ఈ ఫోల్డబుల్ సన్‌గ్లాసెస్, కేవలం ఫ్యాషన్ స్టేట్మెంట్ మాత్రమే కాదు. ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరమైనవి. ఈ ప్రత్యేకమైన గ్లాసెస్ UV400 రక్షణతో రూపొందాయి. ఇవి UVA, UVB కిరణాల నుంచి మీ కళ్లను కాపాడతాయి. కొన్ని సార్లు ఎర్రటి ఎండలో ట్రావెల్ చేయాల్సి వస్తే వీటిని వాడొచ్చు. ఫోల్డబుల్ డిజైన్ వీటి ప్రత్యేకత. సులభంగా క్యారీ చేయొచ్చు. బాక్స్‌లోనో, ప్రత్యేక పౌచ్లోనో దాచనక్కర్లేదు. రెండు అద్దాల మధ్య మలిచేసి జేబులో పెట్టేయొచ్చు. ట్రావెల్ చేసేప్పుడు ఇవి బాగా ఉపయోగపడతాయి. పలు రకాల ట్రెండీ రంగుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. నాణ్యమైన మెటీరియల్‌తో తయారు చేశారు. బీచ్‌కి వెళ్లేటప్పుడు, పార్టీలకు హాజరయ్యేటప్పుడు ఇవి రైట్ చాయిస్. ధర: రూ.999 దొరుకు చోటు: https://l1nq.com/g6A6U
కెమెరా, మొబైల్, ల్యాప్‌టాప్… ఇవన్నీ ఒకేచోట చార్జ్ చేయాలంటే గందరగోళంగా ఉంటుంది కదా? ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉంది – RTS డాకింగ్ స్టేషన్. ఇదో చిన్న పరికరం. దీనిలో అన్ని గ్యాడ్జెట్లను ఒకేసారి కనెక్ట్ చేయవచ్చు. ఇది ఒక చార్జింగ్ స్టేషన్లాగా పనిచేస్తుంది. మీ ఫోన్, ట్యాబ్, కెమెరా లాంటి వాటిని ఇందులో ఉంచితే అవి ఆటోమేటిక్‌గా చార్జ్ అవుతాయి. అంతేకాదు.. ఈ డాక్ స్టేషన్‌కి ఉన్న మరో పర్పస్ ఏంటంటే.. యూస్ డీ డ్రైవ్‌లు, కార్డు రీడర్లను ఇన్సర్ట్ చేసుకుని అన్నిటినీ ఒకేసారి ల్యాపీ, పీసీల్లో యాక్సెస్ చేయొచ్చు. అన్నిరకాల ఎస్డీ కార్డులకు విడిగా స్లాట్లు ఉన్నాయి. యూఎస్బీ 2.0 కనెక్టివిటీ వెర్షన్‌తో ఇది పని చేస్తుంది. 480 ఎంబీపీఎస్ స్పీడ్‌తో డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇక మీరు గేమింగ్ ప్రియులైతే… ప్లే స్టేషన్ పరికరాల్ని డాక్ స్టేషన్‌కి కనెక్ట్ చేసుకుని ఆడేయొచ్చు. ఇలా ఏదైనా.. ఎక్స్టర్నల్ గ్యాడ్జెట్లను ల్యాపీ, పీసీలకు అనుసంధానం చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ధర: రూ.999 దొరుకు చోటు: https://l1nq.com/4E9f9
నేటి తరం ఏది చేసినా ట్రెండీగా ఉండాలని కోరుకుంటున్నది. ఇక రోజూ కాలేజీ లేదా ఆఫీస్‌కి తీసుకెళ్లే బ్యాగు విషయంలో ఎలా ఆలోచిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారికి ఈ ‘యాంటీ థెఫ్ట్ లాక్’ బ్యాగ్ ప్రత్యేకం. ఈ బ్యాగుకి తాళం వేయొచ్చు. అంతేకాదు.. ఇందులో ఉన్న యూఎస్బీ పోర్ట్ గ్యాడ్జెట్లను చార్జ్ చేస్తుంది. దీంతో పవర్ బ్యాంక్‌లను జేబులో పెట్టుకొని తిరగాల్సిన బాధ ఉండదు. బ్యాగు లోపలే ఉంచి.. బయట ఉన్న పోర్ట్‌తో సులభంగా చార్జ్ చేయొచ్చు. ల్యాప్‌టాప్, ట్యాబ్, పుస్తకాలు, ఇతర గ్యాడ్జెట్లకు ప్రత్యేక కంపార్ట్మెంట్స్ ఉండటం వల్ల.. వేటికవే పదిలంగా సర్దుకోవచ్చు. ధర: రూ.999 దొరుకు చోటు: https://l1nq.com/xNW2W
క్యాన్‌లోని నీళ్లను గ్లాసులోకి తీసుకోవాలంటే పెద్ద పనే! దాన్ని వంచడం, ఈ క్రమంలో నీళ్లు తొణకడం.. నిత్యకృత్యమే! ఈ ఇబ్బంది లేకుండా నీళ్లను సరాసరి గ్లాసులోకి ఒంపే స్మార్ట్ పరికరం ఏదైనా ఉందా? ఇదిగో ఈ ‘ఆటోమాటిక్ వైర్లెస్ వాటర్ క్యాన్స్ డిస్పెన్సర్’ని వాడొచ్చు. దీన్ని క్యాన్కి బిగించి బటన్ నొక్కితే చాలు.. ట్యాప్‌లో నుంచి వచ్చినట్టుగా వాటర్ గ్లాస్‌లోకి వచ్చిపడుతుంది. ఎలాంటి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఉండదు. క్యాన్ లోపల నీళ్లను బయటికి లాగేందుకు ఒక ప్లాస్టిక్ పైపు.. బయట ట్యాప్ మాదిరిగా నీళ్లు వచ్చేందుకు చిన్న పైప్ డిస్పెన్సర్ అమర్చితే చాలు. పవర్ బటన్ని నొక్కి వాటర్ నింపుకోవడమే. 1200ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ డిస్పెన్సర్ పనిచేస్తుంది. యూఎస్బీ కేబుల్‌తో చార్జ్ చేయొచ్చు. 4 గంటల్లో ఫుల్‌చార్జ్ అవుతుంది. డిజిటల్ ఇండికేటర్ ద్వారా ఎంత చార్జ్ ఉందో తెలుసుకోవచ్చు. ప్రయాణాల్లోగానీ.. ఆఫీస్‌లో గానీ ఈ డిస్పెన్సర్ బాగా ఉపయోగపడుతుంది.