శుభవాస్తు
అమ్మానాన్నలు మీ ఇంట్లోనే ఉండటం అన్నది అతిగొప్ప విషయం. కన్నవాళ్లను వదిలి తిరుపతి వెళ్లి.. ప్రత్యేక దర్శనాలు కావాలి. ఎక్కువ సమయం దేవుణ్ని చూడాలి. వీవీఐపీ దర్శనం కావాలని పాకులాడే వాళ్లకన్నా.. పెట్టినా-పెట్టకపోయినా, తిట్టినా-కొట్టినా అమ్మానాన్నలను ఆదరణతో చూసుకోవడం ఆ దైవదర్శనం కన్నా గొప్పది.
ఇల్లు ఆరోగ్యాలను సవరిస్తుందా? అందుకోసం ఏం చేయాలి? మాది చిన్న ఇల్లు. అమ్మానాన్న ఉన్నారు.
– కె. దశరథ్, గుండాల
గృహశాస్త్రంలో ఉన్న మూల అంశం.. ఆరోగ్య అంశమే! మనిషి ఏది చేయాలన్నా ముందు ఉండాల్సింది ఆరోగ్యమే కదా! మీకున్న ఇల్లు చిన్నదా? పెద్దదా? అన్న ఆలోచన వదిలి, ఆ ఇంటి పరిసరాలతోపాటు ఇంటి లోపల, మూలమూలనా శుభ్రంగా ఉంచండి. తూర్పు ద్వారం, ఉత్తర ద్వారం తప్పక ఉండాలి. ప్రతి గదికి.. కనీసం ఒక కిటికీ ఉండాలి. అమ్మానాన్నలు మీ ఇంట్లోనే ఉండటం అన్నది అతిగొప్ప విషయం. కన్నవాళ్లను వదిలి తిరుపతి వెళ్లి.. ప్రత్యేక దర్శనాలు కావాలి. ఎక్కువ సమయం దేవుణ్ని చూడాలి. వీవీఐపీ దర్శనం కావాలని పాకులాడే వాళ్లకన్నా.. పెట్టినా-పెట్టకపోయినా, తిట్టినా-కొట్టినా అమ్మానాన్నలను ఆదరణతో చూసుకోవడం ఆ దైవదర్శనం కన్నా గొప్పది. అప్పుడు ఆ వేంకటేశ్వరుడు అక్కడ కాదు.. మీ గృహంలోనే కొలువై ఉంటాడు. ఇక మీ ఇంట్లోని అన్ని గదుల్లోకి గాలి-వెలుతురు సరిగ్గా చేరుతున్నదో చూసుకోండి. ఇంట్లో ఏవైనా దోషాలు ఉంటే సరిచేసుకోండి. ప్రధానంగా గృహ శుద్ధితోపాటు మనోశుద్ధి కలిగి ఉండాలి. ‘గృహాలు-గుణాలు’ నిర్మలంగా, పవిత్రంగా ఉన్న కుటుంబాన్ని.. ఏ దుష్టశక్తులూ ఏమీ చేయలేవు. ఆడంబరాలకు పోకుండా.. రెక్కల కష్టంతో జీవితం సాఫీగా సాగుతుంది. అదే మిమ్మల్ని ఆరోగ్యంగా నిలబెడుతుంది.
ఇంటి వెనక భాగంలో వంట ఇల్లు కట్టొచ్చా? ఎలా కట్టాలి?
– సి.ఆర్. శ్రవణ్, మంచిర్యాల
ఇంటి సింహద్వారానికి వెనక భాగం అనేది దక్షిణం కావొచ్చు. లేదా పడమర కావొచ్చు. అంటే గృహం ముఖద్వారాన్ని బట్టి ఆ దిశ మారుతుంది. పడమర ప్రధాన ద్వారం గృహానికి వెనుక భాగం తూర్పు అవుతుంది. ఇలా ఇంటికి అనుబంధంగా మరొక విశాలమైన, విశేషమైన వంట ప్రాంగణం కావాలి అంటే.. ఇంటి చుట్టూ ఎక్కువ ఖాళీ ప్రదేశం ఉండి తీరాలి. అపుడు అన్ని దిశలకు మరో ఉప వంటశాలను తయారు చేసుకోవచ్చు. ఆ విధంగా చూసినప్పుడు తూర్పు-ఆగ్నేయంలో, ఉత్తర-వాయవ్యంలో వంట గదులకు సరైన స్థానం లభిస్తుంది. స్థలం ఉన్నా కూడా నైరుతి-ఈశాన్యాల్లో వంట గదులు వేయకూడదు. మీరు సరైన స్థలం చూసుకొని, కొలతలను బట్టి కట్టుకోండి.

