Naya Mall | ఇక ఇంట్లోనే త్రీడీలో దేవుడి మందిరాలు తయారుచేసుకోవచ్చు
Naya Mall | స్మార్ట్ యుగానికి తగినట్టు ప్రతీదీ త్రీడీ సాంకేతికతతో సులువుగా తయారైపోతున్నది. పెద్దపెద్ద ఇండ్లను సైతం గంటల వ్యవధిలో నిర్మించే సామర్థ్యం త్రీ-డైమన్షన్ టెక్నాలజీ సొంతం.
Naya Mall | ఇంట్లోనే త్రీడీ బొమ్మలు..
స్మార్ట్ యుగానికి తగినట్టు ప్రతీదీ త్రీడీ సాంకేతికతతో సులువుగా తయారైపోతున్నది. పెద్దపెద్ద ఇండ్లను సైతం గంటల వ్యవధిలో నిర్మించే సామర్థ్యం త్రీ-డైమన్షన్ టెక్నాలజీ సొంతం. చిన్నచిన్న విగ్రహాలు, బొమ్మలను మనకు నచ్చినట్టుగా ఇంట్లోనే తయారు చేసుకునేందుకు వీలుగా పర్సనల్ త్రీడీ ప్రింటర్‌ను తీసుకొచ్చింది ఆస్టర్ మాక్స్ సంస్థ. ఈ ప్రింటర్‌తో మనకు కావలసిన బొమ్మలను క్షణాల్లో ప్రింట్ తీసుకోవచ్చు. దీని ఆన్లైన్ ధర రూ. 59,999. ఆసక్తి ఉంటే .. worldofilliputs.com క్లిక్ చేయవచ్చు.

రోజ్‌వుడ్ మందిరం
ఇంటిని ఎంత అందంగా తీర్చిదిద్దుకుంటారో ఇంట్లోని పూజా మందిరాన్నీ అంతే అందంగా అలంకరించుకుంటారు అతివలు. టైల్స్, గ్రానైట్, మార్బుల్ వంటి ఎన్ని హంగులు ఉన్నా.. చెక్కతో తీర్చిదిద్దిన మందిరమే చక్కగా ఉంటుంది. లోహపు గంటలు, ఆలయాల విమాన గోపురాలను తలపించే డిజైన్లతో రూపొందించిన చిన్నచిన్న మందిరాకృతులు మార్కెట్లో చాలానే ఉన్నాయి. అయితే, తక్కువ స్థలంలోనే అందంగా దేవుడి మందిరాన్ని అలంకరించుకునేందుకు వీలుగా రోజ్‌వుడ్ ఫ్రేమ్‌లను అందుబాటులోకి తెచ్చింది టెసర్ వరల్డ్ సంస్థ. ఇక్కడ ఇష్టదైవాన్ని ప్రతిష్ఠించి పూజించుకోవచ్చు. ఆన్లైన్ ధర రూ. 39,000. పూర్తి వివరాలకు.. TesorWorld.com.

మరింత స్మార్ట్‌గా..
ప్రస్తుతం స్మార్ట్ వాచీల వినియోగం బాగా పెరిగింది. అందుకే రకరకాల ఫీచర్స్ జోడించి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి తయారీ సంస్థలు. తాజాగా ఆపిల్ సంస్థ విడుదల చేసిన సిరీస్-8 స్మార్ట్ వాచ్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ వాచీ కాలాన్ని సూచించడమే కాదు, శరీర ఉష్ణోగ్రతను పర్యవేక్షిస్తుంది. మహిళల్లో రుతుక్రమం, అండం విడుదల సమయాలను కూడా ఉజ్జాయింపుగా లెక్కిస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగితే దీనిలోని సెన్సర్లు ఎమర్జెన్సీ నంబరుకు సమాచారం ఇస్తాయి. వ్యాయామ సమయాన్ని లెక్కించడం, దూరాలను కొలవడం, క్యాలరీలు లెక్కగట్టడం, గుండె పనితీరు బేరీజు వేయడం, రక్తంలో ఆక్సిజన్ స్థాయిని రికార్డు చేయడం దీని బాధ్యతలే. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 45,900. పూర్తి వివరాలకు apple.com చూడండి.

లడ్డూ సేఫ్!
గుండ్రంగా లడ్డూలు చుట్టడం తేలికేకానీ వాటిని బంధువులు, స్నేహితులకు అదే ఆకృతిలో చేరవేయడం మహాకష్టం. ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేసినా ఒకటికొకటి తగిలి ముక్కలైపోతాయి. అయితే, ఎంతదూరం ప్రయాణించినా లడ్డూలు, చాక్లెట్లు, బిస్కెట్లు తదితర ఆహార పదార్థాలు విరిగిపోకుండా సరికొత్త టిఫిన్ బాక్స్ వచ్చింది. నికోబార్ సంస్థ దీన్ని డిజైన్ చేసింది. చెక్కతో చేసిన ఈ డబ్బాలో లడ్డూలను పేర్చేందుకు వీలుగా చిన్నచిన్న గుంతలున్న అల్యూమినియం ప్లేట్లు ఉంటాయి. వీటి గోల్డ్ ఫినిషింగ్ ఆకట్టుకుంటుంది. ఈ లడ్డూ బాక్స్ ఆన్లైన్ ధర ధర రూ. 7,950. లడ్డూ ప్రియులంతా Nicobar.com చూడవచ్చు.
Read More :
“ఈ సైకిల్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 70 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbols were tampered | ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు..! నిలిచిన పోలింగ్
Hrithik Roshan | మన బంధం ఒక్క సినిమాతో ముగియలేదు.. దర్శకుడు సంజయ్ గుప్తా మృతిపై హృతిక్ ఎమోషనల్!
Road accident | గద్వాలలో కారు బీభత్సం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
SCENE Trailer | ‘సీన్’ ట్రైలర్ వచ్చేసింది.. అంచనాలు పెంచుతున్న సూర్య-నస్లెన్ మైండ్ గేమ్!
Bigg Boss 10 | హౌస్ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ !
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

