హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ నవీన్మిట్టల్కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి చంచల్ మిట్టల్ (77) అనారోగ్యంతో మృతిచెందారు. అమెరికాలోని మిట్టల్ సోదరుడి వద్ద ఉంటున్న చంచల్ మృతి చెందగా, అంత్యక్రియలు అమెరికాలోనే నిర్వహించనున్నారు.