1 అయోధ్య రామాలయంలో జనవరి 22న బాలరాముడు కొలువు దీరాడు. కృష్ణశిలతో రూపొందిన ఈ మూర్తిని మలచిన శిల్పి ఎవరు?
2 దాదాపు 50 ఏండ్ల వరకు రీచార్జి కానీ, మెయింటెనెన్స్ కానీ అవసరం లేకుండా న్యూక్లియర్ బ్యాటరీల గురించి వార్తలు వచ్చాయి. వాటిని ప్రాథమికంగా అభివృద్ధి చేసినట్టు ప్రకటించిన చైనా సంస్థ ఏది?
3 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో ఓ భారతీయ ఆటగాడు 35 ఏండ్ల తర్వాత తొలిసారిగా ఓ సీడెడ్ ఆటగాడిని ఓడించి రెండో రౌండ్లో ప్రవేశించి వార్తల్లో నిలిచాడు. ఆ ఘనత సాధించిన క్రీడాకారుడు ఎవరు?
4 అగ్రశ్రేణి చదరంగ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ రేటింగ్ 2748 పాయింట్లను అధిగమించి, 2748.3 పాయింట్లతో చెస్‌లో భారతదేశంలో మొదటి ర్యాంకర్‌గా అవతరించిన తమిళనాడు క్రీడాకారుడు ఎవరు?
5 రోజురోజుకూ రాత్రిళ్లు కాంతి కాలుష్యం ఎక్కువైపోతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో తొలిసారిగా ఒక పులుల సంరక్షణ కేంద్రాన్ని ‘డార్క్ స్కై పార్క్’ (రాత్రిళ్లు కృత్రిమ కాంతి లేనిది)గా ప్రకటించారు. ఆ టైగర్ రిజర్వ్ ఏది?
6 భారతదేశంలో 83,000 కోట్ల రూపాయల విలువైన మెగా ఎంటర్టైన్మెంట్ సంస్థను సృష్టించడానికి రెండు వినోద రంగ దిగ్గజ సంస్థలు రెండేండ్ల కింద కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఇటీవల రద్దు చేసుకున్నాయి. ఆ సంస్థలు ఏవి?
7 అండర్ -19 కూచ్ బిహార్ ట్రోఫీ ఫైనల్లో కర్ణాటక జట్టు ఆటగాడు క్వాడ్రపుల్ (400 పరుగులు) సెంచరీ నమోదు చేశాడు. ఈ టోర్నీ ఫైనల్లో 400కు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సాధించిన ఆ బ్యాటర్ ఎవరు?
8 ప్రతిష్ఠాత్మక జాన్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ 90 దేశాలకు చెందిన 16 వేల మంది విద్యార్థులకు ప్రతిభా పరీక్షలు నిర్వహించింది. వీటి ఆధారంగా ప్రపంచంలో అత్యంత తెలివైన విద్యార్థుల జాబితాలో చోటు దక్కించుకున్న భారత సంతతి అమెరికా బాలిక?
9 జపాన్ గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రయోగించిన స్పేస్‌క్రాఫ్ట్ ఒకటి చంద్రుడి మీద అడుగుపెట్టింది. దీంతో ఈ ఘనత సాధించిన ఐదో దేశంగా అవతరించింది. చంద్రుడి మీద అడుగిడిన జపాన్ ల్యాండర్ పూర్తి పేరు?
10 టైటానిక్‌తో పోలిస్తే ఐదు రెట్లు పెద్దదైన ఓ అత్యంత విలాసవంతమైన నౌక జనవరి 27న అమెరికాలోని మియామి నుంచి ప్రయాణానికి సిద్ధమైంది. 20 అంతస్తులు కలిగిన ఆ నౌక పేరేంటి?