హెచ్‌పీ నుంచి వచ్చిన ఆమ్ని బుక్ అల్ట్రా ఫ్లిప్ ల్యాప్‌టాప్ మార్కెట్లో తనదైన ప్రత్యేకతను చూపిస్తున్నది. అత్యంత సన్నగా, తక్కువ బరువుతో ఉండటమే కాకుండా.. ఆధునిక ఏఐ ఫీచర్లు దీని ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా గ్రాఫిక్ డిజైనర్లు, వీడియో ఎడిటర్లు, కోడింగ్ ప్రొఫెషనల్స్‌ను దృష్టిలో ఉంచుకుని దీనిని డిజైన్ చేశారు. కేవలం 14.9 మిల్లీమీటర్ల మందం, 1.35 కిలోల బరువు మాత్రమే ఉండటంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. అల్యూమినియం బాడీ, యాంటి ఫింగర్‌ప్రింట్ కోటింగ్ ఉంది. బ్లూ, గ్రే కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. 360 డిగ్రీ హింజ్ మెకానిజం వల్ల ల్యాప్‌టాప్, టాబ్లెట్ మోడ్ల మధ్య సులభంగా మార్పు చేసుకోవచ్చు. స్టయిలస్ సపోర్ట్ కూడా ఉంది.
డిస్ప్లే విషయానికి వస్తే.. 14 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్. 120 హెర్ట్ వేరియబుల్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. ఇంటెల్ అల్ట్రా కోర్ 7 ప్రాసెసర్, ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్‌ని వాడారు. దీంతో బ్రౌజింగ్, వీడియో కాల్స్, ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు ఎలాంటి ఆటంకం లేకుండా వాడుకోవచ్చు. మల్టీటాస్కింగ్లోనూ ఎలాంటి లాగ్ ఉండదు. గేమింగ్‌కు కూడా ఇది చక్కని ఎంపిక. ఓఎల్ఈడీ డిస్ప్లేలో కలర్ విజువల్స్ అద్భుతంగా కనిపిస్తాయి. హెచ్‌పీ ప్రకారం ఈ ల్యాప్‌టాప్ 21 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌తో గంటలోనే పూర్తి చార్జ్ అవ్వడం దీంట్లోని ప్రత్యేకత. ఆమ్ని బుక్ అల్ట్రా ఫ్లిప్ ప్రీమియం ల్యాప్‌టాప్ కావడంతో ధర కాస్త ఎక్కువే. మ్యాక్ బుక్ తరహాలో ప్రీమియం విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నట్టయితే ఇదో చక్కని ఎంపిక.
-ధర: రూ. 1,89,999. దొరుకు చోటు: https://bit.ly/3Qfur4T
బీట్స్ బ్రాండ్ నుండి కొత్తగా పవర్ బీట్స్ ప్రో 2 విడుదలైంది. స్పోర్ట్స్, ఫిట్నెస్ ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ వైర్లెస్ ఇయర్‌బడ్స్.. మార్కెట్లో ట్రెండ్ అవుతున్నాయి. ఇక ప్రత్యేకతలు, ఫీచర్ల విషయానికి వస్తే.. పవర్ బీట్స్ ప్రో 2లో కొత్త పర్సనలైజ్డ్ స్పేషియల్ ఆడియోను సెట్ చేసుకునే సదుపాయం ఉంది. అడాప్టివ్ ఈక్వలైజర్ సౌండ్‌ను అడ్జస్ట్ చేసుకుని.. వినియోగదారుల చెవులకు సరిపడేలా ఆడియో సెట్ చేసుకోవచ్చు. ఇక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్పరెన్సీ మోడ్‌లాంటి ప్రీమియం ఫీచర్లు దీంట్లో ప్రత్యేకం. పవర్ బీట్స్‌ని 20% తక్కువ బరువుతో రూపొందించారు.
దీంతో ఎక్కువ సమయం వాడే వారికి సౌకర్యంగా ఉంటాయి. ఈ మోడల్లో ప్రత్యేకంగా హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సర్ కూడా ఉంది. ఎల్ఈడీ ఆప్టికల్ సెన్సర్ ద్వారా ప్రతి సెకనుకు 100 సార్లు రక్త ప్రవాహాన్ని పరీక్షించి, వినియోగదారుల హార్ట్ రేట్‌ను ట్రాక్ చేస్తుంది. Runna, Nike Run Club, Open వంటి ఫిట్నెస్ యాప్స్‌తో ఈ డేటాను షేర్ చేసుకోవచ్చు. యాపిల్ వినియోగదారుల కోసం వన్-టచ్ పెయిరింగ్, ఆటో స్విచింగ్, హ్యాండ్స్ ఫ్రీ సిరి యాక్టివేషన్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం బీట్స్ యాప్ అందుబాటులో ఉంది.
