ధర: రూ.13,700 దొరుకు చోటు : అమెజాన్.కామ్
ఫోన్లో ఎప్పుడైతే హైఎండ్ కెమెరాలు ఎంట్రీ ఇచ్చాయో.. అప్పుడే ఫొటోగ్రఫీ అందరికీ దగ్గరైపోయింది. దీంతో ప్రొఫెషనల్‌గా ఫొటోలు తీసేందుకు లైటింగ్ ప్రాధాన్యం కూడా పెరిగింది. ఫలితంగా మార్కెట్లో సరికొత్త లైట్ స్టిక్‌ల సందడి మొదలయ్యింది. వాటిల్లో GODOX LC500R లైట్ స్టిక్ ఒకటి. ఇందులో 360 రంగులు, 14 రకాల లైటింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మ్యూజిక్ మోడ్, బార్న్డోర్ లాంటి ఫీచర్స్.. మీ క్రియేటివిటీకి బాగా ఉపయోగపడతాయి. RGB మోడ్‌తో ఏకంగా 360 రంగులను ఎంచుకునే అవకాశం ఉంది. ఫొటోలు, వీడియోలు తీసినప్పుడు రంగులు చాలా సహజంగా, స్పష్టంగా కనిపిస్తాయి. దీంట్లో మరో అదిరిపోయే ఫీచర్.. 14 రకాల ఎఫ్ఎక్స్ లైటింగ్ ఎఫెక్ట్స్. ఇందులో మొత్తం 39 ప్రీసెట్లు ఉన్నాయి. మ్యూజిక్ మోడ్ అయితే మరింత అదిరిపోతుంది. పాటల బీట్ ఆధారంగా లైట్ రంగు, బ్రైట్నెస్ మారతాయి. దీంతో డిస్కో లాంటి వాతావరణాన్ని ఇట్టే సృష్టించవచ్చు. తేలికగా ఉండే ఈ స్టిక్‌ను చేతితో పట్టుకుని సులభంగా వాడుకోవచ్చు. ట్రైపాడ్ లేదా స్టాండ్‌కు కూడా ఫిక్స్ చేసుకునే వీలుంది.
ధర: రూ.999 దొరుకు చోటు : అమెజాన్.కామ్
ల్యాపీ పట్టుకుని బయటికి రావాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఎక్కడ వర్షం పడుతుందో? ల్యాప్‌టాప్ ఎక్కడ తడిసిపోతుందో? అని. అలాంటి భయాన్ని పోగొట్టేదే ఈ ల్యాపీ కవర్. ఇది లోపల సాఫ్ట్ మెటీరియల్, బయట వాటర్ రెసిస్టెంట్ ఫ్యాబ్రిక్‌తో డబుల్ ప్రొటెక్షన్‌తో ల్యాపీకి రక్షణనిస్తుంది. హ్యాండిల్, ఎక్స్ట్రా పాకెట్స్‌తో చాలా సౌకర్యవంతంగా దీన్ని వాడుకోవచ్చు. దీని లోపల మెత్తటి వెల్వెట్ లైనింగ్ ఇచ్చారు. దాంతో బ్యాగ్ కిందపడినా.. ల్యాపీ దెబ్బతినదు. 15 నుంచి 15.6 అంగుళాల ల్యాప్‌టాప్‌లకు కరెక్ట్‌గా సరిపోతుంది. చార్జర్, పెన్ డ్రైవ్, ఫోన్ లాంటి వస్తువులను పెట్టుకోవడానికి ముందు భాగంలో రెండు జిప్ పాకెట్స్ ఇచ్చారు. పైన ఉన్న హ్యాండిల్‌తో ల్యాపీని క్యారీ చేయొచ్చు. అలాగే, ల్యాప్‌టాప్‌ని బ్యాగ్ లోపల నుంచి కూడా ఈజీగా తీసేయొచ్చు. ఈ స్లీవ్కి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్.. వాటర్ రెసిస్టెంట్ ఫీచర్. దీనిని ఆక్స్ఫర్డ్ ఫ్యాబ్రిక్‌తో తయారు చేశారు. వర్షంలో మీరు తడిసినా.. మీ ల్యాప్‌టాప్ మాత్రం సేఫ్‌గా ఉంటుంది.
