
బొడ్రాయిబజార్: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావును హైద్రాబాద్‌లోని ఆయన క్యాంపు కార్యాలయంలో మంగళవారం టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి నారాయణ, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లభారతి ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు మర్యాద పూర్వకంగా కలసి మంత్రికి పూలమొక్కలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు వేతనంలో 30శాతం పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడంతో కృతజ్ఞతలు తెలిపారు.
అంగన్వాడీ వేతనాలు ప్రభుత్వం బడ్జెట్ కంట్రోల్ నుంచి ఎత్తి వేసి ప్రత్యేక పద్దు ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వేతనాలు అందించాల న్నారు. దీనికి మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రోనాల్డ్‌రోస్‌తో మాట్లాడి అంగన్వాడీ వేతనాలు ఉద్యోగులతో పాటు అందించేలా చూడా లని ఆదేశించారు. అనంతరం అంగన్వాడీలు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. మంత్రిని కలసిన వారిలో సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తాటిపాముల నాగమణి, విలాసకవి నిర్మల, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంతెనపల్లి సుజాత, రమణ, వేదవతి ఉన్నారు.