ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘నథింగ్ ఫోన్ 3’ వచ్చేసింది. ఎందుకంటే, నథింగ్ ఈసారి కేవలం స్టయిల్ కోసమే కాదు.. ప్రీమియం సెగ్మెంట్లోని అన్ని కంపెనీల మోడళ్లతోనూ పోటీకి సై అంటున్నది! ఇది 6.7 అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తున్నది. ఫోన్‌కి మెయిన్ హైలైట్ ఏంటో తెలుసా? దాని వెనకాల ఉండే కొత్త గ్లిఫ్ మ్యాట్రిక్స్! ఇది కేవలం షో కోసం కాదు.. నోటిఫికేషన్లు వచ్చినా, కాల్స్ వచ్చినా, చార్జింగ్ అవుతున్నా స్టయిలిష్‌గా వెలుగుతుంది. అంటే మీ ఫోన్ ఒక యూనిక్ అండ్ కూల్ స్టేట్మెంట్ ఇస్తుందన్నమాట. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్4 చిప్‌సెట్‌ను ఏర్పాటుచేశారు. 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వరకు వస్తుంది. కెమెరా గురించి చెప్పాలంటే.. ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. 50 ఎంపీ వైడ్ సెన్సర్, 50 ఎంపీ పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్, 50 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తున్నది. బ్యాటరీ సామర్థ్యం.. 5,500 ఎంఏహెచ్. ఫోన్‌తోపాటు ‘నథింగ్ హెడ్‌ఫోన్ 1’ కూడా మ్యూజిక్ లవర్స్‌కు అదిరే ట్రీట్ అనొచ్చు. ఇందులో సౌండ్ క్వాలిటీ అల్టిమేట్‌గా ఉంటుంది. డీప్ బాస్, క్రిస్ప్ ట్రెబుల్.. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఆన్-ఇయర్ డిటెక్షన్ కూడా ఉంది. అంటే, హెడ్‌ఫోన్స్ తీయగానే మ్యూజిక్ ఆగిపోతుంది. పెట్టుకోగానే మళ్లీ ప్లే అవుతుంది.
ధర: రూ.79,999
దొరుకు చోటు: ఫ్లిప్‌కార్ట్.కామ్
ఏఐ హంగులతో ఎఫ్36 5జీ
బడ్జెట్ ఫ్రెండ్లీ, అదిరిపోయే ఫీచర్స్‌తో ఒక కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీ వెయిటింగ్‌కి సామ్సంగ్ చెక్ పెట్టేస్తున్నది. కొత్త గెలాక్సీ ఎఫ్36 5జీ ఫోన్ లాంచ్ చేస్తున్నది. ఇప్పటికే అధికారికంగా దీని టీజర్ రిలీజ్ అయింది. ఈసారి సామ్సంగ్ బడ్జెట్ ఫోన్లోనే ఏఐ మ్యాజిక్‌ని చూపించబోతున్నది. ముఖ్యంగా ఎడిటింగ్ విషయంలో యూజర్లు అద్భుతాలు ఆశించొచ్చు. లుక్ పరంగా చూస్తే.. నాజూకుగా కనిపిస్తున్నది. ఇది గెలాక్సీ ఎఫ్34 5జీకి సక్సెసర్‌గా వస్తున్నది. ఫోన్ ఎడమ వైపున సిమ్ ట్రే ఉంది. ఈమధ్య కాలంలో చాలాఫోన్లు పక్కన సిమ్ ట్రేతో వస్తున్నాయి కదా.. ఇది కూడా అంతే అన్నమాట. వెనుక వైపున ఓవల్ షేప్‌లో ఉన్న కెమెరా మాడ్యూల్ చూడటానికి స్టయిలిష్‌గా ఉంది. అందులో మూడు కెమెరా సెన్సర్లు ఉన్నాయి. అంటే ఫొటోగ్రఫీ ప్రియులకు ఇది మంచి చాయిస్ అవ్వొచ్చు. కెమెరాలో లేదా ఓవరాల్ సిస్టమ్‌లో ఏఐ -పవర్డ్ ఎన్హాన్స్మెంట్స్ ఉండే అవకాశం ఉంది.
ధర: రూ.20,000 (అంచనా)
దొరుకు చోటు: ఫ్లిప్‌కార్ట్.కామ్
టార్చ్ మాత్రమే కాదు.. సేఫ్టీ కిట్ కూడా!
