కంపోజిషన్.. ఫొటోగ్రఫీకి వెన్నెముక లాంటిది. ఆహ్లాదకరమైన, ప్రభావవంతమైన చిత్రాలు తీయడానికి ఉపయోగపడుతుంది. ఇది దృశ్యాన్ని సున్నితంగా, సరైన దిశలో ఆసక్తికరంగా చూపిస్తుంది. కంపోజిషన్ సూత్రాలను అర్థం చేసుకొని, వాటిని సమర్థంగా ఉపయోగిస్తే.. ఫొటోగ్రఫీలో మిమ్మల్ని కొత్త ఎత్తులకు చేరుస్తుంది. ఫొటోగ్రఫీలో పలు కంపోజిషన్ సూత్రాలు ఉంటాయి. ఇవి ఫొటోలు మరింత అందంగా రావడానికి సహాయపడతాయి. ఇప్పుడు, కొన్ని ప్రముఖ కంపోజిషన్ సూత్రాలను తెలుసుకుందాం. ఫొటోగ్రఫీకి మరిన్ని మెరుగులు దిద్దుకుందాం.
రూల్ ఆఫ్ థర్డ్స్ (Rule of Thirds) అనేది ఫొటోగ్రఫీలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన కంపోజిషన్ సూత్రం. ఇది ఫొటోను మూడు సమాన విభాగాలుగా విభజిస్తుంది. మీరు ఫొటో తీయాలనుకున్న సబ్జెక్ట్‌ను ఈ గ్రిడ్ లైన్లపై లేదా అవి కలిసే చోట ఉంచడమే.. రూల్ ఆఫ్ థర్డ్స్. ఇది ఫొటోకు ఒక సహజమైన, సమతులమైన కంపోజిషన్ ఇస్తుంది.
లీడ్ లైన్స్ (Lead Lines) అనేవి.. మీరు తీసే ఫొటోలో కనిపించే, దృష్టిని ప్రధాన అంశంవైపు తీసుకెళ్లే రేఖలు. ఈ లైన్స్ మీ ఫొటోలో గుండ్రంగా లేదా రేఖలుగా ఉంటాయి. వీటి ద్వారా వీక్షకుల దృష్టి ఫొటోలోని ముఖ్యమైన విషయాలపై కేంద్రీకృతం అవుతుంది. ఉదాహరణకు రోడ్లు, రైల్వే ట్రాక్స్, గోడలపై ఉండే గీతలు.. ఫొటోల్లో లీడ్ లైన్స్‌గా ఉపయోగపడతాయి.
ఫ్రేమింగ్ (Framing) సూత్రం ద్వారా.. మీరు ఫొటో తీయాలనుకున్న సబ్జెక్ట్‌ను మరింత హైలైట్ చేయవచ్చు. సబ్జెక్ట్‌ను ఒక ఫ్రేమ్ ద్వారా చుట్టి.. దానిని మరింత ఆకర్షణీయంగా మార్చవచ్చు. ఉదాహరణకు ఒక కిటికీ నుంచి బయట కనిపించే దృశ్యానికి.. ఆ కిటికీ కూడా ఒక ఫ్రేమ్‌గా ఉపయోగపడుతుంది.
సింబాలెన్స్ (Symbalance) అంటే.. రెండు భాగాలు లేదా అంశాలు ఒకదానితో మరొకటి సమానంగా ఉండటం. ఇది ఫొటోల్లో ఒక సమతులమైన భావనను సృష్టిస్తుంది. నిర్మాణాల విభాగంలో ఈ సింబాలెన్స్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఫొటోల్లో సింబాలెన్స్ను సృష్టించడం వల్ల.. వాటికి విశేషమైన ఆకర్షణ వస్తుంది.
