రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా నుంచి వస్తున్న అప్డేట్లు ఆ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచుతున్నాయి. తాజాగా ఈ సినిమా యాక్షన్ కొరియోగ్రాఫర్ మైబం నబకాంత మైతీ తన సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ని అందించారు. ‘పెద్ది’లో ఒక్కో యాక్షన్ సీక్వెన్స్ అగ్ని తుపాన్ని తలపిస్తాయని, ఇందులో యాక్షన్ విజువల్స్ థియేటర్లలో ప్రకంపనాలు సృష్టిస్తాయని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు మైబామ్ నబాకాంత.
ప్రస్తుతం ఈ పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతున్నది. ‘పెద్ది’ క్రీడా నేపథ్యంతో కూడిన సినిమా కావడంతో ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలువనున్నాయని తెలుస్తున్నది. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని మార్చి 27న విడుదల చేయాలని మేకర్స్ తొలుత భావించారు.
అయితే.. కొన్ని కారణాల దృష్ట్యా ఈ సినిమా విడుదలను మే నెలకి వాయిదా వేసినట్టు వార్తలొస్తున్నాయి. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జగపతిబాబు, దివ్యేందుశర్మ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, నిర్మాత: వెంకటసతీశ్ కిలారు, దర్శకత్వం: బుచ్చిబాబు సానా.