ధర: రూ.26,999 దొరుకు చోటు : అమెజాన్.కామ్
రోజంతా ఫోన్ వాడినా బ్యాటరీ ఖాళీ అవ్వకూడదు.. ఫొటోగ్రఫీ అదిరిపోయేలా సూపర్ కెమెరా ఉండాలి.. గేమ్స్ ఆడేటప్పుడు ల్యాగ్ లేకుండా మెరుపు వేగంతో ప్రాసెసింగ్ చెయ్యాలి.. చిటికెలో పనులు చక్కబెట్టేందుకు ఏఐ టూల్స్ కావాలి.. అనుకుంటున్నారా? అయితే, మీకు పర్ఫెక్ట్ చాయిస్.. వన్‌ప్లస్ నార్డ్ సీఈ5. ఎప్పుడెప్పుడా!? అని ఎదురు చూస్తున్న ఈ బడ్జెట్ ఫోన్ మార్కెట్లో సందడి చేస్తున్నది. దీని బ్యాటరీ సామర్థ్యం ఏకంగా 7100 ఎంఏహెచ్. వేగవంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అపెక్స్ ప్రాసెసర్.. దీనికి తోడుగా 12 జీబీ ర్యామ్ వస్తున్నది. ఒకేసారి ఎన్ని యాప్‌లు వాడినా.. లాగ్ అనే మాటే ఉండదు. 50 ఎంపీ సోనీ మెయిన్ కెమెరా ఓఐఎస్‌తో వస్తుంది. దీంతో అదిరిపోయేలా 4కే వీడియోలు తీయొచ్చు. ఫోన్ తెర పరిమాణం 6.77 అంగుళాలు. AMOLED డిస్ప్లే. ఇందులోని మరో ప్రత్యేక ఫీచర్.. చేతులు తడిగా ఉన్నా స్క్రీన్ చక్కగా పని చేస్తుంది. ఏఐ సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే.. ఫొటోల్లో ఎవరైనా అడ్డొస్తే ఏఐ ఎరేజర్‌తో మాయం చేయొచ్చు. బ్లర్ అయిన ఫొటోలను సరిచేస్తుంది. ఆఫీస్ పనులకు కూడా ఏఐ ఫీచర్స్‌ని వాడుకోవచ్చు.
ధర: రూ.1,599 దొరుకు చోటు: అమెజాన్.కామ్
ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఫోన్లో బ్యాటరీ అయిపోయిందంటే.. దాదాపుగా పర్సు ఖాళీ అయినట్టే. సిటీ నడిబొడ్డున ఉన్నా.. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇబ్బంది పడతాం. మరైతే, ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందనే ఈ టెన్షన్‌కి చెక్ పెట్టాలంటే.. ఓ మంచి పవర్ బ్యాంకుని వెంట ఉంచుకుంటే బెటర్. అలాంటివారికి Ambrane Stylo N20 పవర్‌బ్యాంక్ మంచి చాయిస్. 20,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫోన్‌ని చార్జ్ చేస్తుంది. సుదీర్ఘ ప్రయాణాల సమయంలో ఇది మంచి ఆప్షన్. 22.5W ఫాస్ట్ చార్జింగ్‌తో 30 నిమిషాల్లోనే మీ ఫోన్ బ్యాటరీని 50% చార్జ్ చేస్తుంది. స్మార్ట్‌గా డిజైన్ చేసిన ఈ పవర్ బ్యాంకుకి ఇన్-బిల్ట్ టైప్-సి కేబుల్ ఉంది. అందుకే, బయటికి వెళ్లేటప్పుడు కేబుల్ మర్చిపోయామని కంగారు పడాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు, డ్యూయల్ పోర్ట్స్ ఉండటంతో ఒకేసారి మూడు డివైజ్‌లను చార్జ్ చేసుకోవచ్చు. దీనికి ఉన్న సేఫ్ ఛార్జ్ టెక్నాలజీ బ్యాటరీని ఓవర్ఛార్జింగ్, ఓవర్ హీటింగ్ నుంచి కాపాడుతుంది.