మండలం లింగగిరిలో..
హుజూర్నగర్ రూరల్ : మండలంలోని లింగగిరిలో కొత్తగా పింఛన్ కార్డులు పొందిన లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శి కడియాల రమేశ్, పింఛన్‌దారులు పాల్గొన్నారు.