youngest bike rider | అయిదేండ్ల వయసు పిల్లలు మహా అయితే.. నాన్నను చుట్టేసుకుని కూర్చుని బండి మీద షికార్లు చేస్తారు. కానీ, ఏకంగా బైక్ మీద రయ్‌మని దూసుకెళ్తూ రికార్డు సృష్టిస్తున్నాడు హైదరాబాద్‌కు చెందిన ఓం అద్వైత్. దేశంలోనే ‘యంగెస్ట్ బైక్ రైడర్’ అయిన ఈ చిచ్చర పిడుగు గురించి..
చిన్నపిల్లలు కార్లు, బైకుల బొమ్మలంటే ఇష్టపడతారు. కానీ అమీన్‌పూర్‌కు చెందిన అద్వైత్కు మాత్రం నిజమైన బైక్‌మీద దూసుకెళ్లడం అంటే ఇష్టం. కొడుకు ఆసక్తిని గమనించిన తండ్రి రాహుల్, మూడు లక్షలు పెట్టి బుల్లి బండి కొనిచ్చాడు. డ్రైవింగ్‌లో శిక్షణ కూడా ఇచ్చాడు. ఇంకేముంది! గంటకు 80, 90 కిలోమీటర్ల వేగంతో దుమ్మురేపుతున్నాడు అద్వైత్. కొడుకును బైక్ రైడింగ్, రేసింగ్ పోటీలకు సిద్ధం చేస్తూనే.. ‘రేస్ విత్ లిటిల్ ఓం’ అనే యూ ట్యూబ్ చానల్‌ను నడుపుతున్నాడు రాహుల్. తన కొడుకు విన్యాసాలతోపాటు మిగతా పిల్లల బైక్‌లు, కార్లపై రివ్యూలనూ అప్లోడ్ చేస్తున్నాడు. ఇండియాలోనే ‘యంగెస్ట్ రైడర్’గా పేరు సాధించిన ఈ బుల్లి రేసర్ త్వరలోనే వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకోవడానికి సిద్ధం అవుతున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
children crying | పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్లు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?
Infant crying | చిన్న పిల్లలు ఎందుకు ఏడుస్తారు?
షాకింగ్ న్యూస్ ! ఇతరులకు సాయం చేస్తే గుండెజబ్బులు రావు