ప్రాణాలు తీసిన కుటుంబ కలహాలు.. కుమారుడిని బావిలో తోసి తండ్రి ఆత్మహత్య
ప్రాణాలు తీసిన కుటుంబ కలహాలు | సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలంలో విషాద ఘటన జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ముక్కుపచ్చలారని కుమారుడిని చంపిన తండ్రి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

సూర్యాపేట : సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలంలో విషాద ఘటన జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ముక్కుపచ్చలారని కుమారుడిని చంపిన తండ్రి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
ఏనుబాముల గ్రామానికి చెందిన సురకంటి రాంరెడ్డి (45) ఇద్దరు కుమారులు. కొంతకాలంగా రాంరెడ్డి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం చిన్నకుమారుడు తనుష్ రెడ్డి (6)ని తీసుకొని రాంరెడ్డి పొలం వద్దకు వెళ్లాడు.
కుమారుడిని బావిలో తోసి చనిపోయిన తరువాత తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలం వద్దకు వెళ్లిన వారు రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

