‘ఓ భామ అయ్యో రామ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మలయాళ బ్యూటీ మాళవికా మనోజ్. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తమిళం, మలయాళంతోపాటు తెలుగులోనూ వరుస అవకాశాలు ఈ కేరళ కుట్టిని పలకరిస్తున్నాయి. సింపుల్‌గా ఉండటమే తనకు ఇష్టం అంటున్న మాళవిక పంచుకున్న కబుర్లు..
‘నాయాది’, ‘ఆన్ పావం పొల్లాతతు’ సినిమాలు నాకు విభిన్నమైన అనుభవాలు ఇచ్చాయి. ‘నాయాది’ ఒక థ్రిల్లర్. ఇందులో నా పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. ‘ఆన్ పావం పొల్లాతతు’లో మాత్రం కామెడీ ఎలిమెంట్స్‌తో కూడిన పాత్ర చేశాను. ఈ రెండూ నా నటనలోని రెండు భిన్న కోణాల్ని నాకు తెలియజేశాయి.
2012 లో ‘ప్రకాశన్ పరక్కట్టే’ సినిమాతో తమిళ సినిమా రంగంలో అడుగుపెట్టాను. మొదట్లో కొంత ఒత్తిడికి గురయ్యాను, కానీ దర్శకుడు, తోటి నటీనటులు చాలా సహకరించారు. ఆ సినిమాతోనే చాలా విషయాలు నేర్చుకున్నా. మొదటి సినిమాతోనే చాలా అనుభవం గడించిన అనుభూతి కలిగింది.
ద క్షిణాది సినిమా రంగం చాలా డైనమిక్‌గా ఉంటుంది. ఇక్కడి కథలు, పాత్రలు, ప్రేక్షకుల అభిరుచులు చాలా వైవిధ్యంగా ఉంటాయి. అంతేకాదు ప్రస్తుతం సినిమా రంగంలో మహిళలు శక్తిమంతమైన పాత్రలు
పోషిస్తున్నారు. కథానాయికలకు కేవలం గ్లామర్ పాత్రలు కాకుండా, బలమైన, స్వతంత్రమైన
పాత్రలు రాస్తున్నారు. ఇది చాలా
సానుకూల మార్పు.నే
ను పుట్టింది కేరళలో. పెరిగింది సౌదీలో. నా బాల్యం చాలా ఆనందంగా గడిచింది. మలయాళీ సంప్రదాయ కుటుంబం కావడంతో విలువలతో కూడిన పెంపకంలో పెరిగాను. అమ్మానాన్న స్వేచ్ఛ ఇచ్చేవారు. అదే సమయంలో క్రమశిక్షణ ముఖ్యమని చెబుతుండేవారు. చిన్నప్పటినుంచి నాకు నటనపై ఆసక్తి ఎక్కువ. శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నాను.సి
నిమాను ఎంచుకునే విషయంలో కథ, నా పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం ఉందన్న విషయాలు గమనిస్తాను. రెండూ నచ్చితేనే సినిమాకు ఓకే చెబుతాను. వైవిధ్యమైన పాత్రలు చేయాలని ఉంది. నేనెంచుకున్న పాత్రను నిజాయతీగా పోషించడమే నా లక్ష్యంగా భావిస్తాను. నాకున్న నృత్య నేపథ్యం నటనకు చాలా ప్లస్ అయింది. భావోద్వేగాలు సహజంగా పలుకుతాయి.
జోసినిమానా కెరీర్లో ఒక మైలురాయి. అది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ, అందులో నా పాత్ర చాలా లోతైనది.
ఆ సినిమా నాకు అభిమానుల మనసులను గెలుచుకునే అవకాశం ఇచ్చింది. దాంతో నాకు సౌత్ ఇండియాలో భారీ ఫాలోయింగ్ వచ్చింది. సినిమా అవకాశాలు కూడా పెరిగాయి.దీ
పికా పదుకొణె, అనుష్క శర్మ నటన అంటే ఇష్టం. వారు సినిమాలు ఎంచుకునే విధానం, వారి నటనలో వైవిధ్యం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సింపుల్‌గా ఉండేందుకు ఇష్టపడతాను. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, కుటుంబంతో సమయం గడపడం ఇష్టం. నా వ్యక్తిగత జీవితాన్ని సినిమా జీవితంతో బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నా.