నా ప్రజలు గొప్పగా బతకాలి
ఇది చాలా తక్కువ మందికి దొరికే అవకాశం. నా కండ్లల్లో ఆనంద బాష్పాలు వస్తా ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన ఘట్టం. ప్రజలు ఎక్కడికక్కడ ఆనందంతో పండుగలు చేసుకోవాలి. గొప్పగా బతకాలి. ‘బతికితే తెలంగాణకు పోయి బతకాలిరా..’ అని పక్క రాష్ట్రమోళ్లు అనుకొని ఈర్ష్య పడే పరిస్థితి రావాలి.
ఇది చాలా తక్కువ మందికి దొరికే అవకాశం. నా కండ్లల్లో ఆనంద బాష్పాలు వస్తా ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన ఘట్టం. ప్రజలు ఎక్కడికక్కడ ఆనందంతో పండుగలు చేసుకోవాలి. గొప్పగా బతకాలి. ‘బతికితే తెలంగాణకు పోయి బతకాలిరా..’ అని పక్క రాష్ట్రమోళ్లు అనుకొని ఈర్ష్య పడే పరిస్థితి రావాలి. అటువంటి తెలంగాణ కోసం జీవితం ఉన్నంత వరకు కృషి చేస్తాను. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. బంగారు తెలంగాణ కావాలి. అందరూ సంతోషంగా బతుకాలి. పాత ప్యూడల్ విధానం పోవాలె. కొందరు మాత్రమే పెత్తనం చెలాయించే విధానం పోవాలె. ప్రజల గడప దగ్గరకు పరిపాలన రావాలని కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నం. సిద్దిపేట జిల్లా కావాలన్న ఆకాంక్ష ఇప్పటిది కాదు. 33 ఏండ్ల కిందట 1983లో ఆనాటి సీఎం ఎన్టీఆర్ ఇదే రోడ్డు మీదుగా కరీంనగర్ వెళ్లే సమయంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర వారిని ఆపడం జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయించి సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ అందుకు సంబంధించిన మ్యాప్ జతచేసి దరఖాస్తును ఎన్టీఆర్‌కు ఇవ్వడం జరిగింది. కానీ జిల్లా ఏర్పాటు కాలే.
ఇవాళ ఒక పెద్ద అదృష్టం. జీవితంలో అతి తక్కువ మందికి లభించే అరుదైన అవకాశం. నేను మీ కాళ్లల్లో చేతుల్లో పెరిగిన, మీరు పెంచిన బిడ్డను. సిద్దిపేట పట్టణం కావొచ్చు.. నియోజకవర్గం కావొచ్చు.. నేను నిదురించని గ్రామం లేదు.. తిరుగని సందు లేదు. ఈ రోజు మీ దయ.. మీ దీవెనలతో నన్ను పంపించినారు.. ‘సిద్దిపేటకు చేసిన కాడికి చేసినావు.. తెలంగాణ కోసం కొట్లాడు పో’ అని పంపిస్తే మొత్తం తెలంగాణ విముక్తి చేయించడానికి మీ ఆజ్ఞతో పోయినాను. తెలంగాణ తీసుకొని వచ్చిన. ఆ గౌరవం ఏనాటికైనా మన సిద్దిపేట గడ్డకే దక్కుతుంది. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. నేను ఎక్కడ ఉన్న.. ఏం చేసిన.. సిద్దిపేట సిద్దిపేటే!
మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే.. బతికున్నంతవరకు అద్భుతమైన పనిచేస్తా. మీ బిడ్డగా మీ ఆశీర్వచనం ఇవ్వండి. ముందుకు పోత తప్ప వెనుకకు తిరిగి చూడను.
– 2016 అక్టోబర్ 11న సిద్దిపేట జిల్లా ప్రారంభోత్సవ సభలో కేసీఆర్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

