కంస పతనం.. ద్విపద కేతనం
ఈ ద్విపద పాదాలు మడికి సింగన రచించిన ద్విపద భాగవతము లోనిది. ఇది భాగవత దశమ స్కంధమునకు చెందిన కథ మాత్రమే. పదిహేనవ శతాబ్దపు కవిగా భావిస్తున్న మడికి సింగన ద్విపద భాగవతము పోతన మహాభాగవతం కంటే ముందుదని పరిశోధకుల భావన.
భవ కమలాసన ప్రముఖ దేవతలు
ప్రవిమలంబుగ ప్రణుతించిరెలమి
దివిబీటకొని మ్రోసె దేవ దుందుభులు
దివిజ కామినులు నర్తించిరింపార
పొరిబొరి మందార పుష్పవర్షములు
సురకోటి దేవతీసుతుమీద గురిసి
రంతట, కంసుండు హతుడౌట యెఱిగి
అంతఃపురాంగనలడలు దీపింప
నడుగులు తడబడ నాత్మలు కలగ
సుడివడి లోగుంది సృక్కి బల్వడిని,
నురముల శిరముల నొరి మ్రోదుకొనుచు
పరిపరివిధముల విలపించి మిగుల
నార్తనాదంబుల నందంద బొగిలి
ఈ ద్విపద పాదాలు మడికి సింగన రచించిన ద్విపద భాగవతము లోనిది. ఇది భాగవత దశమ స్కంధమునకు చెందిన కథ మాత్రమే. పదిహేనవ శతాబ్దపు కవిగా భావిస్తున్న మడికి సింగన ద్విపద భాగవతము పోతన మహాభాగవతం కంటే ముందుదని పరిశోధకుల భావన. కాకతీయ రాజుల కాలంలో పెద్దపల్లి దగ్గరి రామగిరి ఇతని నివాసం. కంసుణ్ని శ్రీకృష్ణుడు సంహరించిన సందర్భం మన ద్విపద అంశం. కంసుడు మరణించగానే శంకరుడు, బ్రహ్మ మొదలగు దేవతలు విమలమనస్కులై కృష్ణుడికి నమస్కరించారు. దేవ దుందుభులు మోగాయి.
దేవతా స్త్రీలు నృత్యాలు చేశారు. కృష్ణుడిపై మందార పుష్పాలను వర్షంగా కురిపించారు. అదే సమయం కంసుని మరణవార్త అంతఃపుర స్త్రీలకు తెలిసి కంపనంతో వారి అడుగులు తడబడ్డాయి. ఆత్మలు విచారం పొంది కుంగిపోయాయి. మిగుల చింతించి, రొమ్ములు, తలలు బాదుకుంటూ ఆర్తనాదాలు చేస్తూ ఏడ్పులు పెడబొబ్బలు పెట్టారట. ఇదీ పై పద్య భావం.
-చేపూరి శ్రీరాం, హన్మకొండ
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

