గడికోసారి ఫోన్ అందుకున్నా… అలా ఫోన్ అందుకున్న ప్రతిసారీ ముఖ కవళికల్లో ఆకస్మికంగా మార్పులు చోటుచేసుకున్నా.. ఆ వచ్చింది వాట్సాప్ సందేశమని అంచనాకు రావొచ్చు. పరిగడపున పచ్చిగంగైనా ముట్టకముందే ‘గుడ్ మార్నింగ్’ మెసేజ్‌తో మొదలయ్యే వాట్సాప్ చాటింగ్ జర్నీ.. లేట్‌నైట్ ‘గుడ్‌నైట్’ మేసేజ్‌తో గానీ పూర్తవ్వదు. ఈ తరం మనిషితో వాట్సాప్ అంతగా మమేకమైంది. మనసు నొచ్చుకుంటే ఓ స్టేటస్, ఎవరైనా మెచ్చుకుంటే మరో స్టేటస్.. ఇలా మనిషి జీవితానికి వాట్సాప్ అద్దం పడుతున్నది. ఈ సందేశాల పరంపరలో చేసే చిన్న తప్పిదం.. సందేహాల వలయంలో పడదోస్తుంది. అలా కావొద్దంటే ఈ విషయాలు తెలుసుకోండి..
స్నేహ
సంతసానికి సాంకేతిక సంతకం వాట్సాప్. భావోద్వేగాలను పంచుకునేందుకు ఎమోజీలు, అభిమానాన్ని చాటుకునేలా ఇమేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు పంపే సౌలభ్యం, రికార్డింగ్ గోల లేకుండా వాయిస్ కాల్స్ చేసుకునే వీలు, గ్రూప్‌గా జట్టుకట్టే వెసులుబాటు, గ్రూప్‌గా వీడియోకాల్స్ చేసుకునే సౌకర్యం.. ఇన్ని అవకాశాలకూ ఆలవాలం వాట్సాప్. ఈ సందేశాల పరంపరకు అడ్డుకట్ట వేస్తుంటారు స్కామర్లు.
మోసాలు.. రకరకాలు
అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు
ఎండ్‌నౌ ఫౌండేషన్