Vastu Shastra | ‘బ్రహ్మస్థానం ఓపెన్’ అంటే ఏమిటి?
మీది పడమర దిశ ఇల్లు. కాబట్టి దక్షిణ - నైరుతిని ఎందుకు డ్రాయింగ్ రూముగా చేస్తారు? చేస్తే దోషం, పెద్ద ప్రమాదకరం అని కాదు కానీ, ఆవుపేడ ఎత్తేందుకు వెండి కంచం వాడినట్టు అవుతుంది. భగవత్ కార్యంలో బాగుంటుంది కానీ, మామూలు సమయంలో ఎబ్బెట్టుగా కనిపిస్తుంది.
- గ్రౌండ్ ఫ్లోర్లో నైరుతిని డ్రాయింగ్ రూముగా వాడొచ్చా? మాది పడమర రోడ్డు.
– సుధామూర్తి, వరంగల్
మీది పడమర దిశ ఇల్లు. కాబట్టి దక్షిణ – నైరుతిని ఎందుకు డ్రాయింగ్ రూముగా చేస్తారు? చేస్తే దోషం, పెద్ద ప్రమాదకరం అని కాదు కానీ, ఆవుపేడ ఎత్తేందుకు వెండి కంచం వాడినట్టు అవుతుంది. భగవత్ కార్యంలో బాగుంటుంది కానీ, మామూలు సమయంలో ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. నైరుతి.. శక్తికి నిలయం. దానిని పడక గదిగా వాడితే.. అది మన జీవన శక్తిని పెంచుతుంది. ఓపెన్‌గా పెట్టి డ్రాయింగ్ రూముగా చేస్తే.. దాని శక్తియుక్తులు నిరుపయుక్తం అవుతాయి.
సహజంగా గ్రౌండ్ ఫ్లోర్కానీ, పైన ఫస్ట్‌ఫ్లోర్‌లో నైరుతి గది కానీ, ఇంటి పెద్దలకు.. అంటే, కింద అమ్మానాన్నలకు, పైన మీకు (దంపతులకు) అవసరం ఉంటుంది. పశ్చిమ – వాయవ్యం డ్రాయింగ్ గదికి బాగుంటుంది. ఉత్తరంవైపు చక్కని వెలుతురు, గాలి, ఆహ్లాదంగా ఉంటుంది. వ్యవహారానికి సరైనది. కాబట్టి, పశ్చిమ – వాయవ్యం ద్వారంతో ఇల్లు కట్టి, ఆ దిశనే డ్రాయింగ్ గదిగా వాడండి. శుభకరం.

ఇంటి లోపల, బయట కలిపి రెండు లిఫ్టులు పెట్టుకోవచ్చా? పెడితే, ఎక్కడెక్కడ పెట్టాలి? బేస్మెంట్లో వాటి లోతు ఎంత ఉండాలి?
– కె. నిర్మల, కోరుట్ల
ఆఫీసులకు, ఇండ్లకు ఎన్ని లిఫ్టులు అయినా పెట్టుకోవచ్చు. కానీ, అవి పెట్టే స్థానం ముఖ్యం. ఇంటికి ఆగ్నేయంలో బయట పెట్టుకోవచ్చు. తూర్పు బాల్కనీలోకి ప్రవేశించే విధంగా ఉత్తర ముఖంగా పెట్టుకోవచ్చు. ఇంటిలో పడమర భాగంలో కానీ.. ఇంటి మధ్యలోపల దక్షిణ భాగంలో కానీ లిఫ్టు నిర్మించుకోవచ్చు. లిఫ్టుకు లోతు అనేది కనీసం ఐదు అడుగులు అవసరం అవుతుంది. హైడ్రాలిక్ లిఫ్ట్ వాడితే.. కింద గొయ్యి అవసరం ఉండదు. ఇంటి బేస్మెంట్ నాలుగు అడుగులు ఉండేలా చూసుకొని.. లిఫ్టును దక్షిణ – పడమర – ఉత్తర – తూర్పు భాగాలలో ఇంటికి లోపల పెట్టొచ్చు. బయటి లిఫ్టును వాయవ్యంలో కూడా, ఉత్తరం బాల్కనీలోకి వచ్చేలా పెట్టుకోవచ్చు.
మేము కొన్న ఇంటికి వాయవ్యంలో సెల్లార్ ఉంది. అందులో పనిచేసే స్టాఫ్ గదులు ఉన్నాయి. అలా ఉండొచ్చా?
– బి.శకుంతల, కొండగట్టు
వాయవ్యంలో సాధారణ సెప్టిక్ ట్యాంకునే నిషేధిస్తాం. అలాంటిది ఆ దిశలో సెల్లార్ అంటే పెద్దదోషం అవుతుంది. ఇంటిలోని స్టాఫ్ గదులు గొయ్యిలోనే కట్టాలి అనే నియమం అవసరం లేదు. మీరు ఆ గొయ్యిని పెంచాలి. అంటే, ఉత్తర భాగం అంతా సెల్లార్ చేయండి. దానిని కార్ పార్కింగ్ కోసం వాడండి. కేవలం వాయవ్య భాగమే సెల్లార్ తీయడం వల్ల ఇంటి యజమానులు వ్యాధులతో ఇబ్బందిపడాల్సి వస్తుంది. పూర్తి సెల్లార్ తీశాక.. ఇంటి మొత్తానికి ఉత్తర భాగం సెల్లార్ అవుతుంది. అలా చేయడం మంచిది. ఒకవేళ సెల్లార్ పెంచడం వీలుకానప్పుడు, దానిని మూసేయాల్సిందే! కేవలం వాయవ్యం సెల్లార్, ఆగ్నేయం సెల్లార్..
ఇలా విదిశలు సెల్లార్‌కు మంచిదికాదు. ఎన్నో దుష్ఫలితాలు కలుగుతాయి. వాడని ఈశాన్యం సెల్లార్ కూడా దోషమే!

‘బ్రహ్మస్థానం ఓపెన్’ అంటే ఏమిటి? అలా ఇప్పుడు ఇండ్లు కడుతున్నారా? కడితే మంచిదేనా?
– ఎం. లింగయ్య, సైదాబాద్
ఇంటి మధ్యభాగం బ్రహ్మస్థానం. అత్యంత ప్రముఖమైంది. దానిని ఓపెన్ చేయడం అంటే.. గదులు విభజించి, గృహ మధ్యస్థాన్ని లెక్కించి, దానిమీద కప్పును తెంపు చేయాలి. ఇప్పుడు ఈ కట్టడాలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. ఒకనాడు మన గచ్చు ఇండ్లు, లోగిళ్లు.. అన్నీ అలాంటివే! ఇంటిమీద ఓపెన్ పెడితే, ఇంట్లోకి పైనుంచి మనుషులు చొరబడతారు అనే పరిస్థితులు దాపురించి, అవి మాయం అయ్యాయి. అంతా ‘కలి’ ప్రభావం! వ్యక్తి ఎంతగా దిగజారుతూ ఉంటే.. అంత బలహీనుడు అవుతాడు. నిజాయతీ కొరవడి ప్రకృతి రక్షణకు దూరం అవుతాడు. కొన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో కొందరు ఇలాంటి గచ్చు ఇండ్లు, మండువా లోగిళ్లు కట్టుకోడానికి ఇష్టపడుతున్నారు. సెక్యూరిటీ ఉండే వ్యవసాయ క్షేత్రాలలో ఇలాంటి ఇండ్లను
అద్భుతంగా నిర్మించవచ్చు.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- houses
- vastu
- vastu for house
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

