Vastu Shastra | ఇంటి చుట్టూ ‘శేరి సందులు’ వదిలి కట్టాలా? అవి కలుపుకొని ఇల్లు నిర్మించవచ్చా?
– కె. వెంకటేశ్, మెదక్
చాలామందికి ‘శేరి సందు’ అంటేనే తెలియదు. పైగా నగరాల్లో అవి పూర్తిగా అడుగంటి పోయాయి. ప్రతి ఇంటి కాంపౌండుకు – కాంపౌండుకు మధ్య పెంపుడు జంతువులు వెళ్లేందుకు, డ్రైనేజీ లైను పోవడానికి అవసరమైన ఖాళీ సందులు అవి. చాలా ముఖ్యమైనవి కూడా. నిజానికి ప్రతి ఇంటి ఆవరణకు ఎవరిదీ కాని ఖాళీ సందు ఉండేది. అందులోంచి వాహనాలు వెళ్లవు. పిల్లులు – ఎలుకలు- మేకలు – కోళ్లు – కుక్కలు.. ఇలాంటి పెంపుడు జీవులకు ట్రాఫిక్ రూల్స్ ఉండవు కదా! అందుకు మన పూర్వులు ప్రతి ఇంటికీ ఆ ఖాళీని వదిలి, ‘గ్రామ – పట్టణ లే అవుట్లు’ వేసేవాళ్లు. కానీ, నేడు అవి పూర్తిగా పోయాయి. ఒకరి ఇంటి మీది నుంచి ఎవరి ఇంటికైనా దాటుకొని పోయే పరిస్థితి వచ్చిందిప్పుడు. ప్రాధాన్యం- పవిత్రత – ప్రైవసీ – రక్షణ కలిగిన విధానం అది. మీరు
కూడా తప్పక పాటించండి. వాటిని వదిలి, వాస్తు పరంగా ప్రహరీ కట్టి, లోపల ఇల్లు నిర్మించుకోండి.
– ఎం. చరిత, గద్వాల
మీ స్థలానికి వాయవ్యం ఉన్నా, దేవాలయం ఉన్నా.. మీరు పంపిన నమూనా ప్రకారం ఆ స్థలం చాలా పెద్దది. దుర్గామాత ఆలయానికి ఎదురుగా కూడా మీ స్థలం ఉత్తరం పెరిగి ఉంది. అయితే, మీకు దక్షిణం రోడ్డు ఉంది కాబట్టి, గుడికి ఎదురుగా ఉన్న స్థలాన్ని వదిలి.. అంటే, దక్షిణం – ఉత్తరం ఉన్న స్థలాన్ని రెండుగా విభజించి, దక్షిణం భాగంలో దక్షిణ ముఖద్వారంతో ఇల్లు కట్టుకోవచ్చు. ఉత్తరం ఖాళీ జాగా వదలాలి. అప్పుడు మీ ఖాళీ స్థలానికి వెనుక అమ్మవారి ఆలయం ఉంటుంది. మీ సొంత ఇంటికి ఉత్తరంలో కూడా ఉండదు. అలాగే మీరు పడమర కూడా చిన్న రోడ్డు వచ్చేలా పన్నెండు అడుగులు వదిలి, మీ స్థలానికి ప్రహరీ కట్టి, దానిలో ఇల్లు కట్టుకోండి. జాగ్రత్తగా స్థలం కొలిచి, విభజన చేసి.. ఇల్లు కట్టే స్థలాన్ని దిశకు, మెట్నకు సరిచేసి ఇంటిని ప్లాన్ చేయండి. తద్వారా ఇంటికి ఏ దోషమూ ఉండదు. ఆలయ పవిత్రతకు కూడా భంగం రాదు.
– కె. స్వాతి, మోత్కూర్
ఉత్తరం – తూర్పు రెండు రోడ్లలో రెండు వైపులా గేట్లు పెట్టాలి. ఎందుకంటే, మీది ఈశాన్యం స్థలం. మీ స్థలాన్ని ముందుగా శుద్ధి చేసుకొని, ఎత్తుగా ఉన్న తూర్పు రోడ్డు కన్నా.. రెండున్నర అడుగులు ఎత్తు ఉండేలా ఫ్లోరింగ్‌ను పెంచుకొని, ఇంటి ప్లాన్ తయారుచేయండి. ఉత్తరం రోడ్డును కూడా తప్పకుండా వాడాలి. ఉత్తరం ఎన్ని ఫీట్లు డౌన్లో ఉందో చూసుకొని, ఆ రోడ్డుకు వెళ్లే విధంగా ర్యాంపు వేసి, గేటు పెట్టుకోవాలి. ఈశాన్యం బ్లాకును ఉత్తరం వైపు లైన్ లేకుండా ఇల్లు కట్టొద్దు. చాలా దోషం అవుతుంది. లేదంటే.. ఉత్తర – ఈశాన్యం గేటువద్ద మెట్లు వచ్చేలా చేసుకొని, ఉత్తరం రోడ్డు వాడుకోండి. తూర్పు గేటునుంచి వాహనాల రాకపోకలు – నడకలు ఉండేలా చేయండి. ఉత్తరం నుంచి నడక వచ్చేలా గేటు పెట్టండి. మొత్తానికి రెండు వీధులు వాడకం జరగాలి. అప్పుడే ఆ స్థలానికి మంచి బలం చేకూరుతుంది.
– ఎన్. చంద్ర, మలక్‌పేట
అవును. స్థలాలు సమకోణాలతో ఉండటం అరుదు. అలాంటి వాటిని మూలమట్టానికి సరిచేసినప్పుడు కొన్ని కోణాలు తెగిపోతూ ఉంటాయి. అలాంటి వాటిలో.. అంటే, మనకు పనికిరాని స్థలాల్లో సెప్టిక్ ట్యాంక్ వేసుకోవచ్చు. కానీ, ఆ స్థలం ఏ కోణం, ఎక్కడివైపు మిగిలి పోయింది అనేది జాగ్రత్తగా చూడాలి. దక్షిణ – నైరుతి పెరిగింది అని, అటు దిక్కు వదిలి.. స్థలాన్ని మెట్నకు చేశాం. అలాగని ఆ స్థలంలో సెప్టిక్ ట్యాంక్ వేయడం చాలా ప్రమాదం. దక్షిణ భాగం మధ్యలో పెరిగి, దానిని వదిలి, అందులోనూ వేయకూడదు. కొన్ని ప్రాంతాల్లో వాయవ్యంలోనూ, ఆగ్నేయంలోనూ సెప్టిక్ ట్యాంకులు కడతారు. అది మంచిది కాదు. ఉత్తర – వాయవ్యం పెద్దగా పెరిగినప్పుడు ఆ స్థలం వదిలినప్పుడు.. అందులో కాంపౌండు అవతల మన ఇంటికి మధ్యలో.. ఉత్తరం సెంటర్లో కూడా ఆ వదిలిన స్థలంలో సెప్టిక్ ట్యాంక్ కట్టుకోవచ్చు. అలాగే, తూర్పు సెంటర్లో కూడా వేయవచ్చు.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678