ఇప్పుడున్న ట్రాఫిక్‌లో కారు డ్రైవింగ్ చాలా కాన్షస్‌గా చేయాలి. ముఖ్యమైన ఫోన్‌కాల్ అని.. మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయడం ఏ మాత్రం సురక్షితం కాదు. పైగా.. చట్ట రీత్యా నేరం కూడా. అందుకే మీరు డ్రైవ్ చేసే కారు ఎంత పాతదైనా.. ఇదిగో ఈ పోర్ట్రీనిక్స్ తయారుచేసిన బ్లూటూత్ రిసీవర్ని ప్రయత్నించండి. ఇది కారులో ఉంటే.. ఫోన్‌ని ముట్టకుండానే కాల్స్ మాట్లాడొచ్చు. బయటి శబ్దాల్ని ఫిల్టర్ చేసేలా నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయం ఉంది. అంతేకాదు.. కారులో ఉన్న ఎంపీ3 ప్లేయర్‌కి ఆక్స్ కేబుల్‌తో కనెక్ట్ అయ్యి.. నచ్చిన ట్రాక్స్ వినొచ్చు. అన్ని మోడళ్ల స్మార్ట్ఫోన్లకు బ్లూటూత్ రిసీవర్ ఇట్టే కనెక్ట్ అవుతుంది. రిసీవర్‌కి ఉన్న రెండు బటన్లలో ఒకటి కాల్ లిఫ్ట్ చేయడానికి.. మరొకటి పాటలు వినేటప్పుడు బాస్‌ని పెంచుకునేందుకు వాడొచ్చు. సిరి, గూగుల్ వాయిస్ అసిస్టెంట్లతో జత కడుతుంది. అంటే.. ‘హే సిరీ.. కాల్ టూ మామ్’ అని చెబితే చాలు. అమ్మకి ఫోన్ వెళ్లిపోతుంది.
ధర: రూ. 479
దొరికే చోటు: https://amzn.in/d/9IA0f3P
‘సోలో’గా వినేందుకు.. జంటగా వచ్చాయ్
ఫోన్ చేతిలో ఉందంటే కాల్స్ మాట్లాడటమే కాదు.. ఓ ఎంటర్టైన్మెంట్ అడ్డా చేతిలో ఉన్నట్టే! ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫేవరెట్ ఆల్బమ్స్ ఎన్ని ఉంటాయో!! మరైతే.. మీ మ్యూజిక్ ట్రాక్స్ విని ఎంజాయ్ చేయడంతోపాటు.. సౌకర్యంగా కాల్స్ మాట్లాడేందుకు ‘బీట్స్ సోలో బడ్స్’ ట్రై చేయండి. చూడ్డానికి స్లిమ్‌గానే ఉంటాయ్ గానీ.. సౌండ్ అవుట్‌పుట్‌లో మాత్రం అదుర్సే! చెవుల్లో సౌకర్యంగా అమరేలా వీటిని చక్కగా తీర్చిదిద్దారు. ‘డ్యూయల్ లేయర్’ డ్రైవర్స్‌తో రెండు బడ్స్ నుంచి అవుట్‌పుట్ బ్యాలెన్స్డ్గా వస్తుంది. బయటి శబ్దాల్ని ఫిల్టర్ చేసి చక్కని క్వాలిటీతో కాల్స్ మాట్లాడొచ్చు. దీంట్లోని మరో ప్రత్యేకత ఏంటంటే.. బడ్స్ని ఫోన్ నుంచి కూడా చార్జ్ చేయొచ్చు. ‘ఫాస్ట్ ఫ్యూయల్’ చార్జ్‌తో 5 నిమిషాలు చార్జ్ చేస్తే.. ఒక గంటపాటు బడ్స్ పనిచేస్తాయి. ఫుల్ చార్జ్ చేస్తే 18 గంటలపాటు నిరంతరాయంగా వాడుకోవచ్చు. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లతో జతకట్టి పని చేస్తుంది. చిన్న కేస్‌లో బడ్స్ పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.
ధర: రూ.6,900
దొరికే చోటు: www.beatsbydre.com
చూసేందుకు రేడియో.. కానీ!
