కెమెరా ఫ్లాష్లైట్లు, గేమింగ్ కంట్రోలర్లు, రిమోట్ కార్లు-బొమ్మలు.. వీటిలో తరచుగా ఏఏ-బ్యాటరీలు మార్చాల్సి ఉంటుంది. దీనివల్ల ఖర్చుతోపాటు పర్యావరణానికి కూడా హాని కలుగుతుంది. Portronics AA Lithius Type C Rechargeable Batteries వాడితే.. బ్యాటరీలను మళ్లీమళ్లీ మార్చాల్సిన పని ఉండదు. సాధారణ రీచార్జబుల్ బ్యాటరీలతో పోలిస్తే ఇవి చాలా అత్యాధునికమైనవి. సౌకర్యవంతమైనవి కూడా. వీటిని చార్జ్ చేయడానికి ప్రత్యేకంగా చార్జింగ్ డాక్, అడాప్టర్ అవసరం లేదు. బ్యాటరీపైనే నేరుగా టైప్-సి పోర్ట్ ఉంటుంది. మొబైల్ టైప్-సి కేబుల్‌తోనే వీటిని చార్జ్ చేసుకోవచ్చు. ఇవి చాలా వేగంగా చార్జ్ అవుతాయి కూడా. ఇక సాధారణ రీచార్జబుల్ బ్యాటరీలు 1.2 వోల్ట్స్ మాత్రమే ఇస్తాయి. కానీ ఈ లిథియం బ్యాటరీలు డిశ్చార్జ్ అయ్యేంత వరకు స్థిరమైన 1.5 వోల్ట్స్ను అందిస్తాయి. దీనివల్ల ఎలక్ట్రానిక్ పరికరాల పనితీరుపై ప్రభావం పడదు. వీటిని వెయ్యి సార్లకుపైగా రీచార్జ్ చేసి తిరిగి ఉపయోగించవచ్చు. దీనివల్ల పదేపదే కొత్త బ్యాటరీలు కొనే అవసరం ఉండదు. దాంతో ఖర్చు చాలా తగ్గుతుంది.
మరింత ఈజీగా బట్టలు ఐరన్

ఇస్త్రీ చేయడం రానివాళ్లు కూడా చక్కగా వాడుకునేలా ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఫిలిప్స్.. సరికొత్త ఐరన్ బాక్స్‌లను తీసుకొచ్చింది. Philips 6000 Series Steam Iron పేరుతో మార్కెట్లో విడుదల చేసింది. రోజువారీ వాడకానికి ఉపయోగపడే స్టాండ్ అలోన్ స్టీమ్ ఐరన్లు ఇవి. దుస్తులను త్వరగా, సులభంగా ఐరన్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఆప్టిమల్ టెంపరేచర్ సాంకేతికత వల్ల.. దుస్తులకు తగిన టెంపరేచర్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. దీనివల్ల పట్టు, కాటన్ వంటి ఏ రకం వస్ర్తాలైనా కాలిపోయే ప్రమాదం ఉండదు. శక్తిమంతమైన స్టీమ్ఫుట్ వల్ల.. నిమిషానికి 45గ్రా.-50గ్రా. వరకు నిరంతర ఆవిరిని ఇస్తుంది. కఠినమైన మడతలను వదిలించడానికి 190గ్రా.-220గ్రా. వరకు స్టీమ్ బూస్ట్ సామర్థ్యం కూడా ఉంది. నీటి చుక్కలు దుస్తులపై పడకుండా డ్రిప్ స్టాప్ టెక్నాలజీని వాడారు. ఐరన్ బాక్స్‌ను కొంతసేపు వాడకుండా వదిలేస్తే.. ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది.
ఏఐ పెట్ పెంచేద్దామా!?

పెట్స్‌ను పెంచుకోవాలని అనుకుంటారు. కానీ, అపార్ట్మెంట్ నిబంధనలు, సమయాభావం, అలర్జీలు.. లాంటి కారణాలతో వాటికి దూరంగా ఉంటారు. అలాంటివారికి sweekarAI powered Tamagotchi అద్భుతమైన ప్రత్యామ్నాయం. ఒంటరిగా ఉండేవారికి వర్చువల్ తోడుగానూ నిలుస్తుంది. ‘తమగోచి’ ప్రేరణతో, అత్యాధునిక ఏఐ సాంకేతికతతో రూపొందిచిన కొత్త రకం ఏఐ పాకెట్ పెట్. ఇది గుడ్డు రూపం నుంచి బయటికి వచ్చి, నాలుగు దశల్లో ఎదుగుతుంది. మీరు దీనిని చూసుకునే విధానం, మాట్లాడే తీరును బట్టి.. దీని రూపం, గొంతు, ప్రవర్తన మారుతుంది. తనకంటూ సొంత వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటుంది. ఆహారం ఇవ్వడం, మాట్లాడటం, శుభ్రం చేయడం, చేతుల్లోకి తీసుకోవడం లాంటి పనుల ద్వారా దీనికి ఎక్స్పీరియన్స్ పాయింట్లు లభిస్తాయి. స్వీకార్ లెవెల్ పెరిగినప్పుడల్లా.. భౌతికంగా కొన్ని మిల్లీమీటర్లు ఎత్తు పెరుగుతుంది. ఇందులో 730 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. గూగుల్ జెమినై ఫ్లాష్, చాట్ జీపీటీ క్లాస్ మాడల్స్‌లో పని
చేస్తుంది. కేవలం 89 గ్రాముల బరువు మాత్రమే ఉండి, మీ జేబులో సులభంగా ఇమిడిపోతుంది.
లీకేజీలకు చెక్!

ఇంట్లో నీటి లీకేజీలకు ఏఐ సాంకేతికత చెక్ పెడుతుంది. TP-Link Tapo T300 అమర్చుకుంటే.. లీకేజీకి ముందే మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. ట్యాంక్ నుంచే కాకుండా.. సింక్, వాషింగ్ మెషిన్ కింద చుక్కలుగా పడే నీటిని కూడా గుర్తించి సమాచారం అందించే స్మార్ట్ సెన్సర్ ఇది. ఈ సెన్సర్ పైన, కింద భాగాల్లో అత్యంత సున్నితమైన ఆరు ప్రోబ్స్ ఉంటాయి. దీనివల్ల లీకేజీలు, పైనుంచి పడే నీటి చుక్కలను త్వరగా గుర్తిస్తుంది. వెంటనే పరికరం నుంచి బిగ్గరగా సైరన్ మోగుతుంది. అవసరమైతే టాపో యాప్ ద్వారా ఒకే క్లిక్‌తో ఈ సౌండ్‌ను ఆపవచ్చు. మీరు ఇంట్లో లేకపోయినా, లీకేజీ జరిగిన క్షణంలోనే టాపో యాప్ ద్వారా మీ ఫోన్‌కు నోటిఫికేషన్ అందిస్తుంది. ఇది పూర్తిగా వాటర్‌ప్రూఫ్, డస్ట్‌ప్రూఫ్ కూడా. తేమ ఎక్కువగా ఉండే బాత్రూమ్లు, బేస్మెంట్లు, సింక్ కింద వైర్ల గోల లేకుండా సులభంగా అమర్చుకోవచ్చు.