స్మార్ట్ఫోన్ల రాకతో ‘ఫొటోగ్రఫీ’ రూపమే మారిపోయింది. ఎక్కడికి వెళ్లినా.. జేబులోంచి ఫోన్ తీయడం, ‘క్లిక్’ అనిపించడం సర్వసాధారణమై పోయింది. అయితే, స్మార్ట్‌ఫోన్ ఫొటోలను ప్రింట్ చేయడానికి ప్రఖ్యాత ఫ్యుజిఫిల్మ్ సంస్థ ఇన్స్టాక్స్ స్కేర్ లింక్ పేరుతో ఓ ప్రింటర్‌ను తీసుకొచ్చింది.
వివిధ రంగుల్లో లభ్యమయ్యే ఈ స్మార్ట్ ప్రింటర్.. తక్కువ బరువుతో, ఎక్కడికైనా వెంట తీసుకు వెళ్లగలిగేలా ఉంటుంది. ముఖ్యంగా ట్రావెలింగ్ చేసేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ‘ఇన్స్టాక్స్ బిజ్’ యాప్ ద్వారా ప్రింటర్‌ను స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్లోని ఫొటోలను క్రియేటివ్‌గా మార్చుకొని.. నేరుగా ప్రింట్ తీసుకోవచ్చు. కేవలం 90 సెకండ్లలోనే ఫొటోను ప్రింట్ తీసి.. చేతికి అందిస్తుందీ ప్రింటర్. కార్డ్ సైజులో ఫొటోలను ప్రింట్ చేసే ఈ పోర్టబుల్ ప్రింటర్ ధర రూ.21,000. instax.comతోపాటు అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ దొరుకుతుంది.