Sunday Special | ఆ మూడురోజులూ అతని సమక్షం ఆమెకు.. సమస్త వైద్య ప్రపంచం
‘హనీమూన్ ఎక్కడికి?’ బంధుమిత్రుల్లో కుతూహలం.‘స్వర్గానికి..’ చిరునవ్వుతో బదులిచ్చారు వధూవరులు. ఇద్దరూ క్యాన్సర్ పేషెంట్లే. లాస్ట్ స్టేజ్.
స్వర్గం
‘హనీమూన్ ఎక్కడికి?’ బంధుమిత్రుల్లో కుతూహలం.‘స్వర్గానికి..’ చిరునవ్వుతో బదులిచ్చారు వధూవరులు.
ఇద్దరూ క్యాన్సర్ పేషెంట్లే. లాస్ట్ స్టేజ్.
సారీ
‘లాంగ్ డ్రైవ్ వెళ్దామా?’ అడిగాడు. ఆమె సరేనంది. అలా అతను.. సారీ చెప్పాడు. ఆమె క్షమించేసింది. .. నిన్నటి చిరుకోపానికి.
ప్రేమ చికిత్స

‘నెలసరి చికాకుకు మందే లేదు?’ తేల్చి చెప్పబోయింది స్నేహితురాలు. ‘ఉంది. కాదు కాదు..ఉన్నాడు’
సరిచేసిందామె. ఆ మూడురోజులూ అతని సమక్షం ఆమెకు.. సమస్త వైద్య ప్రపంచం.
మానవత
ఓ వ్యక్తి కుప్పకూలాడు. హిందూ అంబులెన్స్ డ్రైవర్ దవాఖానకు తీసుకెళ్లాడు. ముస్లిం డాక్టర్ చికిత్స చేశాడు.
పార్సీ సర్జన్ ఆపరేషన్ జరిపాడు. సిక్కు యువకుడు రక్తం ఇచ్చాడు. క్రైస్తవ నర్సు సపర్యలు చేసింది.
మనిషి బతికాడు. మానవతా బతికింది.
ఇష్టం
అతనికి వైద్యవృత్తి అంటే ప్రేమ. పెద్దలు ఇంజినీర్‌ను చేశారు. ఆమెకు ఇంజినీరింగ్ అంటే మక్కువ.
పెద్దలు మెడిసిన్ చదివించారు. అతను డాక్టర్‌ను.. ఆమె ఇంజినీర్‌ను.. పెళ్లి చేసుకున్నారు. పెద్దల్ని కాదని.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