ఫొటోలో సబ్జెక్ట్ మినహా మిగతా ఖాళీ భాగమే.. నెగటివ్ స్పేస్(Negative Space). దీనిని ఉపయోగించడం వల్ల ఫొటోల్లోని ప్రధాన అంశాన్ని మరింత స్పష్టంగా చూపించవచ్చు. ఖాళీ స్పేస్ ద్వారా.. వీక్షకుల దృష్టిని ముఖ్యమైన అంశంవైపు మళ్లించవచ్చు.
సబ్జెక్ట్‌ను పూర్తిగా ఫోకస్ చేసి, బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేసే సూత్రమే ఫోకస్డ్ ఆబ్జెక్ట్స్ (Focused Objects). ఫొటోగ్రాఫర్లు ఎక్కువగా దీనినే ఉపయోగిస్తుంటారు. ఇది ప్రధాన అంశాన్ని మరింత స్పష్టంగా చూపిస్తుంది. ప్రధాన సబ్జెక్ట్‌ను బ్యాక్‌గ్రౌండ్‌తో విడదీస్తుంది. ఫొటోలో ఆకర్షణను పెంచుతుంది.
డెప్త్ ఆఫ్ ఫీల్డ్ (Depth of Field).. ఫొటోలో ఏ భాగం ఫోకస్ అయ్యిందో, ఏ భాగం బ్లర్ అయ్యిందో చెప్పే విషయం. దీన్ని ఉపయోగించడం ద్వారా, మీరు ఫొటోలోని ముఖ్యమైన అంశాలను హైలైట్ చేయవచ్చు. ఫొటోలకు మరింత స్టయిలిష్, ప్రొఫెషనల్ లుక్ తీసుకొస్తుంది.
ఫొటో తీసే క్రమం లేదా యాంగిల్ ఆఫ్ షాట్(Angle of Shot) కూడా చాలా ముఖ్యం. మీరు ఏ కోణంలో ఫొటో తీస్తున్నారో అనే విషయం కూడా.. ఫొటోల్లోని భావనను మారుస్తుంది. సాధారణంగా లో యాంగిల్ (కింది నుంచి), హై యాంగిల్ (ఎత్తు పైనుంచి) తీసే ఫొటోలు ప్రత్యేకంగా కనిపిస్తాయి.
పోర్ట్రెయిట్ ఫొటోగ్రఫీలో ముఖం లేదా శరీరాన్ని ఫోకస్లో ఉంచి, బ్యాక్‌గ్రౌండ్ మొత్తం క్లియర్‌గా ఉండేలా ఫొటోను సర్దుబాటు చేయడం ముఖ్యం. అదే పోర్ట్రెయిట్ కంపోజిషన్ (Portrait Composition). ఇందుకోసం మీరు సైడ్ యాంగిల్, 45 డిగ్రీల కోణంలో లేదా సబ్జెక్ట్ ముఖంపైనే ఫోకస్ చేయాలి.
ఫొటోగ్రఫీలో మంచి కంపోజిషన్ సృష్టించడానికి సబ్జెక్ట్‌తోపాటు దాని చుట్టూ ఉన్న అంశాలు బ్యాలెన్స్డ్ (Balance)గా ఉండాలి. అవి రెండూ ఒకేస్థాయిలో ఉండాలి. మరొకదానితో ఒకటి పోటీ పడకుండా బ్యాలెన్డ్స్‌గా ఉండాలి. అప్పుడే మీ ఫొటోలు మరింత అందంగా, సంతృప్తికరంగా కనిపిస్తాయి.
ఫొటోగ్రఫీలో కంపోజిషన్ సూత్రాలను అనుసరించడం ద్వారా, మీ ఫొటోలను మరింత ఆకర్షణీయంగా, సృజనాత్మకంగా మార్చవచ్చు. ప్రతి ఫొటోను కళాత్మకంగా తీర్చిదిద్దుతాయి. ఈ సూత్రాలను ఆచరణలో పెడితే.. మీరు మంచి ఫొటోగ్రాఫర్‌గా ఎదగడానికి సహాయపడతాయి.
– ఆడెపు హరికృష్ణ