మార్గే మార్గే శాఖినాం రత్నవేదీ/ వేద్యాం వేద్యాం కిన్నరీవృందగీతం/ గీతే గీతే మంజులాలాగోష్ఠీ/ గోష్ఠం గోష్ఠం త్వత్కథా రామచంద్ర… అంటుంది శ్రీరామకర్ణామృతం 1వ ఆశ్వాసంలోని 64వ శ్లోకం. అంటే నేను నడిచే ప్రతి మార్గంలో ఎన్నో చెట్లకొమ్మల మీద రత్న వేదికలు కనిపిస్తున్నాయి. ఆ వేదికలన్నిటిపైన కిన్నర స్త్రీల బృందాలు గీతాలు పాడుతున్నాయి. ఆ గీతాలతోనూ, మంజులమైన ఆలాపనతోనూ కూడిన సభలు అనేకంగా జరుగుతున్నాయి.
ఆ సభలన్నిటిలో ఓ రామచంద్రా! నీ కథనే పాడుతున్నారు. రామభక్తులకు రామకథను పాడటమే జన్మ సార్థకత. ఇక ఎవరి రూపం మునులకు ఆనందం కలిగిస్తుందో, ఎవరి బాణం శత్రువులను, లోకంలోని చెడును తొలగించి వేస్తుందో, ఏ దైవం సర్వజనుల అంతరంగాలలో కదలాడుతుందో, అలాంటి సర్వరూపుడైన శ్రీరాముణ్ని కీర్తిస్తూ ఆదిశంకరాచార్యులు రాసినట్లుగా చెబుతున్న నాలుగు ఆశ్వాసాల ‘శ్రీరామ కర్ణామృతం’ కావ్యానికి నేతి సూర్యనారాయణశర్మ చక్కటి తెలుగు అనువాదం చేశారు. ఈ పుస్తకం ద్వారా శ్రీరామ కర్ణామృతంలోని రస వైవిధ్యాన్ని నేటి పాఠకులకు పరిచయం చేసే ప్రయత్నం చేశారు శర్మ. దీనితోపాటు భారతీయులు భక్తితో స్మరించుకుని తరించడానికి ఆదిశంకరాచార్యులు అందించిన అచ్యుతాష్టకం, కృష్ణాష్టకం, లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం, రంగనాథాష్టకం, పాండురంగాష్టకం లాంటి 23 విష్ణు స్తోత్రాలకు సరళమైన తెలుగు అనువాదం చేశారు. మనం దేవాలయాల్లోనో, భక్తి కార్యక్రమాల్లోనో వినే ఈ స్తోత్రాలను అనువాద సహితంగా చదివి వాటి అంతరార్థం గ్రహించడానికి సూర్యనారాయణశర్మ రాసిన ఈ రెండు పుస్తకాలు ఉపకరిస్తాయి.
శ్రీరామ కర్ణామృతం ; పేజీలు: 177; ధర: రూ. 200
విష్ణు చింతనమ్ ; పేజీలు: 161; ధర: రూ. 200
బుక్ షెల్ఫ్
సామెతల ఆమెత
రచన: బిందుమాధవి మద్దూరి
పేజీలు: 179;
ధర: రూ. 150
ప్రతులకు:
ఫోన్: 94917 27272
ప్రధాని గారు
రచన: ఎస్.గణపతిరావు
పేజీలు: 129;
ధర: రూ. 150
ప్రతులకు:
ఫోన్: 96522 94856
-రచన/ వ్యాఖ్య: నేతి సూర్యనారాయణశర్మ, ప్రచురణ: శంకర భారతి
ప్రతులకు: ఫోన్: 99517 48340