Home Lift | ఇంటికి అందాన్ని పెంచుతున్న కొత్తరకం లిఫ్ట్‌లు వచ్చేశాయ్ !!
Home Lift & Vaccum Elevator | ఇష్టపడి మూడంతస్తుల మేడ కట్టుకుంటారు సరే! రెండో ఫ్లోర్‌లోని డైనింగ్హాల్కూ, మూడో ఫ్లోర్‌లోని హోమ్ థియేటర్‌కూ ఎలా వెళ్తారు? మెట్లు ఎక్కడానికి మోకాళ్లనొప్పులు అడ్డొస్తాయి. పరిపూర్ణ ఆరోగ్యవంతులైనా, ఆఫీసు పనులతో అలసిసొలసి ఇంటికొచ్చాక.. ఓపికే ఉండదు. ఇలాంటివారికి ‘హోమ్ లిఫ్ట్’ తిరుగులేని పరిష్కారం.

ఇంటికి లిఫ్ట్.. ఓ అవసరం, స్టేటస్ సింబల్ కూడా. ఊబకాయం, మోకాళ్ల నొప్పులు, బద్ధకం, వేగం.. పై అంతస్తులకు లిఫ్ట్ పెట్టించుకోవాలన్న ఆలోచనకు అనేక కారణాలు. వీటన్నిటికితోడు ..ఇంటీరియర్స్! ముచ్చటైన లిఫ్ట్‌లు ఇంటి అందాన్ని పెంచుతున్నాయి. ఖరీదైన అలంకరణలు కూడా ఇవ్వలేని వైవిధ్యాన్ని తెస్తాయి. నిశ్శబ్దంగా పనిచేసుకుపోవడం వీటి ప్రత్యేకత. ముఖ్యంగా ఎయిర్ వ్యాక్యూమ్‌తో పనిచేసే లిఫ్ట్‌లో నిట్టనిలువుగా పాలీ కార్బొనేట్ షీట్స్‌తో రూపొందించిన సిలిండర్ ఉంటుంది. ఈ సిలిండర్‌లో ఒక మనిషి నిలుచునేంత క్యాబిన్ ఉంటుంది. ఈ సిలిండర్‌లో ఉండే గాలి పీడనాన్ని పెంచడం, తగ్గించడం వల్ల క్యాబిన్ (లిఫ్ట్) పైకి కిందికి పోతుంది. వ్యాక్యూమ్ సిలిండర్‌లో నుంచి గాలి బయటికి వెళ్లకుండా ఏర్పాట్లు ఉంటాయి.

ఉన్నంతలోనే..
అసలే చిన్న ఇల్లు. లిఫ్ట్ పెడితే మరింత ఇరుకైపోదా? అనుకోవాల్సిన పన్లేదు. తక్కువ స్థలంలోనే ఏర్పాటు చేసుకోవడానికి వీలున్న లిఫ్ట్‌లూ వచ్చేశాయి. గతంలో స్లాబ్‌కు కన్నం కొట్టి, గోడలు పగులగొట్టి లిప్టు కోసం అదనపు నిర్మాణాలు చేపట్టాల్సి ఉండేది. ఇప్పుడా తలనొప్పి లేదు. వ్యాక్యూమ్, హైడ్రాలిక్ లిఫ్ట్‌ల కోసం హెడ్ రూమ్, సైడ్ వాల్స్ నిర్మించాల్సిన అవసరమే లేదు. గోతులు తీయాల్సిన తలనొప్పీ తప్పింది. అప్పటికే ఉన్న గోడలకే అమర్చుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే, నిచ్చెన వేసినంత సులభం. కోరిన రంగు, డిజైన్‌తో కస్టమైజ్డ్ లిఫ్ట్ సిద్ధం చేసిస్తున్నాయి తయారీ సంస్థలు.

సురక్షితం..
ఈ లిఫ్ట్‌లు అనుకోకుండా పాడైపోయినా, ఒక్క సారిగా కిందకు జారి పడిపోవు. ఆ సమయంలో ఆటోమేటిక్‌గా పనిచేసే బ్రేకులు ఉంటాయి. వాటివల్ల భద్రత ఉంటుంది. ‘అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు లిఫ్ట్ ఎక్కరాదు’ అని హెచ్చరిక బోర్డులు పెట్టేవారు. కానీ, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు, వేగంగా తప్పించుకోవడానికి కూడా లిఫ్ట్‌లు ఉపయోగపడుతున్నాయి. గతంతో పోలిస్తే లిఫ్ట్‌ల ధరలు చాలా దిగివచ్చాయి. రెండున్నర మూడు లక్షల నుంచీ లభిస్తున్నాయి.

Read More :
ఇండ్లలో అద్దాలు పెట్టుకునేది డిజైన్ కోసమేనా ! అసలు కారణమేంటంటే..”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- elevator
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

