French Open : ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ (French Open)లో ‘లింగ వివక్ష'(Gender Bias) చూపించిన ఆటగాడికి భారీ జరిమానా పడింది. పెరుగ్వేకు చెందిన అడాల్ఫో వల్లెజో(Adolfo Vallejo) తన మ్యాచ్‌కు మహిళా చైర్ అంపైర్ బదులు పురుషుడిని నియమించాల్సిందని పేర్కొనడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. మహిళా అంపైర్‌ను అవమానపరిచేలా మాట్లాడిన అతడిపై మండిపడిన నిర్వాహకులు ఏకంగా రూ.71 లక్షల ఫైన్ విధించారు.
ఫ్రెంచ్ ఓపెన్‌లో చైర్ అంపైర్‌గా విధులు నిర్వహిస్తున్న అనా కర్వాల్హో (Ana Carvalho)పై అడాల్ఫో వల్లెజో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. రెండో రౌండ్లో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన మ్యాచ్‌కు చైర్ అంపైర్‌గా మహిళను కాకుండా పురుషుడు వ్యవహరించాల్సింది. మగవాడైతేనే ప్రేక్షకుల అరుపులను, వారి అల్లరిని అదుపు చేసేవాడు.
🚨 OFFICIEL ! Adolfo Daniel Vallejo va être SANCTIONNÉ d’une amende après avoir déclaré que son match contre Moïse Kouame n’aurait « pas dû être arbitré par une femme ». ❌
✍️ « Roland-Garros condamne fermement tout propos sexiste et apporte son soutien à l’arbitre concernée. » pic.twitter.com/8rRX7HyGok
— Univers Tennis 🎾 (@UniversTennis) May 29, 2026
మహిళా చైర్ అంపైర్‌కు వారిని నియంత్రించడం చాలా కష్టమైన పని అని అడాల్ఫో అన్నాడు. చైర్ అంపైర్ అనను అవమానించేలా, లింగ వివక్షపూరితంగా అతడు మాట్లాడడాన్ని ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ఖండించారు. లింగ వివక్షను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించమని ప్రకటిస్తూ.. అడాల్ఫోకు రూ.71 లక్షల జరిమానా విధించారు. తన వ్యాఖ్యలపై అడాల్ఫో క్షమాపణ చెప్పినా కూడా లింగ వివక్ష చూపడాన్ని సహించబోమని తేల్చేస్తూ జరిమానా కట్టాల్సిందేనని తేల్చేశారు.
ఓటమి బాధలో తాను చైర్ అంపైర్‌పై చేసిన వ్యాఖ్యలను మరోలా ఆర్ధం చేసుకున్నారని, తనను క్షమించాలని అడాల్ఫో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. నా వ్యాఖ్యల ఉద్దేశం మీరు అనుకున్నది కాదని నేను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. చైర్ అంపైర్లపై, వారి జాబ్‌పై నాకు గౌరవముంది. ఐదు గంటలు పోరాడి ఓడిన అనంతరం భావోద్వేగంతో నేను అలా మాట్లాడాను. అందుకు క్షమాపణలు చెబుతున్నా. నా ఓటమికి ఆమె కారణం కాదని కూడా మీకు తెలియజేస్తున్నా.
El descargo de Vallejo:
“Quiero aclarar que mis comentarios no fueron hechos con la intención con la que han sido interpretados.
Tengo respeto por la jueza y por el trabajo que hizo. Después de una batalla de 5 horas estaba muy acalorado y con muchas emociones. Me disculpo.… https://t.co/Hf2GNGpbJi pic.twitter.com/dCyD3LjpjB
— Gonzalo Ferreyra (@gonzaloferreyr) May 29, 2026
మ్యాచ్ ఆసాంతం చైర్ అంపైర్‌గా అనా గొప్పగా వ్యవహరించింది. ఈ పరిణామాల ద్వారా నేను చాలా నేర్చుకున్నా. మరింత మెరుగవుతాను. రొలాండ్ గరోస్, ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య, టెన్నిస్‌ను ఇష్టపడే ప్రతిఒక్కరి పట్ల నాకు చాలా గౌరవముంది అని అడాల్ఫో తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఐదు గంటల పాటు సాగిన రెండో రౌండ్లో కౌమే(ఫ్రాన్స్) చేతిలో 6-3, 7-5, 3-6, 2-6, 7-6 (8)తో అడాల్ఫో ఓడిపోయాడు.