వేరబుల్ టెక్నాలజీలో కొత్త ట్రెండ్.. స్మార్ట్ రింగులదే! తాజాగా బెటర్లైఫ్ హారైజాన్స్ కంపెనీ ‘గాబిట్ స్మార్ట్ రింగ్’ ను అందుబాటులోకి తెచ్చింది. ఫిట్నెస్, నిద్ర, స్ట్రెస్, పోషకాహార స్థాయిలను ట్రాక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. స్టయిలిష్ లుక్‌తో వచ్చిన ఈ రింగ్ ధర రూ.13,800. గాబిట్ రింగ్‌ను టైటానియంతో తయారు చేయడంతో ఎక్కువ కాలం మన్నతుంది. 3.1 గ్రాముల బరువుతో అత్యంత తేలికపాటి రింగ్‌ని వేలికి ధరించొచ్చు. 5 ATM వాటర్ రెసిస్టెన్స్‌తో.. స్నానం చేస్తున్నా.. ఈత కొడుతున్నా.. ఎలాంటి భయం లేకుండా ధరించొచ్చు. బ్లాక్ మ్యాటర్, సిల్వర్ మ్యాట్, గ్లోస్సీ రోజ్ గోల్డ్ కలర్ వేరియంట్లలో లభిస్తోంది. ఈ స్మార్ట్ రింగ్ ప్రత్యేకత.. దీని బ్యాటరీ లైఫ్! ఒక్కసారి చార్జ్ చేస్తే 7 రోజులపాటు నిరంతరంగా వాడొచ్చు. రెస్టింగ్ హార్ట్‌రేట్, హార్ట్ రేట్ వేరియబిలిటీ, క్యాలరీల మానిటరింగ్, 15 వర్కౌట్ మోడ్లు.. లాంటి ప్రత్యేక ఫీచర్లను అందిస్తోంది. నిద్రలో డీప్ స్లీప్, లైట్ స్లీప్‌ను విశ్లేషించుకునే వీలుంది. నిద్ర నాణ్యత గురించి వివరంగా సమాచారం అందిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను కూడా ట్రాక్ చేసే సెన్సర్లు ఇందులో ఉన్నాయి.
వివో సబ్‌బ్రాండ్ iQOO తన నూతన ఫ్లాగ్షిప్ Neo 10R ను త్వరలో మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ ఫోన్ గురించి గత నెల నుంచే కంపెనీ ప్రచారం మొదలుపెట్టగా.. తాజాగా ఫస్ట్‌లుక్ కూడా రిలీజ్ చేసింది. అమెజాన్ ప్రొడక్ట్ లిస్టింగ్ ప్రకారం దీని అంచనా ధర రూ.30,000. ఫోన్లలోనే అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్ Snapdragon 8s Gen 3 చిప్సెట్ ఏర్పాటు చేశారు. ఇది కోర్ కాంబినేషన్ Cortex-X4, A720, A520 ప్రాసెసర్లను కలిగి ఉంది. గేమింగ్ పరంగా చూస్తే.. ఇందులో Adreno 735 GPU ఉండడంతో గ్రాఫిక్స్ పెర్ఫార్మెన్స్ మెరుగ్గా ఉంటుంది. ఈ ఫోన్ iQOO Neo 9 కి తర్వాతి వెర్షన్ కాదని కంపెనీ చెబుతున్నా.. దాని లెవల్లోనే ఉన్న మరో హై-ఎండ్ డివైస్‌గా అభివర్ణిస్తున్నారు. iQOO Neo 10R ఫీచర్ల విషయానికి వస్తే.. మరిన్ని ఆసక్తికర విషయాలు అమెజాన్ లిస్టింగ్‌లో ఉన్నాయి. దీని RAM 12GB, స్టోరేజ్ 256GB. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఇంకా వెల్లడించనప్పటికీ.. 2000Hz ‘ఇన్స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్” తో ఆకట్టుకుంటోంది. ఇది గేమింగ్‌కు గొప్ప ప్లస్ పాయింట్. iQOO Ultra Game Mode లో 90FPS గేమింగ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్ ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసం డిజైన్ చేసిన ‘Raging Blue’ వేరియంట్లో లాంచ్ అవుతుంది. నీలం-తెలుపు కలర్ కాంబినేషన్‌తో ప్రత్యేకంగా భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా డిజైన్ చేశామని కంపెనీ చెబుతోంది.
