ఉద్యోగ అవసరాల కోసం.. పిల్లల చదువులకూ.. ఇంటి పనులకూ ఓ ట్యాబ్ ఉంటే బాగుంటుంది అనుకుంటాం. అయితే, అది బడ్జెట్లో ఉండాలని చూస్తాం. అంతేకాదు.. ఆ ట్యాబ్లెట్ ఓ ఎంటర్టైన్మెంట్ అడ్డాగా ఉండాలి అనుకుంటాం. అలాగైతే.. మీరు షామీ కంపెనీ అందిస్తున్న ‘ప్యాడ్ 7’ గురించి తెలుసుకోవాలి. అన్ని పనుల్ని చక్కబెట్టేసి.. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు సినిమాలు చూడొచ్చు.
అంతేనా.. గేమింగ్ ప్రియులకూ షామీ ప్యాడ్ 7 సూపర్ ఆప్షన్. ఈ ట్యాబ్లెట్ డిస్ప్లే చాలా బాగుంది. 3.2 కే క్రిస్టల్ రెస్ డిస్ప్లే. దీంట్లో సినిమా, వీడియోలు చూసేందుకు ఇష్టపడతారు. 144 హెచ్జడ్ రిఫ్రెష్ రేట్‌తో గేమ్స్‌ను సాఫ్ట్‌గా ఆడొచ్చు. స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్ దీనికి బలం. ఇది మునుపటి మోడల్స్ కంటే 2 రెట్లు వేగంగా పనిచేస్తుంది.
గేమ్స్, మల్టిటాస్కింగ్లో ఎక్కడా ల్యాగ్ కనిపించదు. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌తో ఫైల్స్ వేగంగా ఓపెన్ అవుతాయి. 8850 ఎంఏహెచ్ బ్యాటరీ 16 గంటలు పనిచేస్తుంది. 45 వాట్స్ టర్బో చార్జింగ్‌తో త్వరగా ఫుల్‌చార్జ్ అవుతుంది. క్వాడ్ స్పీకర్లు, డాల్బీ ఎట్ మోస్తో సినిమా సౌండ్ థియేటర్లా అనిపిస్తుంది. ఫోకస్ కీబోర్డ్‌తో టైపింగ్ సులభం. హైపర్ ఓఎస్2తో వాడకం స్మూత్‌గా ఉంటుంది.
ధర: రూ. 27,999
దొరుకు చోటు: అన్ని ప్రముఖ ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లు