ఏదైనా ప్రతికూల సమయాల్లో.. ముఖ్యంగా రాత్రివేళల్లో ఎప్పుడూ వెంటే ఉంచుకునేది ఏంటి? సింపుల్.. టార్చ్ లైట్. అలాంటి టార్చ్ లైట్.. సేఫ్టీ కిట్గానూ పని చేస్తే. ఎంజెడ్ ఎస్700 లైఫ్ సేవింగ్ ఎల్ఈడీ టార్చ్ అలాంటిదే! ఇదొక కాంపాక్ట్, రీచార్జబుల్ టార్చ్ లైట్. చీకట్లో దారి చూపడానికే కాదు, ఎమర్జెన్సీలో మీ ప్రాణాలు కాపాడగల సామర్థ్యం కూడా దీనికి ఉంది. ఈ టార్చ్‌కి ఉన్న ఫీచర్స్ వింటే ఆశ్చర్యపోతారు. గ్లాస్ బ్రేకర్, సీట్ బెల్ట్ కట్టర్ కూడా ఇందులోనే ఉన్నాయి! అంటే, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, కారులో చిక్కుకుపోతే, సీట్ బెల్టు కట్ చేయడానికి, గ్లాస్ పగలగొట్టడానికి ఇది సాయపడుతుంది. ఇది మూడు రకాల లైట్ మోడ్స్‌తో వస్తుంది. ఎంత వెలుగు కావాలో కూడా సెట్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీలో ఎవరికైనా సిగ్నల్ ఇవ్వడానికి స్ట్రోబ్ మోడ్ బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక పవర్ఫుల్ ఎల్ఈడీ లైట్‌తో వస్తుంది. దీంతో… చీకటిగా ఉన్న ప్రదేశాల్లో, అవుట్డోర్ యాక్టివిటీస్‌లో లేదా అత్యవసర పరిస్థితుల్లో వాడొచ్చు. రీచార్జబుల్ బ్యాటరీ ఉండటం వల్ల మీరు డిస్పోజబుల్ బ్యాటరీల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
ధర: రూ. 1,199
దొరుకు చోటు: ఫ్లిప్‌కార్ట్.కామ్
మణికట్టుపై మాయాజాలం!
ఫిట్నెస్ ఫ్రీక్స్! మీ చేతికి కేవలం టైమ్ చెప్పే వాచ్ కాకుండా.. మీ స్టయిల్‌కి, మీ హెల్త్‌కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే ఒక స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నారా? అయితే, సీఎంఎఫ్ బై ‘నథింగ్ వాచ్ ప్రొ 2’ మీ కోసమే వచ్చేసింది! 1.32 అంగుళాల AMOLED డిస్ప్లే, ఆటో-బ్రైట్నెస్, గెస్చర్ కంట్రోల్‌తో మస్తు ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. కస్టమైజ్ చేసుకోగలిగే వాచ్ బెజెల్ (చుట్టూ ఉండే రింగ్) డిజైన్‌తో వస్తున్నది. ఆటో-బ్రైట్నెస్ ఫీచర్‌తో మీరు మండుటెండలో ఉన్నా.. చీకటి గదిలో ఉన్నా, డిస్ప్లే ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతుంది. ఇందులో 100కి పైగా వాచ్ ఫేస్‌లు, 120 స్పోర్ట్స్ మోడ్లు ఉన్నాయి! ఈ వాచ్‌లో గైడెడ్ వార్మ్-అప్ వీడియోలు కూడా వస్తున్నాయి. అప్‌గ్రేడెడ్ స్మార్ట్ స్లీప్ టెక్నాలజీతో పడుకునే సమయం, నిద్ర దశలు, పగటిపూట నిద్రపోయినా కచ్చితమైన డేటాను అందిస్తుంది. 24/7 హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ మానిటరింగ్‌తో మీ ఆరోగ్యంపై నిఘా ఉంచుతుంది. బ్రీతింగ్ ఎక్సర్ సైజులు చేయమని, నీళ్లు తాగమని, నిలబడమని రెగ్యులర్‌గా రిమైండర్లు కూడా ఇస్తుంది.
ధర: రూ.4,100
దొరుకు చోటు: ఫ్లిప్‌కార్ట్.కామ్