ఫుట్‌బాల్ గ్రౌండ్!పిల్లలు ఇంట్లో ఉంటే చాలు.. బయట ఆడుకోవడానికి పంపమని ఒకటే గోల. కానీ, బయట ఎండగా ఉన్నా, వర్షం పడుతున్నా వారిని ఆడనివ్వలేం. అలాగని ఇంట్లో ఫుట్‌బాల్ లాంటి ఆటలు ఆడితే కిటికీ అద్దాలు పగిలిపోతాయేమో.. సామాన్లు కింద పడతాయేమో అనే భయం. ఇలాంటి టెన్షన్లు లేకుండా పిల్లలను ఇంట్లోనే ఆడిస్తూ.. మనం కూడా వారితో కలిసి ఎంజాయ్ చేసేలా Mirana Air Football Smart వచ్చేసింది. ఇది సాధారణ ఫుట్బాల్లాగా గాలిలో ఎగరదు, నేల మీద కొద్దిగా గాలిలో తేలుతూ అద్భుతంగా ప్రయాణిస్తుంది. దీనికి చుట్టూ మెత్తని ఫోమ్ అంచులు ఉంటాయి. దీంతో గోడలకు తగిలినా, ఇంట్లోని ఫర్నిచర్‌ను ఢీకొట్టినా ఎలాంటి డ్యామేజ్ ఉండదు. శబ్దం కూడా రాదు. హాయిగా లివింగ్ రూమ్‌లోనే చిన్నపాటి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడేయొచ్చు. ఈ స్మార్ట్ ఫుట్‌బాల్‌ను యూఎస్బీ-సితో రీచార్జ్ చేసుకోవచ్చు. ఆఫీస్ పని ఒత్తిడిలో ఉన్న పెద్దలకు కూడా స్ట్రెస్ బస్టర్లా పనిచేస్తుంది. కిక్ ఇవ్వగానే నేల మీద తేలుతూ వెళ్తుంటే.. ఆ ఫీలింగే వేరు.
గ్యాడ్జెట్లన్నీఒకేచోట!

ప్రయాణాలకు వెళ్లేటప్పుడు ఫోన్ చార్జర్ ఒక చోట, ఇయర్ఫోన్లు మరో చోట, పవర్ బ్యాంక్ ఇంకో చోట.. ఇలా బ్యాగులో అన్నీ వెతుక్కోవడానికే సగం సమయం సరిపోతుంది. ఒక్కోసారి కేబుల్స్ అన్నీ ఒకదానికొకటి మెలికలు పడిపోయి చిరాకు తెప్పిస్తుంటాయి. ఇలాంటి గందరగోళానికి చెక్ పెట్టి, మీ ఎలక్ట్రానిక్ వస్తువులన్నిటినీ క్రమపద్ధతిలో సర్దుకోవడానికి House of Quirk వారి ఈ ఎలక్ట్రానిక్స్ ఆర్గనైజర్ బ్యాగ్ భలేగా ఉపయోగపడుతుంది. ఇది చూడటానికి చిన్న బ్యాగులా ఉన్నా, లోపల మాత్రం బోలెడంత చోటు ఉంటుంది. మల్టీ-లేయర్ డిజైన్‌తో ట్యాబ్లెట్, చార్జర్లు, హార్డ్ డిస్క్‌లను విడివిడిగా భద్రపరుచుకోవచ్చు. ముఖ్యంగా ఇందులోని 10 ఎలాస్టిక్ బకిల్స్ వల్ల కేబుల్స్ అన్నీ నీట్‌గా ఉంటాయి. ప్రయాణాల్లో బ్యాగులు అటు ఇటు కదులుతున్నప్పుడు లోపల ఉన్న గ్యాడ్జెట్లు పాడవుతాయేమో అనే భయం అక్కర్లేదు. ఎందుకంటే ఇది షాక్ప్రూఫ్ మెటీరియల్‌తో తయారైంది. అంతేకాదు, దీనికి వాడిన డ్యూయల్ లేయర్ వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ వల్ల అనుకోకుండా నీళ్లు పడినా లోపల ఉన్న వస్తువులు తడవవు.
వస్తువులపై మీ పేరు!

