– బి. అశోక్, మెదక్.
ఇంటికి తప్పకుండా సెప్టిక్ ట్యాంక్ అవసరం అవుతుంది. దానిని ఉత్తరం మధ్యలో లేదా తూర్పు మధ్యలో ఏర్పాటు చేసుకోవాలి. దానికి కేవలం టాయిలెట్స్.. అంటే లెట్రిన్ పిట్ లైను కలపాలి. ఇక ఇంట్లో వాడుక నీరు ఉంటుంది. అలాగే వర్షం నీరు కూడా ఉంటుంది. దానిని సపరేటుగా ఒక లైన్‌తో కూడా తీసుకొని పోవచ్చు. బోరుకు దగ్గరగా, ఈశాన్యంలో ఒక ఇంకుడుగుంతను ఏర్పాటు చేసుకొని.. ఈ వాడుక, వర్షం నీరు అందులోకి వెళ్లేలా ఒక లైన్ ఇవ్వాలి. అది, భూగర్భజలం పెరిగేందుకు ఉపయోగపడుతుంది. బోరుకు నీరు అందిస్తూ.. అది ఎండిపోకుండా చేస్తుంది. ఇంకుడుగుంతను ఇసుక – కంకర – ఒక్కో లేయర్ వేస్తూ.. తెలుసుకొని ఏర్పాటు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
– సీహెచ్ రామస్వామి, భువనగిరి.
తూర్పు – పడమర పొడవుగా ఉన్న స్థలాన్ని పంచుకునేటప్పుడు సహజంగానే పెద్దవాళ్లు పడమరలో ఉండాలి అని, పడమర భాగం పెద్దవాళ్లకు, తూర్పు భాగం చిన్నవాళ్లకు ఇస్తుంటారు. కానీ, ఆ ఇద్దరిలో ప్రధానమైన వీధి చిన్నవాళ్లకు రాకుండా పోతుంది. అలాగని ఇద్దరూ గొప్పగా ఉండే అవకాశం ఉండదు. చిన్నవారు నష్టపోతారు. అలాకాకుండా.. దక్షిణం – ఉత్తరంగా రెండు భాగాలు చేసినట్లయితే, దక్షిణంలో పెద్దవారు, ఉత్తరంలో చిన్నవారు ఉండవచ్చు.
తద్వారా ఇద్దరికీ ఆ వీధి లభిస్తుంది. స్థలం పంచుకోవడానికి అనుకూలంగా ఉంటే.. అలాగే చెయ్యాలి. అందులో షాపులు కూడా ఏర్పాటుచేసుకోవచ్చు. గృహానికి స్థలం అనుకూలం కానప్పుడు, వ్యాపారానికి ఉపయోగపడుతుంది. లేదా ఆ స్థలాన్ని మొత్తం ఒక్కరే తీసుకొని, మిగతావారికి డబ్బుల రూపేణా న్యాయం చేయవచ్చు. కానీ, లోపలికి ఇల్లు కడితే.. అది గొప్పగా యోగించదు.
– ఎస్. కుమారస్వామి, మోత్కూర్.
ముందుగా స్థలం సరిచేసుకోవడం చాలా అవసరం. ఒక సమచతుర్భుజ స్థలంలో లేదా నాలుగు మూలలు ఉండి, దీర్ఘచతురస్రంగా ఉన్న భూమిలో చేసే వెంచర్లు.. చాలా సునాయాసంగా ముగుస్తాయి. అందుకు స్థలం ప్రాధాన్యత వహిస్తుంది. మీరు ఈశాన్యం రావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయండి. రాని పక్షంలో పడమర భాగం తూర్పు భాగంగా స్థలాన్ని రేకులతో వేరుచేసి, ఆ పడమర భాగాన్ని ఫస్ట్ ఫేస్ కింద తీసుకోండి. ఉత్తరం రోడ్డు ఉంది కాబట్టి, ఈశాన్యంలో గేటుపెట్టి వెంచర్‌ను మొదలుపెట్టండి. ఆ తరువాత రెండో ఫేస్ కింద తూర్పు భాగాన్ని పూరించండి. ముందుగా అపార్ట్మెంట్ల ప్లాను, లే అవుట్ చక్కగా చేసుకొని, వాస్తుకు విరుద్ధం కాకుండా, దిశలకు ఇండ్లు కూర్చునేలా కట్టండి. ఇబ్బంది ఉండదు.
– బి. మోహన్ రావు, చింతల్.
ఇల్లు కూడా ఒక వాహనం లాంటిదే! బ్యాలెన్స్‌తో ఉండాలి. నీటిమీద నడిచే పడవను చూడండి.. అందులో సీటింగ్ చాలా బ్యాలెన్స్‌తో కూడుకొని ఉంటుంది. మనుషులు తక్కువ ఉంటే.. ఒకేవైపు కాకుండా, ఎదురెదురుగా కూర్చోబెడుతారు. కారణం.. దానిని నడిపేటప్పుడు మరోవైపు డొల్లిపోకుండా ఉండటానికి. ఇల్లుకూడా అంతే! పంచభూతాల బ్యాలెన్స్‌తో ఉండాలి.
దక్షిణం ఖాళీ అధికంగా ఉండటం వల్ల ఆర్థిక నష్టాలు, అనారోగ్యాలు, ఆడపిల్లల విషయంలో అనేక ఇబ్బందులు వస్తాయి. మీరు వీలుంటే ఆ స్థలాన్ని ఇతరులకు అమ్మండి. లేదంటే.. మీ ఇంటికి తగిన కొలతలతో మరో కాంపౌండు కట్టండి. దక్షిణం రోడ్డు ఉంటే.. అటువైపు కమర్షియల్‌గా షాపులు కట్టుకొని అద్దెకు ఇవ్వండి. లేదా ఉన్న ఇల్లు పాతది అయితే.. తీసేసి, మొత్తం స్థలాన్ని బట్టి చక్కని రచన చేసి, శాస్త్రపరంగా నూతన గృహాన్ని నిర్మించుకోండి. ఏదైనా లోపం తెలిసిన తర్వాత నివారించుకోవడం చక్కని పని.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678