ఈ రోజుల్లో ఏ పని చేయాలన్నా ల్యాపీ లేదా పీసీ అనివార్యమై పోయింది. అంతేనా.. వాటితోపాటు పలు రకాల మెమరీ కార్డుల్ని కూడా యాక్సెస్ చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే.. డేటా ట్రాన్స్ఫర్ చేయడం అన్నమాట. అలాంటప్పుడు ఆల్ ఇన్ వన్ కార్డు రీడర్ని వాడేస్తే! అలాంటిదే Bestor Card Adapter Portable. మల్టిపుల్ కనెక్టర్లతో ఈ అడాప్టర్‌ని వాడొచ్చు. టైప్-సీ పోర్టుతో మొబైల్‌కి కనెక్ట్ చేయొచ్చు. యూఎస్బీ, మైక్రో యూఎస్బీ కూడా ఉన్నాయి. కెమెరాల్లోని ఫొటోలను కాపీ చేసుకునేందుకు ఎస్డీ కార్డు రీడర్ ఉంది. యూఎస్బీ డ్రైవ్‌లో ఉన్న డేటాని ఫోన్లోకి కాపీ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. విండోస్, మ్యాక్, లినక్స్.. ఏ ఓఎస్తోనైనా దీన్ని వాడుకోవచ్చు. ఎలాంటి డ్రైవర్స్‌ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మరో ప్రత్యేకత ఏంటంటే.. ఎస్డీ, మైక్రో ఎస్డీ కార్డుల్ని ఒకేసారి యాక్సెస్ చేయొచ్చు.
ధర : రూ.559 దొరికేచోటు : https:// tinyurl.com/28czeknf
నథింగే.. కానీ, సమ్‌థింగ్ స్పెషల్
ఏది కొనాలనుకున్నా.. అది ట్రెండింగ్‌లో ఉంటేనే ఆసక్తి చూపించడం మనందరికీ అలవాటైపోయింది. అందుకే మార్కెట్లో ట్రెండింగ్ ఉత్పత్తులు.. హాట్‌హాట్‌గా టెక్నాలజీ ప్రియుల్ని ఊరిస్తున్నాయి. ఇదిగోండి.. ఈ నథింగ్ ఫోన్‌ని చూస్తే.. సమ్‌థింగ్ స్పెషల్ అనాల్సిందే. మోడల్ పేరు Nothing Phone 1. సీఎమ్ఎఫ్ కంపెనీ ఈ ఫోన్‌ని తయారుచేసింది. దీంట్లో స్పెషల్ ఏంటంటే.. వెనకున్న బ్యాక్ కవర్ని నట్లు పీకేసి మీరే మార్చేసుకోవచ్చు. అంతేకాదు.. ఐడీ కార్డులా ఫోన్‌ను మెడలో తగిలించుకునేందుకు అనువుగా ఓ చక్రం కూడా ఉంది. కావాలంటే క్రెడిట్ కార్డుల కోసం ఫోన్ వెనకే ‘కార్డ్ హోల్డర్’ కూడా అమర్చుకోవచ్చు. వీటన్నిటినీ ‘ఫంక్షనల్ యాక్ససరీర్’గా కంపెనీ అందిస్తున్నది. 6.67 అంగుళాల తెర, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 23 గంటల పాటు వీడియోలు చూడొచ్చని కంపెనీ చెబుతున్నది.
ధర : రూ.15,999
దొరికే చోటు : https://tinyurl.com/ 4pvsh6av
స్మార్ట్‌గా శుభ్రత పాటించేయండి
వచ్చేదంతా పండగ సీజన్ కదా. ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సివస్తుంది. ఎంతలా అంటే.. పరుపుల దుమ్ము, సోఫాల్లో ఇరుక్కున్న చెత్త, కిటికీల్లో ఉన్న దుమారం.. ఇలా మూలమూలల్లో దాక్కున్న చెత్తను తొలగించేందుకు ఉద్యమమే చేయాల్సి వస్తుంది. అందుకు టెక్నాలజీ హెల్ఫ్ తీసుకుంటే? యస్.. ఇదిగోండి ఈ AGARO regal vacuum క్లీనర్‌ని ట్రై చేయండి. దీన్ని చాలా సింపుల్‌గా వాడేయొచ్చు. సింగిల్ హ్యాండ్‌తో స్మార్ట్ చీపురుని పట్టుకుని ఇల్లంతా శుభ్రం చేయొచ్చు. ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నట్లయితే.. సోఫాలు, కుర్చీలకు అంటుకున్న వాటి వెంట్రుకలను కూడా ఈ వ్యాక్యూమ్ క్లీనర్ తొలగించేస్తుంది. కిటికీలు, కర్టెన్ల చాటున దాక్కున్న చెత్త, దుమ్మును కూడా లాగిపారేస్తుంది. గదుల్లో ఏ మూలలోనైనా వాడుకునేలా దీన్ని తీర్చిదిద్దారు. 800 వాట్స్ పవర్‌తో ఇది పనిచేస్తుంది. 5 మీటర్ల వైరుతో గది మొత్తాన్నీ కవర్ చేసేయొచ్చు. కంప్యూటర్, కారు, టీవీల్లాంటి వాటినీ క్లీన్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. షెల్ఫ్‌ల్లోని బుక్స్ మీద ఉన్న దుమ్ముని కూడా సులభంగా దులిపేస్తుంది.
ధర : రూ.1,665
దొరికేచోటు : https://tinyurl.com/bdd6uhsf
రాగిని రంగరించుకొని..
గ్యాడ్జెట్ అంటే ట్రెండీగా కనిపించాలి. అప్పుడే నేటితరం కన్ను వాటిపై పడుతుంది. అందుకే డైసన్ కంపెనీ OnTrac హెడ్‌సెట్‌ని రూపొందించింది. అదీ కాపర్ మెటీరియల్‌తో. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే.. హెడ్‌ఫోన్‌లోని కుషన్స్, కప్స్‌ని మీ స్టయిల్‌కి తగ్గట్టుగా మార్చుకునే వీలుంది. అంటే.. మీరు ధరించిన దుస్తులు, యాక్ససరీస్‌కి మ్యాచ్ అయ్యేలా హెడ్‌ఫోన్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అందుకు రంగురంగుల కుషన్స్, అవుటర్ క్యాప్స్‌ని ఎంచుకునే వీలుంది. క్విక్ చార్జింగ్‌తో 10 నిమిషాలు పెడితే చాలు.. 2.5 గంటలపాటు హెడ్‌ఫోన్ పనిచేస్తుంది. 30 నిమిషాలు చార్జ్‌చేస్తే సుమారు 9 గంటలు వాడొచ్చు. ఫుల్ చార్జ్ చేస్తే రెండు రోజులు నిరంతరాయంగా పనిచేస్తుంది. యూఎస్ బీ-సీ పోర్ట్‌తో చార్జ్ చేయొచ్చు.
ధర : రూ.2,198
దొరికేచోటు : https://tinyurl.com/ muer3rht