పెండ్లితో సంబంధమేంటి!
క్యూట్ లుక్స్, డైనమిక్ యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న మలయాళి బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. వరుస సినిమాలతో దూసుకుపోతున్నదీ భామ. ప్రస్తుతం ఈమె నటించిన ‘క్రేజీ కళ్యాణం’ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. త్వరలోనే ‘భోగీ’తో ప్రేక్షకులను మరోసారి పలకరించనుంది.
కార్వాన్ కబుర్లు
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీడేస్ సినిమా అంటే చాలా ఇష్టం. ఆ మూవీని ఇప్పటివరకు సుమారు 50 సార్లు చూసుంటాను. ఆ సినిమా టీవీలో వచ్చిందంటే ఎంత బిజీగా షెడ్యూల్లో ఉన్నా తప్పకుండా చూస్తాను.
ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితాన్ని పంచుకోవడానికి పెండ్లి అవసరమే కానీ, ఈ సాకుతో అమ్మాయిని ఇంటిలో పనిమనిషిగా మార్చడానికి మాత్రమే పెండ్లి చేసుకోకూడదు. ఇప్పటివరకు అయితే మా ఇంట్లో పెండ్లి గురించి ఎలాంటి ఒత్తిడి లేదు. అది ఎప్పుడు జరుగుతుందో కూడా క్లారిటీ లేదు. కానీ పెండ్లితో సంబంధం లేకుండా ఒక పాపనో, బాబునో దత్తత లేదా ఇతర మార్గాల ద్వారా పెంచుకోవాలనే కోరిక నాలో బలంగా ఉంది.
గతంలో నాకు ఎదురైన వేధింపుల కారణంగా ఎంతగానో కుంగిపోయాను. అద్దంలో చూసుకున్నప్పుడు నేనేనా అనిపించేది. ప్రతి రోజూ భారంగా జీవితాన్ని నెట్టుకొచ్చాను. నిరంతరం పోరాడాల్సి వచ్చేది. ఆ రోజు ముగిసేటప్పటికి ‘హమ్మయ్యా ఈ రోజు బతికిపోయాను దేవుడా’ అని ధైర్యం చెప్పుకొనేదాన్ని. ఒకానొక సమయంలో సినిమాలకు స్వస్తి పలకాలని భావించాను కూడా!

Anupama
డబ్బుల కోసమే నటించాలని అనుకోను. ఓ నటిగా ఎప్పుడూ వైవిధ్యభరితంగా ఉండాలని ప్రయత్నిస్తుంటా. నా సినిమాలన్నీ ఒకేలా ఉన్నాయని ప్రేక్షకులు అనుకోకూడదు. నా పాత్రను చూసే సినిమా పేరేంటో వెంటనే ప్రేక్షకులు చెప్పగలగాలి. అంత ప్రత్యేకంగా ఉండేలా నా పాత్రల్ని ఎంచుకుంటా.
రిలేషన్షిప్ అయినా, ప్రొఫెషన్ అయినా నాకు నచ్చకపోతే వదిలేస్తా. నాకూ ఎమోషన్స్ ఉంటాయి. గ్రేస్‌ఫుల్‌గా బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడితే అలాగే వస్తాను. టెర్రర్ అంటే టెర్రర్గానే వస్తా. గతంలో రిలేషన్లో ఉన్నప్పుడు రెండేండ్లపాటు నరకం అనుభవించాను.
‘క్రేజీ కళ్యాణం’ సినిమాతో నాకు తెలంగాణ స్లాంగ్ పరిచయమైంది. సినిమా మొత్తం గ్రామీణ నేపథ్యంలోనే సాగింది. సినిమా విడుదలై మంచి స్పందన వస్తుంటే సంతోషంగా ఉంది. మరో సినిమా ‘భోగి’ సైతం తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోనే రాబోతున్నది. ఈ సినిమాలో నన్ను మరింత కొత్తగా చూస్తారు.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

