ధర: రూ.35,999 దొరుకు చోటు: ఫ్లిప్ కార్ట్.కామ్
స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ‘పోకో’ అదిరిపోయే ఫోన్‌ని పరిచయం చేసింది. అదే ఎఫ్7 5జీ (POCO F7 5G). పవర్ఫుల్ ప్రాసెసర్, అధునాతన ఫీచర్లతో దీన్ని ముస్తాబు చేసింది. ముఖ్యంగా గేమ్స్ ఆడేవారికి ఇది చాలా స్పెషల్. మీరు ఎన్ని యాప్స్ ఓపెన్ చేసినా.. భారీ గేమ్స్ ఆడినా.. ఒక్క క్షణం కూడా ఆగకుండా చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. యాప్స్ కూడా మెరుపు వేగంతో ఓపెన్ అవుతాయి. గేమర్ల కోసం ప్రత్యేకంగా వైల్డ్‌బూస్ట్ 4.0 అనే ఫీచర్‌ను ఇచ్చారు. దీంట్లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్-జెన్ 4 ప్రాసెసర్‌ని వాడారు. 3,200 నిట్స్ బ్రైట్నెస్ డిస్ప్లేతో.. మీరు ఎండలో ఉన్నా స్పష్టంగా కనిపిస్తుంది. మూవీలు చూసినా, గేమ్స్ ఆడినా, విజువల్స్ అదిరిపోతాయి. కళ్లను రక్షించడానికి టీయూవీ ట్రిపుల్ సర్టిఫికేషన్, ఎస్జీఎస్ ఐ-కేర్ డిస్ప్లే ఫీచర్లు ఇందులో ప్రత్యేకం. ఐపీ66/68/69 రేటింగ్స్‌తో.. ధూళి, నీటికి తడిసినా తట్టుకునేలా తయారైంది.
50 ఎంపీ సోనీ సెన్సర్ కెమెరా, ఆన్-గ్యాలరీ ఏఐ ఫీచర్లతో అద్భుతమైన ఫొటోలు తీయొచ్చు. 7550 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇచ్చారు. ఇది ఒకసారి చార్జ్ చేస్తే 24 గంటల పాటు వీడియోలు చూడొచ్చు. 60 గంటల పాటు కాల్స్ మాట్లాడుకోవచ్చు. 22.5 వాట్స్ రివర్స్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
ధర: రూ. 65,990 దొరుకు చోటు: ఫ్లిప్‌కార్ట్.కామ్
ల్యాప్‌టాప్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే, అసుస్ తన సరికొత్త వివోబుక్ 14 (Vivobook 14 – X1407QA) ల్యాప్‌టాప్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ ల్యాపీలో అదరగొట్టే ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఏఐ సపోర్ట్. నేటితరం విద్యార్థులు, ఉద్యోగులు, క్రియేటర్లను దృష్టిలో ఉంచుకొని దీన్ని తీసుకొచ్చారు. దీంట్లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్-ఎక్స్ ప్రాసెసర్ వాడారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కోసం ప్రత్యేకంగా హెక్సాగాన్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU) అమర్చారు. దీని డిస్ప్లే పరిమాణం 14-అంగుళాలు. ఆధునాతన టెక్నాలజీతో కంటికి హానికరమైన బ్లూ లైట్‌ను తగ్గించి, కళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా చూస్తుంది. విండోస్-11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్‌లో.. కోపైలట్ సపోర్ట్‌ను బిల్ట్ ఇన్‌గా అందిస్తున్నారు. ర్యామ్ 16 జీబీ. స్టోరేజ్ సామర్థ్యం 512 జీబీ. డేటా భద్రతను మరింత పెంచడానికి మైక్రోసాఫ్ట్ ప్లూటన్ (Microsoft Pluton) సెక్యూరిటీ చిప్‌ను కూడా చేర్చారు. అసుస్ ఎర్గోసెన్స్ డిజైన్‌తో కీబోర్డ్ వస్తుంది. పోర్ట్స్ విషయానికొస్తే.. అన్ని రకాల యూఎస్బీ, హెచ్డీఎంఐ, టైప్-సీ పోర్టులు ఉన్నాయి.
