ఇండియన్ స్టైల్లో పిజ్జాలు, బర్గర్లు.. రూట్ మార్చిన రెస్టారెంట్లు
వంట గ్లోబల్, రుచి లోకల్. వెరసి.. గ్లోకల్! దేశీ రెస్టారెంట్లలోనూ విదేశీ రుచుల సంఖ్య పెరిగిపోతున్నది. చైనీస్, జపనీస్, ఇటాలియన్, ఫ్రెంచ్, థాయ్ విందుల పట్ల దేశీ భోజనప్రియులు మొగ్గు చూపుతున్నారు. దీంతో విదేశీ వంటకాల్లోనూ మన రుచులను రంగరించి అందిస్తున్నాయి పలు రెస్టారెంట్లు.

విదేశాల్లోనే కాదు మనదేశంలోనూ పిజ్జా, బర్గర్లు తినేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అందుకే భారతీయుల రుచికి తగినట్టు కాస్త కారం, ఘాటు పెంచుతున్నాయి రెస్టారెంట్లు. మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీ, సబ్వే వంటి విదేశీ మూలాలున్న రెస్టారెంట్లు సైతం దేశీ ఫ్లేవర్లతో కూడిన ప్రత్యేక పిజ్జాలు, బర్గర్లు అందిస్తున్నాయి.

వీటిలోనూ వెజ్, నాన్వెజ్ వెరైటీలతోపాటు విదేశాల్లో వాడే హామ్, బేకన్లకు బదులుగా చికెన్ టాపింగ్స్, చికెన్ టిక్కీలతో వడ్డిస్తున్నారు. చీజ్, కార్న్, క్యాప్సికమ్ టాపింగ్తో వచ్చే మామూలు పిజ్జాలు కాకుండా రొట్టె నిండా చీజ్, పనీర్, కూరగాయ ముక్కలు కూరిన పరోటా పిజ్జాలు కూడా వచ్చేశాయి. వీటికి ఆరిగానో, మయొనీజ్ వంటి విదేశీ రుచులకు బదులుగా మనదేశంలో లభించే సంప్రదాయ మసాలాలను జోడించి అందిస్తున్నారు.

స్టాక్బక్స్ ఫ్లేవర్ టీ, బాదమ్ ఠండాయ్ వంటి పానీయాల్లో.. కుంకుమ పువ్వు, బాదం వంటి స్థానిక ఫ్లేవర్లతో ఆకట్టుకుంటున్నారు. విదేశీ వంటకాలైతేనేం, మన రుచులతో కలిసి మరింత కమ్మగా తయారు కావడంతో లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు నగరవాసులు.

Read More :
“ఇలా మామిడి పండ్ల రుచిని ఏడాదంతా ఎప్పుడైనా ఆస్వాదించొచ్చు !”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Food
- KFC
- pizza
- Restaurant
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

