నయా మాల్
టెక్నాలజీకి సంబంధించిన వస్తువులు కొత్త కొత్తవి తయారు చేస్తున్నాయి టెక్ కంపెనీలు. వాటికి చెందిన సెల్‌ఫోన్ బ్లూటూత్ గేమ్ ప్యాడ్, కీ బోర్డ్, ఎల్ఈడీ లైట్, హోమ్ అసిస్టెంట్ డివైజ్‌ల గురించి అందిస్తున్నాం. టెక్ ప్రియులు వీటిపై ఓ లుక్కేయండి.
ఆటను ఆస్వాదించేలా
మొబైల్ గేమింగ్ రంగంలో మరో విప్లవాత్మక మార్పు ఆవిష్కృతమైంది. గేమర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా abxylute M4 Controller వచ్చేసింది. స్మార్ట్‌ఫోన్ గేమర్స్, రెట్రో గేమింగ్‌ను ఇష్టపడేవారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కాంపాక్ట్ బ్లూటూత్ గేమ్‌ప్యాడ్ ఇది. చాలా చిన్నగా, తేలికగా ఉండే ఈ కంట్రోలర్‌ను ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా ఖాళీ సమయాల్లో తక్షణమే గేమింగ్ ప్రారంభించడానికి చక్కగా సరిపోతుంది. మ్యాగ్నెటిక్ ఫీచర్ ఈ కంట్రోలర్ ప్రత్యేకత. MagSafe ద్వారా ఫోన్ వెనుక భాగానికి అతుక్కుంటుంది. ఇందులో 18 బటన్లు, డ్యూయల్ జాయ్‌స్టిక్స్, టర్బో మోడ్ లాంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. దీని ద్వారా ఆటల్లో వేగంగా రియాక్ట్ అవ్వడానికి, కాంబోలను సులభంగా ఆస్వాదించడానికి వీలవుతుంది. మొబైల్ గేమింగ్‌ను మరింత ఆసక్తికరంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడైనా ఆస్వాదించాలనుకునే వారికి
ఈ ఎం4 కంట్రోలర్ ఒక అద్భుతమైన ఎంపిక.
– ధర: రూ. 7,788, దొరుకుచోటు: అమెజాన్

Gamepad
కొత్త టైప్ కీబోర్డు..
కీబోర్డుతో కృత్రిమ మేధస్సు జత కలిసింది. ఆఫీస్ పనులు, కంటెంట్ క్రియేషన్‌ను మరింత వేగంగా, సులభంగా మార్చేసింది. Ulanzi సంస్థ రూపొందించిన AU05 Vibe Key AI Voice Input Keypad.. టైపింగ్ తండ్లాటను పూర్తిగా తగ్గించేస్తుంది. ఇది సాధారణ కీబోర్డ్ కాదు. వాయిస్-టు-టెక్ట్స్, ఏఐ అసిస్టెంట్ సేవలను అందించే మినీ ప్రోగ్రామబుల్ కీప్యాడ్. దీనిలో మూడు ప్రోగ్రామబుల్ ‘కీ’స్, ఒక రొటరీ నాబ్ ఉంటాయి. వీటిని మీ అవసరాలకు తగినట్లుగా కస్టమైజ్ చేసుకోవచ్చు కూడా. ఇందులో ప్రత్యేకమైన మైక్రోఫోన్ ఉంటుంది. దీని ద్వారా మనం మాట్లాడే మాటలను.. తక్షణమే టెక్ట్స్ రూపంలోకి మారుస్తుంది. టైప్ చేయడానికి ఎక్కువ సమయం పట్టే పెద్దపెద్ద డాక్యుమెంట్లు, మెజేస్‌లను కేవలం వాయిస్ ఇన్పుట్ ద్వారా చాలా త్వరగా టైప్ చేసేస్తుంది. ఇది అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో అనుసంధానం అవుతుంది. టైప్ భారాన్ని తగ్గించడంతోపాటు ఆఫీస్ మీటింగ్‌లు, నోట్స్ ప్రిపరేషన్, ఏఐ టూల్స్‌ను వేగంగా ఆపరేట్ చేస్తూ.. సమయాన్ని ఆదా చేస్తుంది.
– ధర: రూ. 5,952, దొరుకుచోటు: ulanzi.com