Kitchen
పిల్లల చదువుకు అనుకూలమైన దిశ, గది గురించి చెప్పండి.
– కె. శాంతి, జమ్మికుంట
చదువుకు ఇంట్లోని అన్ని దిశలూ ఉపయుక్తమే! ఈ రోజుల్లో పిల్లల చదువుల కోసం ప్రత్యేకంగా గదులు (స్టడీ రూమ్స్) ఏర్పాటు చేసి చదివిస్తున్నారు. కాబట్టి, గదుల ప్రాధాన్యం పెరిగింది. దక్షిణంలో, పశ్చిమంలో పిల్లలకు గదులు ఉండకూడదు అనే నియమం లేదుకానీ, ఆ దిశలు ఇంటి పెద్దలకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా పిల్లల ఆలోచనలకు, వాళ్ల సృజనాత్మకతకు తూర్పు, ఉత్తరం దిశలు చాలా దోహదపడతాయి. కారణం.. ఆ వైపు నుంచి వచ్చే గాలి, వెలుతురు. అటువైపు ఖాళీభాగం ఎక్కువ ఉండటం, చెట్లు పెంచడం తదితర అంశాలు ఏకాగ్రతను, ఆహ్లాదాన్ని అందిస్తాయి. అందువల్ల తూర్పు గది లేదా ఉత్తరం గదిలో పిల్లల చదువును కొనసాగించడానికి ఉపయుక్త దిశలు. ఉత్తరం ముఖం చేసి కూర్చోవడం లేదా తూర్పు ముఖంగా కూర్చోవడం మంచిది. అది ఒక సవ్యతను కలిగిస్తుంది. అయితే, ఆ గదులకు టాయిలెట్ ఉండకూడదు. కిటికీలు విశాలంగా అమర్చాలి.
ఇంట్లో వరుస ద్వారాలు అంటే ఏమిటి? అవి ఎలా వస్తాయి?
– కె.ఎల్. రాజు, ఉప్పల్
ఇంటిలో ఎదురెదురుగా వచ్చే ద్వారాలతో మంచి వెలుతురు ప్రసారం ఉంటుంది. అది వాస్తుశాస్త్ర నిర్మాణం వల్లనే సాధ్యం అవుతుంది. ఉత్తరం ముఖద్వారం గల ఇంటికి, ఉత్తరం నుంచి ప్రారంభమై డ్రాయింగ్ రూమ్‌కు, ఈశాన్యం ద్వారం ఎదురుగా ఒక ద్వారం (దక్షిణ-ఆగ్నేయం) ఇచ్చి, హాలు నుంచి ఆగ్నేయంలో ఉండే వంటగదికి ఉత్తర-ఈశాన్యంలో ద్వారం పెట్టి.. అలాగే, ఆ కిచెన్‌కు దక్షిణ-ఆగ్నేయంలో ద్వారం పెట్టినప్పుడు ఆ ద్వారాలు అన్నీ ఒకే వరుసలో వస్తాయి. ఇదీ వరుస ద్వారాల విధానం. తూర్పు-ఈశాన్యం నుంచి పశ్చిమ-వాయవ్యం వరకు కూడా ఇలాగే ద్వారాలను కుదించి పెట్టవచ్చు. ఈ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇంటి విభజన చేయాలి. ఇంటి సభ్యుల కోరికలు, పిల్లల ఇష్టాయిష్టాలు అన్నీ సమకూర్చుకొని, సర్దుబాట్లు చేసి కట్టగలిగినప్పుడు మంచి ఇల్లు వస్తుంది. ఏవి ఎలా ఉన్నా.. మనం పాటించి ఇల్లు నిర్మాణం చేసినప్పుడే ఆ ఉత్తమ జీవనం పొందగలం.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143

Doors
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దిన పత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