ధర: రూ.9,999 దొరుకు చోటు: అమెజాన్.కామ్
మీరు వ్లాగింగ్స్.. లైవ్ స్ట్రీమింగ్ చేస్తారా? ఫోన్ కెమెరాతో మంచి వీడియోలు తీయాలనుకుంటున్నారా? అయితే, అమెజాన్ బేసిక్స్ నుంచి వచ్చిన సరికొత్త ఫోల్డబుల్ 3-యాక్సిస్ గింబల్ స్టెబిలైజర్ మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఈ గింబల్ మీ ఫొటోలు, వీడియోలలో వచ్చే వణుకు, కదలికలను పూర్తిగా తొలగించి, ప్రొఫెషనల్ క్వాలిటీ ఫుటేజ్‌ను అందిస్తుంది. అడ్వాన్స్డ్ గైరోస్కోప్ టెక్నాలజీతో.. వీడియోలను స్మూత్‌గా తీయడానికి సాయపడుతుంది. వ్లాగర్స్, లైవ్ స్ట్రీమర్స్, కంటెంట్ క్రియేటర్స్‌కు ఈ గింబల్ మంచి చాయిస్. సులభమైన బటన్ కంట్రోల్స్, ఎక్కువ బ్యాటరీ లైఫ్ దీని సొంతం. ఇందులోని ప్రధానమైన ఫీచర్ 3-యాక్సిస్ స్టెబిలైజేషన్. దీంతో షూటింగ్ స్పాట్లో ఎటైనా నడుస్తూ షూట్ చేయొచ్చు. ఏ యాంగిల్ నుండి షూట్ చేసినా.. వీడియో చాలా స్థిరంగా, ప్రొఫెషనల్‌గా వస్తుంది. ఈ గింబల్ 2,500ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఒకసారి చార్జ్ చేస్తే 10 గంటల వరకు పనిచేస్తుంది. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లేలా.. చాలా కాంపాక్ట్‌గా, పోర్టబుల్‌గా ఉంటుంది.
ధర: రూ.5,999 దొరుకు చోటు: అమెజాన్.కామ్
పాటలు వినే అలవాటు ఉందా? ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారా? అయితే, మీ కోసమే సోనీ డబ్ల్యూహెచ్-సీహెచ్520 (WH-CH520) వైర్లెస్ బ్లూటూత్ హెడ్‌ఫోన్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ హెడ్‌ఫోన్స్‌లో ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్.. దీని బ్యాటరీ లైఫ్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 50 గంటల వరకు నిరంతరాయంగా పాటలు వినొచ్చు! అంటే.. మీరు సుదూర ప్రయాణాలు చేసినా, లాంగ్ వీకెండ్లో ఎక్కడికైనా వెళ్లినా, చార్జింగ్ గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన పనిలేదు. అంతేకాదు.. క్విక్ ఛార్జ్ సపోర్ట్ ఉంది. హెడ్‌ఫోన్స్‌ను రోజంతా పెట్టుకున్నా ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. చాలా తేలికగా, సౌకర్యవంతంగా డిజైన్ చేశారు. ఇందులో మైక్రోఫోన్ కూడా ఉంది. ఫోన్‌కాల్స్ మాట్లాడుకునేటప్పుడు అవతలి వారికి మీ వాయిస్ చాలా స్పష్టంగా, క్రిస్టల్ క్లియర్‌గా వినిపిస్తుంది. ఈ హెడ్‌ఫోన్స్‌లో మల్టీపాయింట్ కనెక్టివిటీ ఫీచర్ ఉంది. అంటే, మీరు ఒకేసారి రెండు డివైజ్‌లకు (ఉదాహరణకు ఫోన్, ల్యాప్‌టాప్) వీటిని కనెక్ట్ చేయొచ్చు.