Keyboard
స్టయిలిష్‌గా కెమెరా సెటప్
ఫొటోగ్రఫీ, వీడియో ప్రొడక్షన్ పరికరాల తయారీలో అగ్రగామి అయిన గోడాక్స్ సంస్థ నుంచి ఓ వినూత్న డివైజ్ విడుదలైంది. వినియోగదారుల సౌలభ్యంతోపాటు కాస్త సృజనాత్మకతను జోడిస్తూ.. Godox LT1 Creative Pixel LED Lightను తీసుకొచ్చింది. ఇది సాధారణ కెమెరా లైటింగ్లా కాకుండా.. ఒక మినీ పిక్సెల్ డిస్ప్లేగా, స్మార్ట్ లైటింగ్ కంట్రోలర్‌గా పనిచేస్తుంది. కెమెరా సెటప్‌ను స్టయిలిష్‌గా మార్చేస్తుంది. అంతేకాకుండా, స్టూడియోలోని ఇతర గోడాక్స్ లైట్లను నియంత్రించడానికి ఒక ‘రిమోట్ స్విచ్’లా పనిచేస్తుంది. దీనిపై ఉండే బటన్ ద్వారా.. గ్రూప్ చేసిన అన్ని గోడాక్స్ లైట్లను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. ఇందులో వివిధ రకాల
పిక్సెల్ డిజైన్లు, ఎమోజీలు, నంబర్లు, టెక్ట్స్‌ను డిస్ప్లే చేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లోని Godox Light App సహాయంతో బ్లూటూత్ ద్వారా దీనిని కనెక్ట్ చేయవచ్చు.
– ధర: రూ. 3,300, దొరుకుచోటు: godox.com

Godox Led
ఇంటికి స్మార్ట్ అసిస్టెంట్..
స్మార్ట్ హోమ్‌లో భాగంగా.. హోమ్ అసిస్టెంట్ కోసం చూస్తున్నారా? బడ్జెట్లోనే అదిరిపోయే ఫీచర్లు ఉండాలని అనుకుంటున్నారా? అయితే, Zectrix సంస్థ సరికొత్తగా అభివృద్ధి చేసిన Zectrix ESP32-S3 E-Paper / E-Ink Dev Kit ఓ మంచి ఆప్షన్. టెక్ ప్రపంచంలో ఇప్పుడిదో సెన్సేషన్. ఇది కేవలం ఒక డిస్ప్లే మాడ్యూల్ మాత్రమే కాదు.. అన్నిరకాల సదుపాయాలను అందించే ఆల్ ఇన్ వన్ డివైజ్! ఇంట్లోని ఉష్ణోగ్రత, గదిలో తేమశాతం, ఇతర గృహోపకరణాల స్థితిని ఇందులోనే చూసుకోవచ్చు. ఇక ఆఫీసుల్లోనూ స్మార్ట్ క్యాలెండర్‌గా, రోజువారీ షెడ్యూల్స్, రిమైండర్లు చూపించే డిజిటల్ నోట్ ప్యాడ్లాగా వాడుకోవచ్చు. ఎప్పటికప్పుడు మారే వాతావరణం, వార్తలు, స్టాక్స్ లాంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. 2.4 GHz Wi-Fi, బ్లూటూత్ 5.0తో వైర్లెస్ ద్వారా ఇంటర్నెట్ డేటాను సులభంగా తెలుసుకోవచ్చు.
– ధర: రూ. 5,200, దొరుకుచోటు: zectrix.com

Smart Home
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