భారత యువతకు ఫేవరెట్ బ్రాండ్‌గా నిలిచిన Fastrack Smart.. తాజాగా మెటాలిక్ ఫినిషింగ్‌తో ‘Metal Series’ స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేసింది. టైటాన్ కంపెనీకి చెందిన Fastrack.. ట్రెండీ వాచీలతోపాటు అత్యాధునిక టెక్నాలజీని మిక్స్ చేస్తూ యువతను ఆకర్షించేలా ఈ కొత్త సిరీస్‌ను ముందుకు తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌వాచ్‌లు హై-గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేశారు. ఫ్రేమ్, మెటాలిక్ స్ట్రాప్.. రెండూ స్టీల్‌తో రూపొందించడం దీంట్లోని ప్రత్యేకత. అత్యధిక నాణ్యతతో తయారైన ఈ ఉత్పత్తులు టెస్టింగ్‌లో విజయవంతంగా నిలిచాయి. Fastrack స్టెయిన్లెస్ స్టీల్ వాచ్‌ల స్పూర్తితో ఈ సిరీస్‌ను రూపొందించామని కంపెనీ చెబుతోంది. హైటెక్ ఫీచర్లు, స్టయిలిష్ లుక్‌తో వచ్చిన వాచ్‌లు SingleSync BT Calling సదుపాయంతో స్మార్ట్‌ఫోన్ చేతిలోకి తీసుకోకుండా కాల్, మెసేజ్‌లను మేనేజ్ చేసుకోవచ్చు. AMOLED Displayతో మెరుగైన UI ఎక్స్పీరియన్స్ దీని సొంతం. హై-రిజల్యూషన్ డిస్ప్లేపై గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి. Fastrack Smartలో ప్రత్యేకంగా రూపొందించిన నెకస్ట్-జెన్ సెన్సర్లు ఉన్నాయి. ఫ్యాషన్‌తోపాటు హైటెక్ ఫీచర్లను జోడించిన ఈ వాచ్.. ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండింగ్ స్టేట్మెంట్గా నిలుస్తోంది. Amazon, Flipkart, fastrack.in వెబ్సైట్ల
ద్వారా ఆన్లైన్లో కూడా కొనుగోలు చేయొచ్చు.
మైక్రోసాఫ్ట్ సంస్థ తన Surface Pro 11, Surface Laptop 7 లను Intel Core Ultra (Series 2) ప్రాసెసర్లతో లాంచ్ చేసింది. ఇప్పటివరకూ ఈ సిరీస్ ల్యాపీలు Qualcomm Snapdragon X వర్షన్లతోనే అందుబాటులో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ Copilot Plus PC ప్లాట్‌ఫామ్‌ను సపోర్ట్ చేసే ఈ ల్యాప్‌టాప్‌లు.. AIఆధారిత ఫీచర్లను కూడా అందించడం విశేషం. ఇక వీటి ప్రత్యేకతల విషయానికొస్తే.. సర్ఫేస్ 11 ల్యాప్‌టాప్ 7.. 13.8/15-అంగుళాల PixelSense Flow డిస్ప్లేతో వస్తున్నది. రిజల్యూషన్ 2304×1536 పిక్సల్స్. 120Hz రిఫ్రెష్ రేట్. Intel Core Ultra 5 (236V, 238V) ప్రాసెసర్‌ని వాడారు. Intel Arc Graphic కార్డు ఉంది. ర్యామ్, స్టోరేజ్ వరుసగా.. 16GB / 32GB.. 256GB / 512GB / 1TB Gen 4 SSD. ల్యాప్‌టాప్‌లను ఒకసారి ఛార్జ్ చేస్తే.. 22 గంటలు పని చేస్తాయి. ఫుల్ హెచ్డీ సర్ఫేస్ స్టూడియో కెమెరా ఉంది. Surface Pro 11 ప్రత్యేకతలు వరుసగా.. 13 అంగుళాల డిస్ప్లే. 2880×1920 రిజల్యూషన్. 120Hz రిఫ్రెష్ రేట్. Intel Core Ultra 5, Ultra 7 ప్రాసెసర్లను వాడారు. ర్యామ్ 16జీబీ, 32జీబీ.. స్టోరేజ్ 256జీబీ, 512జీబీ, 1టీబీ. బ్యాటరీ బ్యాక్అప్ 14 గంటలు.