బాత్రూమ్లలో జుట్టు, చిన్నచిన్న చెత్త పేరుకుపోవడం సహజం. డ్రైనేజీ పైపులు బ్లాక్ అవ్వడం కూడా అంతే సహజం. ఈ సమస్యకు అత్యంత సులభమైన, ఆధునికమైన పరిష్కారమే Waterproof Drain Cover Mesh. ఇది బాత్రూమ్ డ్రైన్ జాలిపై అంటించుకునే ఒక ప్రత్యేకమైన వాటర్‌ప్రూఫ్ నెట్ స్టిక్కర్. ఈ మెష్ స్టిక్కర్లకు వెనుక వైపు గ్లూ ఉంటుంది. బాత్రూమ్ డ్రైనేజీ జాలిపై దీనిని అంటిస్తే చాలు.. స్నానం చేసేటప్పుడు ఊడిపోయే జుట్టు అంతా ఈ నెట్‌పైనే ఆగిపోతుంది. చిన్న ప్లాస్టిక్ ముక్కలు, సబ్బు నలకలు కూడాపైపుల్లోకి వెళ్లకుండా ఇది సమర్థంగా అడ్డుకుంటుంది.
డ్రైనేజీ పైపుల్లోంచి బొద్దింకలు, చిన్న పురుగులు ఇంట్లోకి రాకుండా చూస్తుంది. ఇక దీనిని బాత్రూమ్ షవర్ ఏరియాలోనే కాకుండా, కిచెన్ సింక్, వాష్ బేసిన్లలో కూడా వాడుకోవచ్చు. యూనివర్సల్ సైజ్‌లో లభించే ఈ స్టిక్కర్లు దాదాపు అన్ని రకాల ఇళ్లలోని బాత్రూమ్ డ్రైన్ జాలీలకు సరిపోతాయి.
చేతి నొప్పులకు చెక్!

ప్రసిద్ధ కెన్సింగ్టన్ సంస్థ.. సరికొత్త Pro Fit Ergo TB675 వర్టికల్ ట్రాక్బాల్ సిరీస్‌ను తీసుకొచ్చింది. సాధారణ మౌస్‌లను వాడటం వల్ల మణికట్టుపై పడే ఒత్తిడిని తగ్గించడానికి దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేసింది. ఈ ట్రాక్బాల్ను పట్టుకున్నప్పుడు.. చేయి సహజమైన ‘హ్యాండ్‌షేక్’ పొజిషన్లో ఉంటుంది. దీనివల్ల మణికట్టు, బొటనవేలు, చేతి కండరాలపై ఒత్తిడి చాలావరకు తగ్గుతుంది. ఇందులో 34 ఎంఎం పరిమాణంలో ట్రాక్బాల్ ఉంటుంది. మౌస్‌ను జరపాల్సిన అవసరం లేకుండా, కేవలం మీ బొటనవేలితో బాల్‌ను తిప్పుతూ స్క్రీన్‌పై కర్సర్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఇందులో దృఢమైన మెటల్ 4D స్క్రోల్ వీల్ ఇచ్చారు. ఇది పైకి, కిందికే కాకుండా పక్కలకు కూడా స్క్రోల్ చేయడానికి సాయపడుతుంది. ఈ మౌస్‌లో మొత్తం తొమ్మిది బటన్లు ఉన్నాయి. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఈ బటన్లకు నచ్చిన షార్ట్‌కట్స్‌ను సెట్ చేసుకోవచ్చు. దీనిని ఒకేసారి నాలుగు డివైజ్‌ల వరకు కనెక్ట్ చేయవచ్చు. మల్టీ-టాస్కింగ్ చేసేవారికి, ఎక్కువ డివైజ్‌లు వాడేవారికి ఈ మౌస్ అనుకూలం. విండోస్, మ్యాక్ ఓఎస్ రెండిటినీ సపోర్ట్ చేస్తుంది.
మ్యాగ్నెట్ తోనూ మరింత వేగంగా..

ఐఫోన్, మాగ్నెటిక్ చార్జింగ్ సపోర్ట్ చేసే ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగదారులకు గుడ్ న్యూస్!యూఎస్బీ-సీ చార్జర్‌తో సమానంగా మ్యాగ్సేఫ్తోనూ ఫోన్‌ను చార్జ్ చేసుకునే సమయం వచ్చేసింది. ప్రీమియం చార్జింగ్ పరికరాల తయారీ సంస్థ Cuktech.. CP13 Qi2 Magnetic Power Bankను మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో క్యూఐ2 టెక్నాలజీని వాడారు. దీనివల్ల సాధారణ 7.5W మాగ్నెటిక్ చార్జర్ల కంటే రెండు రెట్లు వేగంగా (15W వేగంతో) వైర్లెస్ చార్జింగ్ అవుతుంది. ఆపిల్ అధికారిక MagSafe చార్జర్ తరహాలోనే అత్యంత వేగంగా పవర్ అందిస్తుంది. ఇందులో 10,000mAh బ్యాటరీ ఉంటుంది. రోజువారీ అవసరాలన్నిటికీ సరిపోతుంది. ఈ పవర్ బ్యాంక్‌ను కూడా 30W వేగంతో రీచార్జ్ చేసుకోవచ్చు. ఇందులో బ్యాటరీ శాతాన్ని చూపించే డిజిటల్ డిస్ప్లే కూడా ఉంది. దీని బరువు కేలం 220 గ్రాములు మాత్రమే! ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు.
ఇంటికి రక్షణ.. ఇంటీరియర్‌కు ఆకర్షణ!

ప్రముఖ అర్బన్ కంపెనీ.. హోమ్ సెక్యూరిటీ విభాగంలోకి అడుగుపెట్టింది. అత్యంత ప్రీమియం, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో Native Lock Ultraను రూపొందించింది. ఇందులో ఎన్నో అత్యాధునిక ఫీచర్లను ఏర్పాటుచేసింది. ఇది కేవలం తాళం మాత్రమే కాదు.. ఇందులో స్మార్ట్‌లాక్, కెమెరా, డోర్‌బెల్ అన్నీ ఉంటాయి. ఇందులోని ప్రత్యేకత.. 3డీ ఫేస్ అన్‌లాక్. తలుపు ముందుకు రాగానే మీ ముఖాన్ని ఆటోమేటిక్‌గా గుర్తించి, లాక్ తెరుచుకుంటుంది. ఫింగర్‌ప్రింట్, పిన్ లాక్, యూసీ యాప్ ద్వారా కూడా డోర్‌ను అన్‌లాక్ చేయొచ్చు. మీరు ఎక్కడున్నా.. ఇందులోని కెమెరా సాయంతో మీ ఇంటి తలుపు ముందు ఎవరు ఉన్నారో చూడొచ్చు. యాప్ ద్వారా వారితో మాట్లాడవచ్చు కూడా. మీ తలుపు ముందు ఎవరైనా అనుమానాస్పదంగా ఎక్కువ సేపు నిలబడి ఉంటే ఇందులోని అలారం ఆటోమేటిక్‌గా మోగుతుంది. మీ మొబైల్‌కి అలర్ట్ కూడా పంపుతుంది. ఇంటికి రక్షణగానే కాదు.. ఇంటీరియర్కూ అందాన్నీ తీసుకొస్తుంది.