-ధర: రూ.29,900 దొరుకు చోటు: apple.com/in
ప్రముఖ భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా.. ఈ నెలలోనే తన కొత్త ప్రొవాచ్ ఎక్స్ స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేయనుంది. హెల్త్, ఫిట్నెస్ ఫీచర్లకు ప్రాధాన్యం ఇస్తూ ఈ వాచ్‌ను రూపొందించినట్లు కంపెనీ చెబుతున్నది. సాధారణంగా ప్రీమియం వేరియబుల్స్‌లో కనిపించే VO2 Max మెజర్మెంట్, బాడీ ఎనర్జీ మానిటరింగ్ ఫీచర్లు ఇందులో ప్రత్యేకత. ఫిట్నెస్ లవర్స్‌ని ఆకట్టుకునే స్పెషల్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.. VO2 Max మెజర్మెంట్ ద్వారా హార్ట్, లంగ్స్ పనితీరును విశ్లేషించి కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ స్థాయిని అంచనా వేస్తుంది. ముఖ్యంగా రన్నింగ్, సైక్లింగ్, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేసే వారికి ఇది ఎంతో ఉపయోగకరం. ఇక బాడీ ఎనర్జీ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా హార్ట్‌రేట్ వేరియబిలిటీ, స్ట్రెస్ లెవల్స్, నిద్ర నాణ్యత, రోజువారీ యాక్టివిటీ వంటి అంశాలను ట్రాక్ చేసి.. రియల్‌టైమ్ ఎనర్జీ లెవల్స్ కూడా అంచనా వేయవచ్చు. దీని ద్వారా వర్కవుట్స్, రెస్ట్, డైలీ రొటీన్ పనుల్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. వాచ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉంటుంది.
-ధర: 7,500 (అంచనా)
ఆసస్ తన కొత్త టూ ఇన్ వన్ డివైస్ ప్రో ఆర్ట్ పీజడ్13ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఇది నేటితరం అవసరాలకు తగినట్టుగా పనిచేస్తుంది. క్రియేటివ్ ప్రొఫెషనల్స్, టెక్నాలజీ ఎనలిస్ట్‌లను లక్ష్యంగా చేసుకుని దీనిని రూపొందించారు. ఓఎల్ఈడీ డిస్ప్లే, బలమైన బ్యాటరీ లైఫ్, ఇతర ప్రీమియం ఫీచర్లతో వస్తున్నది. మెటల్ యూనీబాడీ డిజైన్‌తో, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. కేవలం 0.35 అంగుళాల మందం, 0.85 కిలోల బరువుతో సులభంగా తీసుకెళ్లేలా ఉంటుంది. ట్యాబ్‌కు మాగ్నెటిక్ బ్యాక్ కవర్ ద్వారా స్టాండ్ అందుబాటులో ఉంది.
చక్కని స్టెబిలిటీతో ఏ యాంగిల్లో ట్యాబ్‌ని పెట్టినా సౌకర్యంగా పని చేసుకోవచ్చు. 13.3 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే, 2880 x 1600 పిక్సెల్ రిజల్యూషన్, డిస్ప్లే డాల్బీ విజన్ సపోర్ట్‌తో హెచ్డీఆర్ కంటెంట్ మరింత తేటగా కనిపిస్తుంది. Snapdragon X Plus X1P-42-100 ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్‌తో పనిచేస్తుంది. డాక్యుమెంట్స్ క్రియేషన్, వెబ్ బ్రౌజింగ్, మీడియా కంటెంట్ వంటివాటికి చక్కగా పనిచేస్తుంది. ట్యాబ్‌లో 70Wh బ్యాటరీ ఉంది. వీడియో ప్లేబ్యాక్ టైమ్ 16 గంటలు.. సాధారణ పనుల్లో 20 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. మాగ్నెటిక్ కీబోర్డ్‌కి కనెక్ట్ అవుతుంది. 2 USB 4.0 Type-C, SD కార్డ్ రీడర్ ఉన్నాయి. Wi-Fi 7, Bluetooth 5.4 కనెక్టివిటీతో అందుబాటులోని నెట్‌వర్క్‌లకు కనెక్ట్ అవ్వొచ్చు.
-ధర: 1,39,990 దొరుకు చోటు: https://www.asus.com