1. శిల్పులు అంటే పురుష కళాకారులే గుర్తుకువస్తారు. అయితే, జనవరి 25న ఓ ప్రసిద్ధ శిల్పకారిణి మరణించారు. ఆమె పేరేంటి?
2.2024 అక్టోబర్ 2న గోవా నుంచి ఐఎన్ఎస్వీ తారిణి నౌకలో లెఫ్టినెంట్ కమాండర్లు దిల్నా, రూప సముద్ర పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో జనవరి 30న సముద్రంలో అత్యంత సాహసంగా భావించే ఓ ప్రదేశాన్ని వీళ్లు అధిగమించారు. అది ఏది?
3.దక్షిణ అర్ధగోళంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఫిబ్రవరి 2న ప్రారంభమైంది. స్వామి నారాయణ్ సంస్థ నిర్మించిన ఈ ఆలయం ఎక్కడ ఉంది?
4.డిజిటల్ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ సీఈవో ఇటీవల రాజీనామా చేశారు. ఆయన ఎవరు?
5.అమెరికాలో ఉంటున్న భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నీహార్ సచ్‌దేవా గుండుతో తన మిత్రుణ్ని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు. జుట్టు రాలిపోయే రుగ్మతతో బాధపడుతున్న కారణంగా ఆమె ఇలా చేశారు. ఆ రుగ్మత పేరేంటి?
6.ఫిబ్రవరి 3న అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో 67వ గ్రామీ అవార్డులు ప్రకటించారు. ఈ పురస్కారాలు గెలుచుకున్న వారిలో భారతీయ అమెరికన్ గాయని చంద్రికా టాండన్ కూడా ఉన్నారు. ఏ ఆల్బమ్‌కు ఈ గౌరవం దక్కింది?
7.యాక్జియం స్పేస్ నాలుగో మిషన్ ద్వారా భారతదేశానికి చెందిన వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ ఒకరు త్వరలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లనున్నాడు. ఈ ఘనత సాధించే తొలి భారతీయుడిగా వార్తల్లో నిలిచిన ఆ పైలట్ ఎవరు?
8.మలేషియాలో మహిళల అండర్ 19 టీ20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు జరిగాయి. ఇందులో భారత అమ్మాయిల జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఏ జట్టును ఓడించింది? ఈ మెగా టోర్నీలో ఎక్కువ పరుగులు ఎవరు చేశారు?
9.1950 నాటి మద్రాస్ (చెన్నై) నేపథ్యంలో ఆనాటి మానవ సంబంధాలు, సామాజిక పరిస్థితులు, సంక్లిష్టతలకు అద్దం పడుతూ దుల్కర్ సల్మాన్ కథా నాయకుడుగా నటిస్తున్న చిత్రం ఏది?
10.భారతదేశంలో ప్రసిద్ధిచెందిన పశుజాతుల్లో ఒంగోలు రకం ఒకటి. ఇటీవల ఓ దేశంలో జరిగిన వేలంలో ఒంగోలు ఆవు రూ. 40 కోట్లకు పైగా ధర పలికి వార్తల్లో నిలిచింది. ఈ వేలం ఏ దేశంలో జరిగింది?
జవాబులు