పుస్తకంలేని ఇల్లు.. ఆత్మలేని శరీరం లాంటిది.
మళ్లమళ్ల చదివించే పిల్లల కథలు
నా బిడ్డ ఎండలోకి పోకుంట.. ఇంట్లనే కూసోబెట్టనీకి ఏం దొరుకుతదా అని దేవులాడుతుంటే మోహన్ సారు రాసిన కతల వయ్యి మాయల చిప్ప కనవడ్డది. చంటి దాని చేతిల పెట్టిన. నవ్వి కూసుంది. హమ్మయ్య నా ఇకమతు వారింది అనుకున్న. అంతల్నె వయ్యిని అటిటు తిప్పి ‘కతలు జెప్పు. ఇంట్లనే ఉంట’ అన్నది. ఇంక కతలు మొదలుపెట్టిన. సాపల కూర కతలో అవ్వ సాపల ఆసనకు పైసలు అడుగుడు ఇని చిన్నది నవ్వుడే నవ్వుడు. మాయల చిప్ప కత జెప్తుంటే కండ్లు అంత జేసుకుని ఇన్నది. మనకు అసొంటి చిప్ప ఉంటే బాగుండు అనుకుంట ఇంకొక కత జెప్పమంది. అలా చెప్పుకొంట చెప్పుకొంట వయ్యిల కతలన్నీ ఖతం జేసినం. ముందుమాటల జెప్పినట్టు అన్ని కతలు అక్కడిక్కడ ఏరుకొచ్చినవే గానీ పిల్లలు మెచ్చినయి. నమస్తే తెలంగాణ ‘బతుకమ్మ’లో అచ్చినయి. కత అంటే కమ్మగ ఇనెడిది. అసొంటి ఏడు కతలను పేర్సి వయ్యిగ దెచ్చిన మోహన్ సారుకు పిల్లల నాడి మంచిగ ఎరుక! పిల్లలే గాదు పెద్దలు గూడా ఈ ‘మాయల చిప్ప’ను రెండుమార్లు బోర్లిస్తరు.
మాయల చిప్ప (ఇంకొన్ని అక్కడిక్కడి కథలు)
రచన: పత్తిపాక మోహన్
పేజీలు: 22, ధర: రూ. 40
ప్రతులకు : గరిపెల్లి అశోక్
ఫోన్: 98496 49101
భారత దేశంలో రైతు ఉద్యమాలు (1757 2021)
Book
రచన: సారంపల్లి మల్లారెడ్డి, పేజీలు: 95, ధర: రూ. 100
ప్రతులకు: నవతెలంగాణ, ప్రజాశక్తి పుస్తక కేంద్రాలు
ఫోన్: 94900 99378
ఆగ్రహి (కవిత్వం)
Book2
రచన: నీలిమ వి.ఎస్.రావు
పేజీలు: 106
ధర: రూ. 150
ప్రతులకు: పాలపిట్ట బుక్స్
ఫోన్: 98663 34415
ఆకురాలిన చప్పుడు (కవిత్వం)
Book4
రచన: శ్రీవశిష్ఠ సోమేపల్లి
పేజీలు: 128, ధర: రూ. 120, ప్రతులకు:ప్రధాన పుస్తక కేంద్రాలు
ఫోన్: 80747 79202
మందుచూపు (కథకాని కథలు)
Book1
రచన: కె.వి.యస్. వర్మ
పేజీలు: 106, ధర: రూ.125
ప్రతులకు: అనల్ప బుక్ కంపెనీ
ఫోన్: 70938 00303
…? డా. హారిక చెరుకుపల్లి