ఓ రేడియోని చేత్తో పట్టుకుని.. అలా నచ్చిన మ్యూజిక్ ట్రాక్స్ వింటూ నడుచుకుంటూ వెళ్తుంటే భలే హాయిగా ఉంటుంది కదా. రేడియోలో నచ్చిన పాటలు ఎలా వింటాం? ప్రసారం అయ్యే వాటినే వినాలి కదా!? అంటారా? యస్.. నిజమే!! అలాగైతే.. చూడ్డానికి రేడియో మాదిరిగా కనిపిస్తుంది. కానీ, దాంట్లో మీకు నచ్చిన పాటలు వినొచ్చు!! అదెలా సాధ్యం అని సందేహించకుండా జెబ్రానిక్స్ తయారుచేసిన పోర్టబుల్ స్పీకర్‌ని చూడండి. దీంట్లో ఏర్పాటుచేసిన 6.4 అంగుళాల మొబైల్ హోల్డర్ సపోర్ట్‌తో స్మార్ట్‌ఫోన్‌ని పెట్టుకోవచ్చు. ఫోన్‌ను హోల్డర్‌లో పెడితే చూడ్డానికి రేడియో స్క్రీన్‌లా స్మార్ట్‌ఫోన్ మారిపోతుంది. ఇంకేముంది.. నచ్చిన ట్రాక్స్‌ని ఆల్బమ్‌లో పెట్టేసి మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. స్పీకర్‌కి ఉన్న హ్యాండిల్ పట్టుకుని వెళ్తుంటే చూసేవారికి రేడియోలానే కనిపిస్తుంది. ఫోన్ హోల్డర్ కింద ఉన్న రెండు వాల్యూమ్ బటన్లతో సంప్రదాయ రేడియో మాదిరే సౌండ్ పెంచుకోవచ్చు.. తగ్గించుకోవచ్చు. స్పీకర్ వెనక యూఎస్బీ డ్రైవ్, మైక్రో ఎస్డీ కార్డు, ఎఫ్ఎమ్ రేడియో ఆప్షన్లు ఉన్నాయి. దీంతో ఫోన్ కాల్స్ కూడా మాట్లాడొచ్చు. దీని బ్యాటరీ బ్యాక్అప్ టైమ్ 15 గంటలు.
ధర: రూ.999
దొరికే చోటు: https://tinyurl.com/2x7tunvp
బిజీ లైఫ్‌కి తోడుగా!
రోజులో ఎన్ని పనులో చేయడానికి. మనకేం నాలుగు చేతులు లేవుగా? కచ్చితంగా మల్టీ టాస్కింగ్ చేయాల్సిందే! అప్పుడు కచ్చితంగా మనం టెక్నాలజీ సాయం తీసుకోవాల్సిందే! కావాలంటే ఈ బ్లూటూత్ స్పీకర్‌ని చూడండి. దీన్ని వాడటం ద్వారా రోజువారీ పనుల్లో కొన్నిటిని చకచకా ముగించేయొచ్చు. జస్ట్ కాలర్ మైక్‌లా దీన్ని పెట్టుకుంటే కాల్స్ మాట్లాడొచ్చు. సో.. వాకింగ్ లేదా సైక్లింగ్ చేస్తూ మీ ఆఫీస్ కాన్ఫెరెన్స్ కాల్స్ అన్నిటినీ సౌకర్యంగా మాట్లాడొచ్చు. స్పీకర్లా సెట్ చేసుకుని ఆన్లైన్ క్లాసులు.. పాడ్‌క్యాస్ట్‌లు వినొచ్చు. ఇంకా చెప్పాలంటే.. మైక్రోఫోన్లానూ వాడుకోవచ్చు. అంటే.. ఏదైనా వీడియో కంటెంట్ చేస్తున్నప్పుడు వాయిస్ రికార్డ్ చేస్తుంది. ఒకసారి చార్జ్ చేస్తే సుమారు 10 గంటలు పనిచేస్తుంది. నీళ్లలో తడిసినా.. దుమ్ము పడినా ఏం కాకుండా
స్పీకర్‌కి రక్షణ కవచం కూడా ఉంది.
ధర: రూ.999
దొరికే చోటు: https://tinyurl.com/f83rwuap