పెండ్లికి పందిరేస్తాం. పండక్కి మామిడి తోరణాలు కడతాం.మరి, ప్రేమికుల రోజున? అలంకరణ ఎలా ఉండాలి? గోడలను ఎలా ముస్తాబు చేయాలి? వాకిలిని ఎలా సింగారించాలి? అతిథులను ఎలా ఉక్కిరిబిక్కిరి చేయాలి? ప్రేమ పరీక్షలో గెలిచి ఓ ఇంటివారైన దంపతుల కోసం..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ప్రేమికుల రోజుకు ఒక్కరోజే సమయం ఉంది. ఆలూమగలైన సీనియర్ ప్రేమికులైతే ఫిబ్రవరి 14ను మరింత ఘనంగా జరుపుకోవాలని తహతహలాడుతున్నారు. అందుకు తగ్గట్లు ముందస్తు ఏర్పాట్లూ చేసుకుంటున్నారు. దీనికోసం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పన్లేదు. తక్కువ వ్యయంతోనే ఇంటిని ప్రేమాలయంగా రూపుదిద్దుకోవచ్చు.