పిల్లలను పెంచడం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ జర్నీలో పిల్లలకు క్రమశిక్షణ నేర్పడం ప్రతి తల్లిదండ్రులకూ ఒక సవాలుగా ఉంటుంది. పాత రోజుల్లో భయం, శిక్షల ద్వారా క్రమశిక్షణ అమలు చేసేవారు. చైల్డ్ సైకాలజీ, మోడరన్ పేరెంటింగ్ విధానాలు సానుకూల క్రమశిక్షణ ప్రాముఖ్యాన్ని నొక్కి చెబుతున్నాయి. ఇది కేవలం పిల్లల తప్పులను సరిదిద్దడం మాత్రమే కాదు, వారి జీవితానికి అవసరమైన నైపుణ్యాలను, ఆత్మగౌరవాన్ని పెంపొందించడం. సానుకూల క్రమశిక్షణ అనేది పిల్లల ప్రవర్తనను సరిదిద్దడానికి ఉపయోగించే విధానం. ఇందులో శిక్షలకు, అవమానాలకు తావు ఉండదు. పరస్పర గౌరవం, సమస్య పరిష్కార నైపుణ్యాలు, సామాజిక బాధ్యతలను నేర్పడంపై దృష్టి పెడుతుంది. ఇది దీర్ఘకాలికంగా ప్రభావం చూపే అంతర్గత క్రమశిక్షణను అలవాటు చేస్తుంది.
పిల్లల పెంపకంలో సానుకూల క్రమశిక్షణను అలవాటు చేయాలంటే ఆరు విషయాలను పాటించాలి. వాటిని పాటిస్తే పిల్లలు బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారు.
సానుకూల క్రమశిక్షణలో శిక్షకు బదులుగా తార్కిక పరిణామాలు ఉపయోగించాలి. శిక్ష భయాన్ని, పగను పెంచుతుంది. తార్కిక పరిణామాలు పిల్లలకు తమ చర్యల బాధ్యతను నేర్పుతాయి. ఉదాహరణకు బొమ్మలు విసిరేస్తే శిక్షగా టీవీ ఆపేయడం బదులు విసిరేసిన బొమ్మలను శుభ్రం చేసే బాధ్యతను అప్పగించాలి. తార్కిక పరిణామాలు అమలుకు RRR సూత్రం గుర్తుపెట్టుకోవాలి. మీరు పిల్లలకు అప్పజెప్పే పనులు రిలేటెడ్‌గా, రెస్పెక్ట్‌ఫుల్‌గా, రీజనబుల్‌గా ఉండాలి.
సానుకూల క్రమశిక్షణ అనేది ఒక రాత్రిలో వచ్చే మార్పు కాదు, ఇది నిరంతర అభ్యాసం. తల్లిదండ్రులు స్థిరంగా, సహనంతో, ప్రేమతో వ్యవహరించడం ద్వారా పిల్లలు క్రమశిక్షణ కలిగిన, బాధ్యతాయుతమైన, ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తులుగా ఎదుగుతారు. మన లక్ష్యం కేవలం తప్పులను ఆపడం కాదు, రేపటి కోసం మానసికంగా దృఢంగా ఉండే పౌరులను తయారు చేయడం.