మన ఇంట్లో వస్తువులు తప్పిపోయినా.. ఆఫీసులో పెన్నులు, బాక్సులు ఎవరైనా మార్చేసినా గుర్తించడం కొంచెం కష్టమే! సాధారణంగా మార్కర్లతో రాస్తే కొన్నాళ్లకు చెరిగిపోతుంటాయి. అలా కాకుండా స్టీలు గిన్నెలు, గాజు గ్లాసులు, చెక్క వస్తువులపై మీ పేరును శాశ్వతంగా చెక్కేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ FreshDcart ఎలక్ట్రిక్ ఎన్గ్రేవింగ్ పెన్ మీ కోసమే. ఇది చూడటానికి మామూలు పెన్నులాగే ఉంటుంది. కానీ, దీని పనితనం మాత్రం భేష్. స్టీలు, గ్లాసు, జ్యువెలరీ, చెక్క, ప్లాస్టిక్.. ఇలా ఏ వస్తువు మీదైనా సులభంగా అక్షరాలను, డిజైన్లను చెక్కవచ్చు. ఇది బ్యాటరీలతో పనిచేస్తుంది. కాబట్టి వైర్ల గందరగోళం ఉండదు. తేలికైన డిజైన్ వల్ల పట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వస్తువులన్నిటిపైనా మీ సంతకాన్ని తేలికగానే ముద్రించేయొచ్చు. ఇందులో కార్బైడ్ టిప్ వాడటం వల్ల గట్టి వస్తువుల మీద కూడా చాలా క్లియర్‌గా రాతలు వస్తాయి. ఒకవేళ నిబ్ అరిగిపోతే.. మార్చుకోవడానికి అదనంగా మరోటి కూడా ఇస్తున్నారు. గృహోపకరణాలను గుర్తు పెట్టుకోవడానికే కాదు, క్రాఫ్ట్‌వర్క్ చేసేవారికి, బహుమతులపై పేర్లు రాయడానికి ఇది ఒక చక్కని గ్యాడ్జెట్.
మ్యాజిక్ పెన్ ఉండాల్సిందే!

ఆఫీసుల్లో మీటింగ్స్ ఇస్తున్నప్పుడు, క్లాస్ రూమ్‌లో పాఠాలు చెబుతున్నప్పుడు ఏదైనా ముఖ్యమైన పాయింట్‌ను బోర్డు మీద చూపించాలంటే? చేతితో చూపడం కొంచెం పాత పద్ధతిలా అనిపిస్తుంది. అలాంటప్పుడు స్టిక్, లేజర్ పాయింటర్ కోసం వెతకాల్సిన పని లేదు. జేబులో ఉండే పెన్నుతోనే ఇవన్నీ చేసేయొచ్చు. అదే ఈ DFS 5-ఇన్-1 మల్టీపర్పస్ యాంటెన్నా పెన్. ఇది చూడటానికి స్టయిలిష్ పెన్నులాగే ఉన్నా.. లోపల ఐదు రకాల ఉపయోగాలు ఉన్నాయి. ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు దీన్ని రేడియో యాంటెన్నాలా పొడవుగా సాగదీసి, బోర్డు మీద ఉన్న విషయాలను స్పష్టంగా చూపించవచ్చు. మరీ దూరం నుంచి చూపించాలంటే ఇందులో ఉన్న లేజర్ లైట్ టెక్నాలజీ భలేగా పనిచేస్తుంది. చీకటిలో వాడుకునేలా చిన్న టార్చ్‌లైట్ కూడా ఇందులో ఉంది. ఇవన్నీ ఒకెత్తు అయితే.. దీని అడుగు భాగంలో ఉండే అయస్కాంతం మరో ఎత్తు. రోజువారీ అవసరాలకు సాధారణ పెన్నులా వాడుకోవచ్చు. టీచర్లు, ట్రైనర్లు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లకు ఇదొక అద్భుతమైన టూల్. ప్రీమియం లుక్‌తో, చక్కని గిఫ్ట్ బాక్స్‌లో వస్తుంది కాబట్టి.. ఎవరికైనా బహుమతిగా కూడా ఇవ్వొచ్చు.