జగమంతా..ప్రేమమయం!
ప్రేమలేని చోటు లేదు. ప్రేమ పుట్టని మనిషి లేడు. ఆ ప్రేమను ప్రేమారా కీర్తించడానికి ప్రత్యేకించిన రోజు.. ఫిబ్రవరి 14. ప్రేమికుల రోజున.. ఒకరిద్దరు కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ప్రేమైకజీవులు ప్రణయ సాగరంలో మునిగితేలుతారు. ఆ సన్నాహాలు వారం రోజుల ముందునుంచే మొదలవుతాయి. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం, అప్పటివరకూ మనసులో దాచుకున్న భావనను వ్యక్తపరచడం అందరూ చేసేపని. కానీ కొన్ని ప్రాంతాల్లో ఆసక్తికరమైన ఆచారాలూ ఉన్నాయి.
రారండోయ్..

ఫిలిప్పీన్స్‌లో ప్రతి ఏడాదీ ప్రేమికుల రోజున సామూహిక ప్రేమ వివాహాలు జరుగుతాయి. ఈ వేడుకను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుంది. ఆ సంబరం చూసేందుకు ప్రపంచ పర్యాటకులంతా అక్కడికి చేరుకుంటారు. పెండ్లి తర్వాత విందు భోజనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ వేదిక మీద వివాహాన్ని శుభ సూచకంగా భావిస్తారు. అందరూ ఆహ్వానితులే!
ప్రేమ మిఠాయి

స్పెయిన్‌లో వాలెంటైన్స్‌డేను ఇష్టమైన వాళ్లతో జరుపుకొంటారు. అయితే వాలెన్షియా అనే ప్రాంతంలో మాత్రం ప్రేమికుల రోజును ఫిబ్రవరిలో కాకుండా అక్టోబర్ 9న నిర్వహిస్తారు. ఆరోజు అబ్బాయిలు తమ స్వహస్తాలతో తయారు చేసిన మార్జిపన్ (బాదం పిండి, చక్కెరతో బొమ్మల ఆకారంలో చేసే) మిఠాయిలను ప్రేయసికి బహుమతిగా ఇస్తారు. ఒంటికి రంగులు పూసుకుని పరేడ్ చేస్తూ.. నచ్చిన వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు.
చాక్లెట్ల పండుగ

జపాన్‌లో ప్రేమికుల రోజున చాక్లెట్లదే సందడి. అమ్మాయిలు తాము ప్రేమించిన అబ్బాయిలకు చాక్లెట్లను బహుమతిగా ఇస్తారు. కొందరు ఇంట్లోనే రకరకాల చాక్లెట్లు చేయడమూ సంప్రదాయమే. ప్రేమికుల రోజు వస్తున్నదంటే జపాన్ దుకాణాలన్నీ చాక్లెట్ స్టాల్స్‌తో నిండిపోతాయి.
వెండి నగలతో

చైనాలోని మియో ప్రాంతంలో మార్చి 15న వాలెంటైన్స్‌డేను పోలిన ప్రత్యేక వేడుక జరుగుతుంది. కొన్నిరోజుల ముందే అడవికెళ్లి వివిధ రకాల ఆకులు, పువ్వులు తీసుకొచ్చి రంగులు తయారు చేసుకుంటారు. వాటితో పులగంలాంటి తీపి వంటకం వండి బట్టలో కడతారు. నచ్చిన అబ్బాయి లేదా అమ్మాయికి దాన్ని తినిపించడం ఆనవాయితీ. ఆ రోజున కన్యామణులు వెండి ఆభరణాలు ధరించి అందంగా తయారు అవుతారు.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

